MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌

Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌

Raj Tarun: రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న మూవీ `టార్టాయిస్‌`. తన కెరీర్‌లోనే మొదటిసారి ఈ కొత్త జోనర్‌ మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే మెలోడీ సాంగ్‌ విడుదలైంది. అది హంట్‌ చేస్తోంది.

3 Min read
Author : Aithagoni Raju
Published : Sep 05 2026, 09:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టార్టాయిస్‌తో రాబోతున్న రాజ్‌ తరుణ్‌
Image Credit : Asianet News

టార్టాయిస్‌తో రాబోతున్న రాజ్‌ తరుణ్‌

రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ ఇటీవల కొంత ఆటుపోట్లతో సాగుతుంది. ఆయన సినిమాలు సరైన ఆదరణ పొందలేదు. ఈ క్రమంలో ఇప్పుడు రూట్‌ మార్చారు. తన బలం అయిన లవ్‌ స్టోరీస్‌తో రాబోతున్నారు. తాజాగా ఆయన `టార్టాయిస్‌` అనే చిత్రంలో నటించాడు. ఇందులో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరి దృష్టినీ ఆకర్షించిందీ సినిమా. లేటెస్ట్ గా ఈ చిత్రంలోని `నీ పరిచయం..` పాటను విడుదల చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టార్టాయిస్‌ నుంచి అదిరిపోయే మెలోడీ సాంగ్‌ ఔట్‌
Image Credit : Asianet News

టార్టాయిస్‌ నుంచి అదిరిపోయే మెలోడీ సాంగ్‌ ఔట్‌

చంద్రబోస్‌ రాసిన ఈ మెలోడీ సాంగ్‌ని చిన్మయి ఆలపించారు. అనూప్‌ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఈ మెలోడీ సాంగ్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కట్టిపడేస్తోంది. సినిమాకే ఇది హైలైట్‌గా నిలుస్తుందట. ఈ పాట విడుదల సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ, `మా మూవీ ఒక యూనిక్ థ్రిల్లర్. థియేటర్స్ లో మిమ్మల్ని కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తుంది. ఈ చిత్రంలో మంచి మెలొడీ సందర్భం వచ్చినప్పుడు అనూప్ బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. ఈ పాటను అందంగా పాడిన చిన్మయి గారికి, సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ గారికి థ్యాంక్స్. ఈ పాటకు మా డైరెక్టర్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఎంతో బాగా తెరకెక్కించాడు. అమృత చాలా తక్కువ టైమ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోతుంది. అవసరాల శ్రీనివాస్, ధన్యతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. త్వరలోనే థియేటర్స్ లోకి మా మూవీ రాబోతోంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా` అని అన్నారు.

ప్రేమ, ఆర్తి, అక్కెరతో కూడుకున్న పాట

లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ, ప్రేమ, ఆర్తి, అక్కెరతో కూడుకున్న పాట ఇది. ఈ పాటను అత్యద్భుతంగా కంపోజ్ చేసిన అనూప్ కి, అంతే అద్భుతంగా పాడిన చిన్మయి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ పాట మీ అందరినీ అలరిస్తుంది, ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకుంది` అని చెప్పారు. ప్రొడ్యూసర్ విజయ్ చౌదరి మాట్లాడుతూ, నీ పరిచయం సాంగ్ మా మూవీకి పిల్లర్ లాంటిది. ఎమోషనల్ గా సాగే ఈ పాట మీ అందరినీ ఆకట్టుకుంటుంది. నాతో పాటు ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన మిత్రులు శశి, రాంబాబు నాకు చాలా సపోర్ట్ అందించారు. ఈ పాటలో రాజ్ తరుణ్, అమృత పర్ ఫార్మెన్స్ ఆకర్షణగా నిలుస్తుంది` అని వెల్లడించారు.

రాజ్‌ తరుణ్‌ తమ్ముడిలాంటి వాడు

యాక్టర్ అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ, చిన్మయి గారి గాత్రం, అనూప్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఈ పాట వింటుంటే సినిమాలో ఈ సాంగ్ కు ఉండే ఇంపార్టెన్స్ తెలిసింది. ఇంతమంచి సాంగ్ రాసిన చంద్రబోస్ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అమృత పర్ ఫార్మెన్స్ చూస్తుంటే కొత్త అమ్మాయిలా అనిపించలేదు. ఆమెకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. ధన్యతో నేను కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది. రాజ్ తరుణ్ ఈ చిత్రంలో నా తమ్ముడిగా కనిపిస్తాడు. రాజ్ తరుణ్ తో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఈ మూవీకి థియేటర్స్ లో మీరు ఇచ్చే రెస్పాన్స్ చూడాలనే ఎగ్జైట్ మెంట్ తో ఉన్నాను`అని చెప్పారు.

33
రాజ్‌ తరుణ్‌ కిది సరికొత్త జోనర్‌
Image Credit : Asianet News

రాజ్‌ తరుణ్‌ కిది సరికొత్త జోనర్‌

డైరెక్టర్ రిత్విక్ కుమార్ మాట్లాడుతూ, నీ పరిచయం అంటూ ఈ పాటను చంద్రబోస్ గారు ఏ ఇంటెన్షన్ తో రాశారో గానీ మేమంతా ఇండస్ట్రీకి తొలి పరిచయాలే. ఫుల్ ఎగ్జైట్ మెంట్ తో ఉన్న థ్రిల్లర్ సినిమాలో లవ్ ఎలిమెంట్ తీసుకొచ్చి దాన్ని టర్న్ చేస్తూ థ్రిల్లర్ లోకి తీసుకెళ్లే క్యారెక్టర్ చేశారు రాజ్ తరుణ్. ఇదే ఈ సినిమాకు అతిపెద్ద ఫ్లస్ పాయింట్. ఈ జానర్ లో చూస్తే రాజ్ తరుణ్ కి ఈ సినిమా తొలి పరిచయం. హీరోయిన్ అమృతకు తొలి పరిచయం. ఈ సినిమాలో 80 సీన్స్ ఉంటే 70 సీన్స్ లో శ్రీనివాస్ అవసరాల ఉంటారు. ఆయనది అంత ఫుల్ లెంగ్త్ రోల్. వదిన అంటే తల్లి. అలాంటి పాత్రను ధన్య గారు చేశారు. వీళ్లంతా సూపర్బ్ పర్ ఫార్మెన్స్ చేశారు. సినిమా వేరే లెవెల్లో వచ్చింది. 'ఊపిరి అందని నాకు నువ్వే చిరుగాలి..' వంటి అందమైన లైన్స్ తో చంద్రబోస్ గారు ఈ పాటను రాశారు. ఈ పాట హీరోయిన్ క్యారెక్టర్ ను ప్రతిబింబిస్తుంది. బొమ్మరిల్లు, మజిలీ లాంటి చిత్రాలను థ్రిల్లర్ చేస్తే ఎలా ఉంటుందో మా టార్టాయిస్ సినిమా అలా ఉంటుంది. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. ఈ కథలో ఐదు ట్విస్టులు ఉంటాయి. ప్రతి 25 నిమిషాలకు ఒక బాంబ్ లా ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ ఐదు ట్విస్ట్ లు ఎవరూ కనుక్కోలేరు. అందరూ ఫుల్ ఎగ్జైట్ అవుతారు. ఇది హీరోయిన్ క్యారెక్టర్ సాంగ్, నెక్ట్స్ హీరో క్యారెక్టర్ సాంగ్ రిలీజ్ చేస్తాం. మా సినిమాలో మూడు డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి. మూడు పాటలు ఎవరెస్ట్ లా ఉంటాయని అనుకోవచ్చు` అని వెల్లడించారు. ఇంకా ఇందులో నిర్మాతలు శశిధర్‌, రామిరెడ్డి రాంబాబు, ధన్య బాలకృష్ణ, సింగర్‌ చిన్మయి, హీరోయిన్‌ అమృత చౌదరి, మ్యూజిక్ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్,

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Bathukamma Songs: యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న టాప్ 5 బతుకమ్మ పాటలు ఇవే
Recommended image2
Jr NTR: నా ఇమేజ్ వల్ల ఆ సినిమా పాడైపోయేది, అందుకే పక్కన పెట్టా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఆలోచించారా ?
Recommended image3
ఎక్కువ సినిమాలు చేసిన పాపానికి తప్పుడు లింకులు పెట్టారు.. సీనియర్ నటి సంచలన కామెంట్స్
Related Stories
Recommended image1
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image2
Soundarya: సౌందర్య వల్లే `మిస్ యూ' అనే పదం ఎంత భారమైనదో తెలిసింది.. అర్జున్‌ సర్జా ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved