- Home
- Entertainment
- Tollywood: మీడియం బడ్జెట్ సినిమాలతో బడా స్టార్లని తొక్కేశారు.. 100 కోట్ల లాభాలు తెచ్చిన ముగ్గురు హీరోలు
Tollywood: మీడియం బడ్జెట్ సినిమాలతో బడా స్టార్లని తొక్కేశారు.. 100 కోట్ల లాభాలు తెచ్చిన ముగ్గురు హీరోలు
భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్లు వసూలు చేస్తుంటాయి. కానీ మీడియం బడ్జెట్ లో తెరకెక్కి ఏకంగా 100 కోట్ల లాభాలు తెచ్చిన సినిమాలు 3 మాత్రమే ఉన్నాయి.

మీడియం బడ్జెట్ సినిమాలు
చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చిన్న సినిమాలు కూడా ఊహకి అందని విధంగా విజయాలు అందుకోవడం చూస్తూనే ఉన్నాం. కంటెంట్ బావుంటే పెద్ద సినిమా, మీడియం సినిమా, చిన్న సినిమా అనే తేడా ఉండదు. ఎలాంటి సినిమాకి అయినా కలెక్షన్స్ అదిరిపోతాయి. అయితే మీడియం బడ్జెట్ సినిమాలతో ఏకంగా 100 కోట్ల లాభాలు రావడం అంటే మామూలు విషయం కాదు.
100 కోట్ల లాభాలు
ఇలా టాలీవుడ్ లో మూడుసార్లు మాత్రమే జరిగింది. మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన 3 సినిమాలు టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా చెప్పబడే స్టార్ల సినిమాలని తొక్కేసి 100 కోట్ల లాభాలు గడించాయి. ఆ సినిమాలు ఏంటి, ఆ హీరోలు ఎవరు అనేది ఈ జాబితాలో చూద్దాం.
హనుమాన్
డివోషనల్ టచ్ తో ఆంజనేయ స్వామి నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ఇది. తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ మూవీ మంచి సినిమా అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఈ రేంజ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రాన్ని కూడా హనుమాన్ తొక్కేసింది. ఏకంగా 100 కోట్లకు పైగా లాభాలు తీసుకువచ్చింది.
సంక్రాంతికి వస్తున్నాం
విక్టరీ వెంకటేష్ స్టార్ హీరోనే. కానీ ఆయన నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ మీడియం బడ్జెట్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. 2025 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్ మొత్తాన్ని వెంకీ తన వైపు తిప్పుకున్నారు. వెంకీకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉండే క్రేజ్ ఇతర హీరోలకు లేదు. దీనితో అదే సంక్రాంతికి విడుదలైన రాంచరణ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ కి గండి తప్పలేదు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ సంచలన విజయం అందుకుని 100 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది.
ఇరుముడి
రవితేజ వరుస పరాజయాల్లో ఉన్న సరైన సమయంలో రవితేజకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడింది. అది అలాంటి ఇలాంటి హిట్ కాదు. కేవలం రెండు వారాల్లోనే 100 కోట్ల లాభాలు తెచిపెట్టేంతగా. ఆ సినిమా మరేదో కాదు ఇటీవల విడుదలైన ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. యష్ నటించిన టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం పోటీగా వచ్చినా ఇరుముడి జోరు తగ్గలేదు. ఇరుముడి దెబ్బకి టాక్సిక్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తేలిపోయింది.

