- Home
- Entertainment
- చేతులు పైకెత్తేసి వయ్యారాలు ఒలికిస్తున్న దేత్తడి హారిక.. మతిపోగొట్టేలా నడుము, అజంతా శిల్పమే
చేతులు పైకెత్తేసి వయ్యారాలు ఒలికిస్తున్న దేత్తడి హారిక.. మతిపోగొట్టేలా నడుము, అజంతా శిల్పమే
యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, సెటైరికల్, కామెడీ వీడియోలతో బాగా పాపులర్ అయింది హారిక. దేత్తడి అనే పదాన్నే ఇంటి పేరుగా మార్చుకుంది అలేఖ్య హారిక.

యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, సెటైరికల్, కామెడీ వీడియోలతో బాగా పాపులర్ అయింది హారిక. దేత్తడి అనే పదాన్నే ఇంటి పేరుగా మార్చుకుంది అలేఖ్య హారిక. ఇచ్చిపడేస్తా అంటూ బిగ్‌బాస్ 4లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బిగ్ బాస్ 4లో హారిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మేల్ కంటెస్టెంట్స్ కి ధీటుగా రాణించింది. బిగ్ బాస్ లో బాగా హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో హారిక కూడా ఒకరు. ఆమె టాప్ 5గా నిలిచింది. హారిక యూట్యూబ్ లో ఎంత ఫేమస్సో బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో అంతే పాపులర్ అవుతోంది.
తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ తనలోని బ్యూటీని బయట పడుతోంది. ట్రెండీ డ్రెస్సులు, లంగావోణీ, లెహంగా ఇలా విభిన్నమైన డ్రెస్సుల్లో హారిక గ్లామర్ ఒలకబోస్తోంది.
తాజాగా హారిక మరోసారి తన గ్లామర్ పదును చూపించింది. మోడ్రన్ డ్రెస్ లతో చీర కట్టులో తాను ఎంత అందంగా ఉంటానో చూపించింది. ఆకర్షించేలా ఉన్న బ్లూ శారీ ఒకెత్తయితే.. ఆమె వయ్యారాలు మరో ఎత్తు.
ముఖ్యంగా చేతులు పైకెత్తి మతిపోయే నడుముతో హారిక కిల్లింగ్ ఫోజులు ఇస్తోంది. ఈ ఫోటోలకు చెలియా చెలియా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనితో నెటిజన్లు కూడా హారిక అందం పోగొడుతూ పాటలు పడుతున్నారు.
హారిక అదిరిపోయే ఫోజులకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. విరహంతో ఉన్నట్లు టెర్రస్ పై హారిక మత్తుగా ఫోజులు ఇచ్చింది. హారిక నడుము సొగసుకి యువత చిత్తవుతున్నారు.