అందాల అషురెడ్డి చీరకడితే కుర్ర గుండెల్లో అలజడే.. నడుము వొంపులతో కేక పెట్టిస్తున్నయంగ్ బ్యూటీ!
‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) చీరకట్టినా అందానికి కేరాఫ్ అడ్రస్ గానే మారుతోంది. లేటెస్ట్ ఫొటోస్ లోనూ హాట్ నెస్ ఏమాత్రం తగ్గడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సంక్రాంతి 2023 ఫెస్టివల్ సందర్భంగా అషురెడ్డి చీరకట్టింది. పండుగ వాతావరణాన్ని సూచించేలా సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ఎర్ర చీరకట్టిన సీతాకోకలా అషురెడ్డి మెరిసిపోతోంది. ఆకట్టుకుంటున్న శారీ లుక్ లో ఫొటోషూట్ కూడా చేసింది.
లేటెస్ట్ ఫొటోలను యంగ్ బ్యూటీ అషురెడ్డి తాజాగా తన అభిమానులు నెటిజన్లతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోషూట్ కోసం సంప్రదాయ దుస్తులను ధరించి, మెరిసిపోతోంది. ఎర్ర చీరలో దర్శనమిచ్చి గ్లామర్ బ్యూటీ ఫ్యాన్స్ కు ఫెస్టివల్ ట్రీట్ అందించింది.
అషురెడ్డి ట్రెడిషనల్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందానికి మంత్రముగ్ధులు అవుతున్నారు. ఎప్పుడూ మోడ్రన్ లుక్ లో, పొట్టి దుస్తుల్లో నెట్టింట దుమారం రేపు ఈ ముద్దుగుమ్మ ఈరోజు సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయడంతో ఖుషీ అవుతున్నారు.
చీరలో నిండుగా కనిపించడంతో చాలా అందంగా ఉన్నావు అషూ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇన్నాళ్లకైనా ఇలా దర్శనమివ్వడంతో సంతోషిస్తున్నారు. మరోవైపు చీరకట్టినా యంగ్ బ్యూటీ హాట్ నెస్ తగ్గలేదంటున్నారు.
సంప్రదాయ దుస్తుల్లోనూ హాట్ నెస్ ఏమాత్రం తగ్గడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నడుముు అందాలు చూపిస్తూ మతులు పోగొట్టేసింది. అలాగే చిరునవ్వులు, కవ్వించే పోజులతో కుర్ర గుండెల్లో అలజడి రేపుతోంది. టాప్ టు బాటమ్ అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటోంది.
అషురెడ్డి తాజా ఫొటోలను పంచుకుంటూ తన అభిమానులకు, నెటిజన్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ‘చీర అంటే సరళత మరియు హుందాతనం’ అంటూ చీరకున్న గొప్పతనాన్ని తెలియజేసింది. గతంలోనూ అషు చీరలో కనువిందు చేసింది.మళ్లీ ఇప్పుడు ఇలా అలరించింది.
ఇక డబ్ స్మాష్ వీడియోలతో ‘జూనియర్ సమంత’గా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది అషురెడ్డి. ఆర్జీవీ ఇంటర్వ్యూతో ‘బిగ్ బాస్’ సీజన్ 3తో టీవీ ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. రీసెంట్ గా ఓటీటీ లో ప్రసారం అయిన ఐదో సీజన్ లోనూ అలరించింది.
మరోవైపు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. చివరిగా హార్రర్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘ఫోకస్’లో పోలీస్ ఆఫీసర్ గా అలరించింది. ఇక రీసెంట్ గా ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ వేదికపై అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం మరిన్ని అవకాశాలను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది.