MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Thrigun: సక్సెస్‌ లేక పేరు మార్చుకున్న త్రిగుణ్‌, అయినప్పటికీ స్ట్రగుల్స్.. బిగ్‌బాస్‌ తెలుగు 10 బ్రేక్‌ ఇస్తుందా?

Thrigun: సక్సెస్‌ లేక పేరు మార్చుకున్న త్రిగుణ్‌, అయినప్పటికీ స్ట్రగుల్స్.. బిగ్‌బాస్‌ తెలుగు 10 బ్రేక్‌ ఇస్తుందా?

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు త్రిగుణ్‌. సక్సెస్‌ లేకపోవడంతో పేరు మార్చుకున్న ఆయన ఇప్పుడు బిగ్‌ బాస్‌ తెలుగు 10లోకి అడుగుపెట్టారు. మరి ఈ షో తర్వాత అయినా లక్‌ కలిసి వస్తుందా?

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 06 2026, 07:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి త్రిగుణ్‌
Image Credit : instagram/@thrigun_aactor

బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి త్రిగుణ్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10లో టాలీవుడ్‌ హీరో త్రిగుణ్‌ అడుగుపెట్టారు. ఒకప్పుడు అదిత్‌ అరుణ్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. 2022లో తన స్క్రీన్‌ నేమ్‌ను త్రిగుణ్‌గా మార్చుకున్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రావడం విశేషం. చాలా కాలంగా సినిమాలు చేస్తున్నా, సరైన బ్రేక్‌ రాలేదు. మంచి టాలెంట్‌ అయినా ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు తానేంటో నిరూపించుకునేందుకు బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రావడం విశేషం. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ బిగ్‌ బాస్‌ తెలుగు 10 షో ఈ ఆదివారం(సెప్టెంబర్‌ 6)న ప్రారంభమైన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చెన్నైలో పుట్టి.. వైజాగ్‌లో చదువు
Image Credit : instagram/@thrigun_aactor

చెన్నైలో పుట్టి.. వైజాగ్‌లో చదువు

ఈ సందర్భంగా త్రిగుణ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి చూస్తే.. త్రిగుణ్‌ అసలు పేరు అరుణ్‌ ఈశ్వర్‌. ఆయన చెన్నైలో జన్మించారు. అయితే పాఠశాల విద్యను విశాఖపట్నంలో పూర్తి చేశారు. అనంతరం చెన్నైలోని మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో జర్నలిజం చదివారు. సినిమాల్లోకి రాకముందు థియేటర్‌, షార్ట్‌ ఫిల్మ్స్‌లో పనిచేశారు. సెమీ ప్రొఫెషనల్‌ స్థాయిలో పలు స్టేజ్‌ షోల్లోనూ నటించారు. ఈ అనుభవమే ఆయనను సినిమాల వైపు తీసుకెళ్లింది.

35
‘కథ’తో హీరోగా ఎంట్రీ
Image Credit : instagram/@thrigun_aactor

‘కథ’తో హీరోగా ఎంట్రీ

త్రిగుణ్‌ సినీ ప్రయాణం 2009లో విడుదలైన ‘కథ’ సినిమాతో మొదలైంది. ఈ సినిమాలో కృష్ణ పాత్రలో నటించారు. ప్రకాశ్‌రాజ్‌తో జరిగిన ఆడిషన్‌ ద్వారా ఆయనకు ఈ అవకాశం లభించింది. ఆ తర్వాత తమిళంలో ‘ఇనిదు ఇనిదు’, ‘తనీర్‌ విధూతి’ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో ‘వీకెండ్‌ లవ్‌’, ‘తుంగభద్ర’, ‘L7’, ‘మ‌న‌సుకు నచ్చింది’, ‘24 కిస్సెస్‌’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘డియర్‌ మేఘ’, ‘WWW’, ‘కథ కంచికి మనం ఇంటికి’, ‘కొండ’, ‘ప్రేమదేశం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించారు. ‘కొండ’ సినిమాలో కొండా మురళి పాత్ర పోషించడం ఆయన చేసిన కొత్త ప్రయత్నంగా చెప్పొచ్చు.

45
ఇతర భాషల్లోనూ సినిమాలు
Image Credit : instagram/@thrigun_aactor

ఇతర భాషల్లోనూ సినిమాలు

తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ త్రిగుణ్‌ నటించారు. ‘తంగమగన్‌’, ‘పొదు నలన్‌ కరుదీ’, ‘కాడవర్‌’, ‘డెవిల్‌’, ‘లైన్‌మ్యాన్‌’ వంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ‘లైన్‌మ్యాన్‌’లో ఆయన చేసిన పాత్ర ద్వారా కన్నడ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. 2024లో ఆయన ‘మ‌న‌మే’ వంటి సినిమాల్లోనూ కనిపించారు. ఇటీవల `చెన్నై లవ్‌ స్టోరీ`లో సెకండ్‌ హీరోగా మెరిసిన విషయం తెలిసిందే.

55
హీరోగా సరైన బ్రేక్‌ లేదు.. బిగ్‌ బాస్‌ బ్రేక్‌ ఇస్తుందా?
Image Credit : instagram/@thrigun_aactor

హీరోగా సరైన బ్రేక్‌ లేదు.. బిగ్‌ బాస్‌ బ్రేక్‌ ఇస్తుందా?

ఇదిలా ఉంటే చూడ్డానికి హీరో రామ్‌ లా ఉంటాడు త్రిగుణ్‌. అదే పెద్ద మైనస్‌గా చెబుతుంటారు. హీరోగా, నటుడిగా వివిధ భాషల్లో సినిమాలు చేయడం, ఓటీటీ ప్రాజెక్టుల్లో కనిపించడం ఆయన ఆదాయ వనరులుగా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి వచ్చిన త్రిగుణ్‌.. సినిమాల్లో కనిపించే హీరో ఇమేజ్‌కు భిన్నంగా తన అసలు వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు చూపించనున్నారు. మరి ఈ షో ద్వారా ఆయన మళ్లీ హీరోగా పుంజుకుంటాడా? తానేంటో నిరూపించుకుంటాడా అనేది చూడాలి. ఇక బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లైఫ్‌లో అతి కష్టమైనది ఒంటరితనం అని తెలిపారు. తనకు కూతురు పుట్టిందని, తన అమ్మకి గుర్తుగా ఆమెకి యూకి అనే పేరు పెట్టుకున్నట్టు చెప్పారు. అదే సమయంలో నాగార్జున నటించిన సినిమాలోని పాలపిట్టరో అనే పాట తనని ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved