- Home
- Entertainment
- Project K రచ్చ.. `బ్లాక్ ఆడమ్`, ఐరన్ మ్యాన్` కలిస్తే `ప్రాజెక్ట్ కే`.. కామిక్ కాన్‌లో భారతీయత అంటే ఇదేనా?
Project K రచ్చ.. `బ్లాక్ ఆడమ్`, ఐరన్ మ్యాన్` కలిస్తే `ప్రాజెక్ట్ కే`.. కామిక్ కాన్‌లో భారతీయత అంటే ఇదేనా?
ప్రభాస్ నటిస్తున్న `ప్రాజెక్ట్ కే` నుంచి ఆయన ఫస్ట్ లుక్ విడుదలైంది. అమెరికాలోని కామిక్ కాన్ ఫెస్టివల్‌లో ఈ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రస్తుతం ఇది అనేక విమర్శలను ఎదుర్కొంటుంది.

`బాహుబలి` తర్వాత ప్రభాస్‌ని ఏ దర్శకుడు సరైన విధంగా చూపించలేకపోతున్నారు. వీఎఫ్‌ఎక్స్ పేరుతో ఆయన్ని ఆడుకుంటున్నారు. ప్రభాస్ ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. `సాహో`, `రాధేశ్యామ్`, ఇటీవల వచ్చిన `ఆదిపురుష్` చిత్రాలు అన్నీ ఈ కోవలోకే చెందుతాయి. `సాహో` తీసుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని సరిగా తీయలేకపోయారు. ఆ విషయంలో దర్శకుడు సుజిత్ ఫెయిల్ అయ్యారు.
ఆ తర్వాత `రాధేశ్యామ్`లో ప్రేమ కథని, ఫాథాలజీని మేళవిస్తూ ప్రయత్నం చేయగా, అది వర్కౌట్ కాలేదు. ఇందులో ప్రభాస్ లుక్‌పై విమర్శలు వచ్చాయి. కథ పరంగానూ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఇటీవల వచ్చిన `ఆదిపురుష్` మరింత దారుణంగా ట్రోల్స్ కి గురయ్యింది. రామాయణాన్ని మరోలా చూపించడం, ప్రభాస్ లుక్, వీఎఫ్‌ఎక్స్ పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ధారుణమైన విమర్శలపాలయ్యింది.
ఇలా ప్రభాస్‌కి `బాహుబలి` తర్వాత వరుస పరాజయాలే చవి చూశాయి. `బాహుబలి`లో ఆయన లుక్ అల్టీమేట్. యుద్ధ వీరుడిగా, రాజుగా అదరగొట్టారు. కథకి, ఆయన లుక్ పర్‌ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఎమోషన్స్ యాడ్స్ కావడంతో సినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. మళ్లీ ఇప్పటి వరకు ఏ దర్శకుడు దాన్ని అందుకోలేకపోయారు. దగ్గర వరకు కూడా చేరుకోలేకపోయారు. ఓ రకంగా ప్రభాస్‌ని పెట్టుకుని చెత్త సినిమాలు చేస్తున్నారనే విమర్శలు ఫ్యాన్స్ నుంచి వినిపిస్తుంది. `అరే డార్లింగ్‌ని ఏం చేస్తున్నార్రా` అంటూ విమర్శిస్తున్నారు ఫ్యాన్స్. వారి విమర్శలకు తగ్గట్టుగానే సినిమా లుక్‌లు,ట్రైలర్లు ఉండటం గమనార్హం.
సినిమా మేకింగ్‌లో మన వాళ్లకి మంచి ఇమేజ్ ఉంది. ముఖ్యంగా తెలుగులో వస్తోన్న సినిమాపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. `కేజీఎఫ్, `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాలు అంతర్జాతీయంగా సత్తా చాటాయి. `కాంతార` కూడా సంచలనాలు సృష్టించింది. మేకింగ్ పరంగా ఈ చిత్రాలు పీక్‌లో ఉన్నాయి. ది బెస్ట్ అనిపించుకున్నాయి. కానీ ఇప్పుడు `ప్రాజెక్ట్ కే` విషయంలో ఆ డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే కాదు ప్రభాస్ సినిమాలన్నీ `సాహో`, `రాధేశ్యామ్`, `ఆదిపురుష్` ల విషయంలో ఇదే మిస్టేక్ జరిగింది. ప్రభాస్ లుక్ నుంచి, పాత్రల చిత్రణ, కథ నడిచే విధానం వరకు క్లారిటీ మిస్ అయ్యింది. ఎమోషన్స్ మిస్ అవుతున్నాయి. గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ అయితే మరీ దారుణంగా మారిపోయాయి. `రాధేశ్యామ్`, `ఆదిపురుష్`పై విమర్శలు వచ్చినట్టే ఇప్పుడు `ప్రాజెక్ట్ కే` ప్రభాస్ ఫస్ట్ లుక్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్ బెటర్ అంటున్నారు చాలా మంది. కనీసం క్వాలీటీ లేదని, మినిమమ్ జాగ్రత్తలు కూడా తీసుకోలేదని అంటున్నారు.
అయితే కామిక్ కాన్‌లో జస్ట్ బిగినింగ్ కాబట్టి ప్రభాస్ లుక్‌ని ఏదో రిలీజ్ చేశారనుకుంటే.. టీజర్, ట్రైలర్ లు అదిరిపోతాయంటే.. `ఆదిపురుష్` విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. ఫస్ట్ లుక్, టీజర్‌పై విమర్శలు వచ్చాయి. ట్రైలర్ లో జాగ్రత్త పడ్డారు. కానీ సినిమాలో దొరికిపోయారు. బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాని తీశారు. ప్రభాస్‌ని పెట్టుకుని చెత్త సినిమా చేశారు. ఇప్పుడు `ప్రాజెక్ట్ కే ` విషయంలో అదే రిపీట్ అవుతుందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకే ఫ్యాన్స్ లో ఆ ఆశలు లేవు. ఫస్ట్ లుక్‌తోనే ఆ ఆశలను నీరుగార్చేస్తున్నారు.
Photo Courtesy: Instagram
వీఎఫ్‌ఎక్స్(గ్రాఫిక్స్) మరీ సిల్లీగా ఉన్నారు. తాజాగా ప్రభాస్ ఫస్ట్ లుక్‌లో ఓ ఐరన్ మ్యాన్ బాడీకి ప్రభాస్ తలని అంటించినట్టుగా ఉంది. ఏమాత్రం సహజత్వం లేదు. అది కచ్చితంగా అంటించిన ఫోటోనే అంటున్నారు చాలా మంది. మరోవైపు హాలీవుడ్ సూపర్ హీరో ఫిల్మ్స్ `బ్లాక్ ఆడమ్, ఐరన్ మ్యాన్, ఆదిపురుష్ కలిసి డిజైన్ చేసినట్టుగా `ప్రాజెక్ట్ కే` అంటున్నారు. కొంచెం ఫేస్‌లో మార్పులు ఉంది తప్పితే, ఈ మూడింటి కలయితే `ప్రాజెక్ట్ కే` అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు వీఎఫ్‌ఎక్స్ పరంగా చూస్తే.. టెక్నాలజీ పెరిగింది, గ్రాఫిక్స్ ప్రయారిటీ పెరిగింది, టెక్నీషియన్లు పెరిగారు. కానీ క్వాలిటీ మాత్రం రావడం లేదంటున్నారు. గతంలో వచ్చిన `క్రిష్`, `రావణ్` చిత్రాల వీఎఫ్‌ఎక్స్ చాలా బెటర్ అని అంటున్నారు. దీంతో సుమారు ఐదు వందల కోట్లతో రూపొందుతున్న `ప్రాజెక్ట్ కే`కి బడ్జెట్ ఎంత పెడుతున్నారు, ఆర్టిస్టులకు ఎంత ఇస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లకే ఖర్చు చేస్తున్నారని, సినిమాలకు ఖర్చు చేయడం లేదా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
`ప్రాజెక్ట్ కే` ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింమ్స్ ని కామిక్ కాన్ సాన్ డీయాగో వేడుకలో విడుదల చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా ఫస్ట్ లుక్ వదిలారు, ఎల్లుండి గ్లింమ్స్ రానుంది. అయితే కామిన్ కాన్‌లో వంటి వేడుకలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇదేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కామిక్ కాన్‌లో భారతీయత అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని విధంగా ఉందంటున్నారు. ఇలా ఒక చెత్త పోస్టర్ వదిలి కామిక్ కాన్ లో అదిరిపోయే గ్లింప్స్ అప్పటివరకు ఈ చెత్త ట్రైలర్ వల్ల జనల నోట్లో నానడం మేకర్స్ స్ట్రాటజీ అని నమ్ముతున్నారు.
Project K
ప్రభాస్‌తోపాటు దీపికా పదుకొనె, దిశా పటానీ జంటలుగా చేస్తుండగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతుంది. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుందని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది.