- Home
- Entertainment
- Shalini Damera: అభిజీత్‌తో షూస్ తుడిపించుకొని ఏకంగా బిగ్ బాస్ 10 హౌజ్‌లో తిష్ట.. షాలిని దామెర లెక్క వేరే లెవల్
Shalini Damera: అభిజీత్‌తో షూస్ తుడిపించుకొని ఏకంగా బిగ్ బాస్ 10 హౌజ్‌లో తిష్ట.. షాలిని దామెర లెక్క వేరే లెవల్
కామనర్‌గా వచ్చి `అగ్నిపరీక్ష`లో పాల్గొని రచ్చ చేసింది షాలిని దామెర. తనదైన ఆటతో మెప్పించిన ఆమె ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10కి ఎంపికైంది. మరి ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది చూస్తే.

బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి కామనర్ షాలిని దామెర
బిగ్ బాస్ తెలుగు 10లోకి కామనర్ విభాగంలో గ్లామర్ బ్యూటీ షాలిని దామెర అడుగుపెట్టారు. అందంతో ఆకట్టుకోవడంతోపాటు తనదైన ఆటతో మెప్పించారు. అయితే షూట్ క్లీన్ చేసే విషయంలో అభ్యంతరం తెలిపి హాట్ టాపిక్ అయ్యారు. జడ్జ్ అయిన అభిజీత్ ఆమె షూస్ క్లీన్ చేయడం విశేషం. ఇది బాగా వైరల్ అయ్యారు. ఆ తర్వాత అగ్నిపరీక్షలో టఫ్ కాంపిటీషన్ ఇచ్చి మెప్పించారు. టాస్కుల్లో దూకుడుగా వ్యవహరించడం, తన నిర్ణయాలను గట్టిగా సమర్థించుకోవడంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్నిపరీక్షలో ఆమె పలుమార్లు లీడర్‌గా నిలవడంతో పాటు, ఇతర కంటెస్టెంట్లతో పోటీ పడుతూ తన గేమ్ ప్లాన్‌ను చూపించారు. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ ని సొంతం చేసుకున్నారు.
సోషల్ మీడియాతో గుర్తింపు
కరీంనగర్‌కి చెందిన షాలిని దామెర సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఫ్యాషన్, రీల్స్, ఫొటోషూట్స్, డిజిటల్ కంటెంట్ ద్వారా నెటిజన్లకు పరిచయం అయ్యారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులర్ అయ్యారు. అగ్నిపరీక్షలో పాల్గొన్న తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో మరింత ఫాలోయింగ్ పెరిగింది.
అగ్నిపరీక్షలో అసలు హైలైట్!
అగ్నిపరీక్షలో షాలిని ఆటతీరు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ముఖ్యంగా టాస్కుల్లో తన నిర్ణయాలపై వెనక్కి తగ్గకుండా వాదించడం, ఇతరులను ఎదుర్కోవడం, టీమ్‌ను నడిపించడం వంటి అంశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఒక ఎపిసోడ్‌లో ఆమెకు ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా గుర్తింపు తెచ్చుకుంది.
బిగ్‌బాస్‌లో ఏం చేస్తుందో?
అగ్నిపరీక్షలోనే దూకుడైన గేమ్, వాదనల్లో వెనక్కి తగ్గని వైఖరితో కనిపించిన షాలిని.. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా ఆడబోతారన్నది ఆసక్తికరంగా మారింది. కామనర్‌గా వచ్చిన ఆమెకు ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన గుర్తింపు ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. కప్పే లక్ష్యంగా ముందుకు సాగే ఆమె బిగ్ బాస్ హౌజ్‌లో ఎంత వరకు రచ్చ చేస్తుందో చూడాలి.

