MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: మాళవికను దారుణంగా అవమానించిన భ్రమరాంబిక.. యష్ పై సీరియస్ అయిన వేద?

Ennenno Janmala Bandham: మాళవికను దారుణంగా అవమానించిన భ్రమరాంబిక.. యష్ పై సీరియస్ అయిన వేద?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 17వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

3 Min read
Author : Navya G
Published : Jan 17 2023, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో వేద,యష్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అప్పుడు రాజా రాణి ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఏంటి రాణి ఇది పిల్లలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది వాళ్ళు కలిసి ఉన్నారా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాణి పడకగదిలో ఒకే మంచం పై ఇద్దరు కలిసి ఉన్నా కూడా వారి మధ్య దూరం ఉంది అంటే ఇక వారు ఎప్పటికీ దగ్గర కాలేరు కదా అని అంటుంది. అప్పుడు రాజా మనసులో ప్రేమ ఉంటే దూరం అన్న పదం వినిపించదు. నువ్వే కాదు నేను కూడా వాళ్ళని బాగా గమనించాను. వాళ్లకి ఒకరిపై ఒకరికి ప్రేమ గౌరవం ఉన్నాయి. కానీ బయటపడటం లేదు అని అంటాడు రాజా. వాళ్లు మన కోసం నటించారు కానీ అదే నిజమైన ప్రేమ అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అంతేకాదు మనం ఎంతో జీవితాన్ని చూసాము నటనకు ప్రేమకు తేడా తెలియదని వాళ్లు అనుకుంటున్నారు అంటాడు రాజా. వాళ్లు ఎప్పటికైనా ఒకటవుతారు నువ్వు బాధపడకు అని రాణి కి ధైర్యం చెబుతూ ఉంటాడు రాజా. మరొకవైపు యష్, వేద కార్లు వెళ్తూ ఉండగా ఒకటవుదామని వచ్చాము కానీ ఒప్పంద బంధం తప్పితే మా మధ్య ఏ బంధము చిగురించలేదు అని బాధపడుతూ ఉంటుంది.  అప్పుడు ఏంటి వేద అమ్మమ్మ వాళ్ళని వదిలి వెళుతున్నందుకు బాధపడుతున్నావా అనగా లేదని అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది వేద. నేను నిజంగానే ఆయన్ని ప్రేమిస్తున్నానా ఆయన నన్ను ప్రేమించడం లేదా. మా మధ్య కేవలం ఒప్పందం మాత్రమే ఉందా , అంటూ యష్ వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది వేద.

37

లేదంటే నేనే ఆయన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా అసలు ఏం జరుగుతోంది అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటుంది వేద. అప్పుడు యష్ కూడా రాజా అన్నమాట తలుచుకుని వేదవైపు చూసి బాధపడుతూ ఉంటాడు. గ్రాండ్ పా చెప్పినట్టు నిజంగానే వేద మనసులో నేను ఉన్నానా అనుకుంటూ ఉంటాడు. భార్యగా నాతో జీవితం పంచుకోడానికి వేద రెడీగా ఉందా నేను ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు మాళవిక తన పింపుల్స్ గురించి ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి భ్రమరాంబిక వస్తుంది.
 

47

ఏంటి బంగారం డబ్బులు అంటున్నావు అనడంతో అదేం లేదు వదిన ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి కదా ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్న అంటుంది మాళవిక. ఆడవారికి అందమే కదా డబ్బులు ఖర్చు పెట్టడం అంటే తప్పులేదు కానీ ఆ డబ్బులు మనవైతే ఇంకా బాగుంటుంది అని అంటుంది భ్రమరాంబిక. ఓకే అవన్నీ వదిలేసెయ్ నేను తెప్పించిన కాస్మెటిక్స్ బాగున్నాయా అనడంతో సూపర్ గా ఉన్నాయి చాలా థాంక్స్ వదినా అంటుంది  మాళవిక. ఏమి అనుకోకుండా నాకు నెయిల్ పాలిష్ పెడతావా అని అడుగుతుంది భ్రమరాంబిక.అప్పుడు సరే వదినా అని చేతులకు పెడుతుండగా ఫస్ట్ కాళ్ళకి పెట్టు అని అంటుంది భ్రమరాంబిక. అప్పుడు కావాలనే భ్రమరాంబిక మల్లికను ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది.
 

57

 కావాలనే ఫోన్లో మాళవిక అనే అమ్మాయితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ మాలవికను దారుణంగా అవమానిస్తుంది భ్రమరాంబిక. నీలాంటి వాళ్లకు నా దగ్గర అవకాశం లేదు ఫోన్ పెట్టేయ్ అని అంటుంది. నువ్వు ఇంకా నా కాళ్ళ దగ్గరే కూర్చుంటే నాకు అది గుర్తుకు వస్తుంది అనడంతో ఎవరు వదిన నీ బెస్ట్ ఫ్రెండ్ ఆ అని అడగగా కాదు మా పెంపుడు కుక్క అని అంటుంది భ్రమరాంబిక. నాకు అది అంటే చాలా ఇష్టం తమాషా ఏంటో తెలుసా నేను కూడా దాన్ని బంగారం అని పిలుస్తాను నీలాగే అని ఆటిట్యూడ్ చూపించి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు మాలిని,సులోచన అందరు యష్ వేద వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
 

67

మరొకవైపు యష్,వేద కార్లు వస్తూ ఉండగా వేద ఎక్కడి వరకు వచ్చాము అనడంతో ఇంకొక గంటలో ఇంటికి వెళ్లి పోతాము అంటాడు. ఆ తర్వాత వేద యష్ ఇద్దరూ ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు యష్ నేను నువ్వు చెప్పినట్టు చేశాను కదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా విను అని నేను అనను కానీ మనం ఎంతో సంతోషంగా వెళ్ళామో అంతకు రెండింతల సంతోషంతో ఇంటికి వస్తున్నామని ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు ఇలా మూడిగా ఉంటే అందరూ బాధపడతారు కొంచెం సంతోషంగా ఉండు అని అంటాడు. అక్కడే కాదు ఇక్కడ కూడా మన నటన కంటిన్యూ చేద్దాము అని అంటాడు. అప్పుడు వేద కారు దిగి వెళ్లిపోయి ఏడుస్తూ ఉంటుంది.

77

అప్పుడు వేద ఏం మాట్లాడాలో తెలియక వేద, యష్ మీద సీరియస్ అవుతూ అక్కడే కాదు ఇక్కడ కూడా నటించాలని నాకు తెలియదా మీరు ఆ విషయం నాకు చెప్పాలా అని అంటుంది. వేద యష్ మీద అరిచి కోపంగా వెళ్లి కారులో కూర్చుంటుంది. ఒకవైపు మాలిని, సులోచన నేను దిష్టి తీస్తాను అంటే నేను దిష్టి తీస్తాను అంటూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి యష్ వేద రావడంతో ఖుషి ఆనందంగా వెళ్లి హత్తుకుంటుంది.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved