MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌

Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌

Agnipariksha 2: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రారంభానికి మరికొన్ని గంటలే ఉంది. ఆదివారం సాయంత్రం స్టార్ట్ కాబోతుంది. అయితే హౌజ్‌లోకి అడుగుపెట్టే మొదటి కంటెస్టెంట్‌ ఫైనల్‌ అయ్యారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 05 2026, 11:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రారంభానికి రంగం సిద్ధం
Image Credit : x/@starmaa

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రారంభానికి రంగం సిద్ధం

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్‌ బాస్‌ తెలుగు 10 రియాలిటీ షో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతుంది. ఆదివారం(సెప్టెంబర్‌ 6) సాయంత్రం 7గంటలకు ఇది ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్టు జరుగుతున్నాయి. ఎపిసోడ్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. గత 9 సీజన్లకి భిన్నంగా, సరికొత్తగా ఈ సీజన్‌ ఉండబోతుందని తెలుస్తోంది. హోస్ట్ నాగార్జున పదే పదే ఈ విషయాన్ని చెబుతున్నారు. అదే రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సారి బిగ్‌ బాస్‌ లోకి వచ్చే కంటెస్టెంట్లు కూడా పాపులర్‌ సెలబ్రిటీలు కావడం విశేషం. ఈ క్రమంలో కామనర్స్ ని ఎంపిక చేసే అగ్నిపరీక్ష 2 నుంచి ఎంపికయ్యే కంటెస్టెంట్లకి సంబంధించి అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కామనర్స్ నుంచి సింగర్‌ ఝాన్సీ సంచలనం
Image Credit : Asianet News

కామనర్స్ నుంచి సింగర్‌ ఝాన్సీ సంచలనం

`అగ్నిపరీక్ష2` నుంచి కామనర్స్ ని ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆరుగురుని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ఎవరెవరు వస్తారనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో తాజాగా శనివారం సాయంత్రం `అగ్నిపరీక్ష 2` గ్రాండ్‌ ఫినాలే జరిగింది. ఇందులో ఒక్క కామనర్‌ని బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌గా ఎంపిక చేశారు. అందులో భాగంగా `అగ్నిపరీక్ష 2` గేమ్‌లో సింగర్‌ ఝాన్సీ విజేతగా నిలిచింది. ఆమె అనేక టాస్క్ ల్లో విజయం సాధిస్తూ వచ్చింది. చివరికి విన్నర్‌గా నిలిచి బిగ్‌ బాస్‌ తెలుగు 10కి డైరెక్ట్ గా ఎంపికైంది. రేపు ఆదివారం సాయంత్రం గ్రాండ్‌ ఓపెనింగ్‌ ద్వారా హౌజ్‌లోకి ఆమె ఎంట్రీ ఇవ్వబోతుంది.

34
బిగ్‌ బాస్‌  తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఝాన్సీ
Image Credit : Asianet News

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఝాన్సీ

బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి ఎవరెవరు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. రూమర్స్ లిస్ట్ వైరల్‌ అవుతుంది. కానీ అధికారికంగా మాత్రం సింగర్‌ ఝాన్సీ ఎంపికైంది. డైరెక్ట్ గా హౌజ్‌లోకి అడుగుపెట్టబోతుంది. దీంతో ఆమె సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. రైతు బిడ్డగా, ఫోక్‌ సింగర్‌గా పాపులర్‌ అయిన ఝాన్సీ.. కామనర్స్ విభాగంలో అనేక టెస్ట్ లు పాస్‌ అయి అగ్నిపరీక్ష 2కి వచ్చింది. ఇందులోనూ తన సత్తా చాటుతూ ఇప్పుడు ఏకంగా విన్నర్‌ అయ్యింది. హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్న తొలి కంటెస్టెంట్ గా రికార్డు సృష్టించింది ఝాన్సీ. ఇక కామనర్స్ నుంచి ఇంకా ఎవరెవరు రాబోతున్నారనేది వారికి వచ్చిన ఓటింగ్‌ని బట్టి నిర్ణయిస్తారు.

44
బిగ్‌ బాస్‌ తెలుగు 10 కంటెస్టెంట్ల లిస్ట్
Image Credit : Asianet News

బిగ్‌ బాస్‌ తెలుగు 10 కంటెస్టెంట్ల లిస్ట్

తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. ఝాన్సీతోపాటు అమన్‌, ఆర్జే చరణ్‌, రోహిత్‌ నాయుడు, షాలిని, సృష్టి వ్యాకరణం కామనర్స్ కేటగిరిలో బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి రాబోతున్నట్టు సమాచారం. వీరికి సంబంధించి ఓపెనింగ్‌లోనే క్లారిటీ రానుంది. అలాగే సెలబ్రిటీ విభాగంలో టెంపర్‌ వంశీ, త్రిగుణ్‌, రామ్‌ ప్రసాద్‌, జబర్దస్త్ నరేష్‌, దేబ్జానీ, వర్షిణి సౌందరాజన్‌, చైత్ర రాయ్‌, కృష్ణుడు, సుధీర్‌ రెడ్డి, ముఖేష్‌ గౌడ వంటి వారు రాబోతున్నారట. అలాగే గుండెనిండా గుడిగంటలు ఫేమ్‌ విష్ణు కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇది కూడా ఆదివారం సాయంత్రం క్లారిటీ రానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: గుండె నిండా గుడిగంటలు హీరో విష్ణు బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ..లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే
Recommended image2
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved