MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devara: `దేవర` నుంచి రొమాంటిక్ అప్‌ డేట్‌.. తెలుగు థియేట్రికల్‌ రైట్స్ వాళ్లకే.. ఎంతకో తెలుసా?

Devara: `దేవర` నుంచి రొమాంటిక్ అప్‌ డేట్‌.. తెలుగు థియేట్రికల్‌ రైట్స్ వాళ్లకే.. ఎంతకో తెలుసా?

ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న `దేవర` చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్లు వచ్చాయి. తెలుగు రైట్స్ కి సంబంధించిన వార్త గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 02 2024, 09:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఆయన నటిస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది. పైగా సోలోగా సినిమా చేసి ఐదేళ్లు అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్, టీజర్‌, గ్లింప్స్ లు గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉన్నాయి. టాలీవుడ్‌ నుంచి మరో భారీ సినిమా రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. 
 

25

`దేవర` చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ వర్క్ షురూ చేస్తున్నారు. సినిమాకి రెండు నెలలే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచుతున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి రెండు అప్‌ డేట్స్ ఇచ్చింది టీమ్‌. సినిమా నుంచి రెండో సాంగ్‌ రాబోతుందట. ఈ నెల 5న రెండో పాటని విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ తెలిపింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో పడిపోతున్న హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ని ఓ చేతిలో పట్టుకుని రొమాంటిక్‌గా చూసుకోవడం ఆకట్టుకుంది. అంతేకాదు ఇందులో జాన్వీ కపూర్ లుక్‌ అతిలోక సుందరి శ్రీదేవిని తలపిస్తుండటం విశేషం. 
 

35
Devara

Devara

పోస్టర్‌ మాత్రం అదిరిపోయింది. ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్‌ సాంగ్‌ అని తెలుస్తుంది. దీనికి అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మొదటి పాట థీమ్‌ సాంగ్ విడుదలైంది. హీరో క్యారెక్టరైజేషన్‌ని తెలియజేసే ఈ పాట అదరగొట్టింది. శ్రోతలను, అభిమానులను అలరించింది. మరి రెండో పాట ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. 

45
Naga Vamsi

Naga Vamsi

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా తెలుగు రైట్స్ ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ సొంతం చేసుకున్నారు. తన సితార డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా `దేవర`ని విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలుగు వెర్షన్‌ రైట్స్ ని సొంతం చేసుకున్నట్టు తెలిపారు. అయితే ఎంతకు తీసుకున్నారనేది సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో 120-130కోట్లకు తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

55

ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ రైట్స్ సైతం భారీగానే అమ్ముడు పోయాయట. నెట్ ఫ్లిక్స్ ఈ రైట్స్ ని సొంతం చేసుకోగా, ఓటీటీ రూపంలోనే రూ.155కోట్లు నిర్మాతకు వచ్చినట్టు సమాచారం. దీంతోపాటు ఆడియో రైట్స్ 33 కోట్లకు టీ సిరీస్‌ దక్కించుకుందట. ఓవర్సీస్‌ రైట్స్ 40కోట్లు అని తెలుస్తుంది. వాస్తవం ఏంటనేది తెలియాలి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న `దేవర` చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 27న సినిమా విడుదల కాబోతుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Recommended image2
Oh My Goddess: అక్షయ్ కుమార్‌కు మరో షాక్, పెద్ద సినిమా నుంచి స్టార్ హీరోయిన్ సడెన్‌గా అవుట్!
Recommended image3
Vijay React on Divorce: భార్య సంగీతతో విడాకులు, తొలిసారి స్పందించిన విజయ్.. అభిమానులకు క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved