MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగబాబు ప్రాణాల మీదకు తెచ్చిన చిరంజీవి టీనేజ్‌ పిచ్చి.. ఆ దెబ్బతో అమ్మాయిల వంక చూడటమే మానేశాడా?

నాగబాబు ప్రాణాల మీదకు తెచ్చిన చిరంజీవి టీనేజ్‌ పిచ్చి.. ఆ దెబ్బతో అమ్మాయిల వంక చూడటమే మానేశాడా?

మెగాస్టార్‌ చిరంజీవి టీనేజ్‌లో చేసిన పని ఆయన తమ్ముడు నాగబాబు ప్రాణాలకు మీదకు తెచ్చిందట. ఆ దెబ్బతో అమ్మాయిల వంకచూడటం మానేశాడా? 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 03 2024, 10:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్‌ చిరంజీవికి తమ్ముళ్లంటే ప్రాణం. అంతేకాదు కుటుంబానికి పెద్ద. వారి ఫ్యామిలీలో ఆయనే పెద్ద కొడుకు కావడంతో అందరికి సంబంధించిన బాగోగులు చిరంజీవినే చూసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్లు అయి ఎవరి లైఫ్‌లో వాళ్లు సెట్‌ అయ్యారు. కానీ చిన్నప్పుడు, వాళ్లు ఎదుగుతున్న సమయంలో మాత్రం చిరంజీవినే కేర్‌ టేకర్‌. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అయితే చిరంజీవి టీనేజ్‌లో చేసిన పని నాగబాబు ప్రాణాల మీదకు వచ్చింది. కొద్దిగా అయితే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. మరి చిరంజీవి ఏం చేశాడు? నాగబాబుకి ఏమైంది అనేది చూస్తే.. అది నిక్కర్లు వేసుకునే ఏజ్‌. కుర్రాళ్లంతా కలిసి ఎంజాయ్‌ చేస్తుంటారు. కొలను లాంటివి కనిపిస్తే ఈత కొడుతుంటారు. అదే సమయంలో అమ్మాయిలంటే క్రష్‌ కూడా ఉంటుంది. 
 

36

చిరంజీవి కూడా అదే ఏజ్‌లో ఉన్నాడు. అదే పరిస్థితుల్లో ఉన్నాడు. తమ్ముడు నాగబాబుతోపాటు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ కలిసి కాల్వలో ఈత కొట్టడానికి వెళ్లారు. నిక్కరు వేసుకుని ఉన్నాడు చిరు. పైన షర్ట్ లేదు. ఈత కొడుతుండగా, అటు వైపు అమ్మాయిలు వచ్చారు. రేగిపళ్లు తెంపుకుంటున్నారు. వాళ్లని చూసి మనసులో తెలియని ఫీలింగ్‌. వాళ్లని చూస్తూ ఉండిపోయాడు చిరు. అమ్మాయిల మోజులో పడి తమ్ముడు నాగబాబుని మర్చిపోయాడు. 
 

46

నాగబాబు ఈతకొట్టే క్రమంలో జారి నీళ్లల్లో పడ్డాడు. ఈత సరిగా రాక మునుగూ తేలుతున్నాడు. అమ్మాయిలను చూసే మూడ్‌లో ఉన్న చిరు లేట్‌గా నాగబాబుని గమనించాడు. అప్పటికే ఆయన నీళ్లలో మునిగిపోతున్నాడు. వామ్మో అని దెబ్బకి దూకి తమ్ముడిని బయటకు తీసుకొచ్చి, పొట్ట గట్టిగా నొక్కగా, మొత్తానికి బతికిపోయాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్నుంచి అమ్మాయిలను చూడాలంటే చిరంజీవికి భయం అట. ఎవరైనా ఎదురుపడితే తలదించుకునే వెళ్లేవాడట. అలా చాలా రోజులు చేసినట్టు చెప్పాడు చిరు. 
 

56

ఈ సందర్భంగా కాలేజ్‌ డేట్‌ క్రష్‌ గురించి చెబుతూ, కాలేజ్‌ రోజుల్లో బస్సుల్లో ఎక్కినప్పుడు అమ్మాయిలు వస్తే లేచి వాళ్లకి సీటు ఇచ్చేవాళ్లట. అయితే వాళ్లమీద గౌరవంతోనే, లేక తాను జెంటిల్‌మేన్‌ అని నిరూపించుకోవడం కోసమో కాదు, అలా అయితే తన వంక చూస్తారని, తనకు పడతారని భావించేవాడట. కానీ అలా ఎవరూ పడలేదని చెప్పారు చిరు. ఫైనల్‌గా సురేఖ పడిందని చెప్పి నవ్వులు పూయించారు. సింగర్‌ స్మితకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను చిరంజీవి పంచుకున్నాడు. 
 

66

చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నాడు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. వచ్చేసంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Murali Mohan: ఆ హీరోయిన్ తో రెండో పెళ్లి అంటే జీవితం నాశనమే..హీరోకి నిర్మాత వార్నింగ్, భార్య రియాక్షన్ ఇదే
Recommended image2
Sai Pallavi: ఆ సినిమాకు నేను కరెక్ట్ కాదు.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Karthika Deepam 2 Today Episode: స్వప్న చెంప పగలకొట్టిన కావేరి- ఒక్కటైన కాశీ, స్వప్న- అంతా నటనేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved