MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RC17: రామ్‌ చరణ్‌ సరసన 3200కోట్ల హీరోయిన్‌.. సుకుమార్‌ స్కెచ్‌ వేరే లెవల్‌

RC17: రామ్‌ చరణ్‌ సరసన 3200కోట్ల హీరోయిన్‌.. సుకుమార్‌ స్కెచ్‌ వేరే లెవల్‌

రామ్‌ చరణ్‌ `పెద్ది` తర్వాత ఇప్పుడు సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇందులో రూ.3200కోట్ల హీరోయిన్‌ చరణ్‌తో రొమాన్స్ చేయబోతుందట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 18 2026, 09:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సుకుమార్‌తో ఆర్‌సీ17 కోసం రెడీ అవుతున్న రామ్‌ చరణ్‌
Image Credit : Asianet News

సుకుమార్‌తో ఆర్‌సీ17 కోసం రెడీ అవుతున్న రామ్‌ చరణ్‌

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇటీవల `పెద్ది`తో విజయాన్ని అందుకున్నారు. `ఆచార్య`, `గేమ్‌ ఛేంజర్` వంటి డిజాస్టర్ల తర్వాత ఆయనకు `పెద్ది` మూవీ చాలా వరకు రిలీఫ్‌నిచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమా కమర్షియల్‌గా కొన్ని చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ కానప్పటికీ ఆడియెన్స్ ఆదరణ పొందడంలో సక్సెస్‌ అయ్యింది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో రామ్‌ చరణ్‌ నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. `ఆర్‌సీ17` వర్కింగ్‌ టైటిల్‌తో ఇది స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో ఆర్‌సీ 17
Image Credit : Asianet News

ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో ఆర్‌సీ 17

సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ `రంగస్థలం` అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు నాన్‌ బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేసింది. ఆ సమయంలోనే మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా చేయాలని భావించారు. `పుష్ప` చిత్రాల తర్వాత ఇప్పుడు సుకుమార్‌ మళ్లీ రామ్‌ చరణ్‌తోనే సినిమా చేయబోతున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ ని ప్రిపేర్‌ చేస్తున్నారు సుకుమార్‌. మరోవైపు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారట. అందులో భాగంగా ఇప్పుడు హీరోయిన్‌కి సంబంధించిన అప్‌ డేట్‌ షాకిస్తోంది.

Related Articles

Related image1
Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్
Related image2
Yash: అల్లు అరవింద్‌, రష్మిక మందన్నా ఇద్దరికీ కలిపి ఇచ్చిపడేసిన యష్‌.. అంత చులకనగా మాట్లాడతారా?
34
కియారా అద్వానీ ఫస్ట్ ఛాయిస్‌
Image Credit : KiaraAdvani@instagram

కియారా అద్వానీ ఫస్ట్ ఛాయిస్‌

`RC17`లో హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకోవాలనుకున్నారట. చాలా రోజుల క్రితమే ఆమెని ఫైనల్‌ చేసినట్టు వార్తలు వినిపించాయి. రామ్‌ చరణ్‌, కియారా కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. `వినయ విధేయ రామ`, `గేమ్‌ ఛేంజర్‌` చిత్రాలు రాగా, ఈ రెండూ పరాజయం చెందాయి. ఇంకా చెప్పాలంటే పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో కియారాతో రామ్‌ చరణ్‌ మరో సినిమా అంటే అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన మరో అప్‌ డేట్‌ వచ్చింది. కియారా స్థానంలో మరో హీరోయిన్‌ని పరిశీలిస్తున్నారు. ఒక సంచలన హీరోయిన్‌ని తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు రచ్చ చేస్తోంది.

44
రామ్‌ చరణ్‌ తో ధురంధర్‌ హీరోయిన్‌ రొమాన్స్ ?
Image Credit : saraarjunn

రామ్‌ చరణ్‌ తో ధురంధర్‌ హీరోయిన్‌ రొమాన్స్ ?

`ఆర్‌సీ17`లో రామ్‌ చరణ్‌తో రూ.3200కోట్ల హీరోయిన్‌ రొమాన్స్ చేయబోతుందట. ఆమెనే `ధురంధర్‌` హీరోయిన్‌ సారా అర్జున్‌. ఈ అమ్మడు `ధురంధర్‌`, `ధురంధర్‌ 2` చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. మొదటి మూవీ సుమారు రూ.1350కోట్లు రాబడితే, `ధురంధర్‌ 2` ఏకంగా రూ.1850కోట్లు వసూలు చేసింది. ఇండియన్‌ సినిమా రికార్డులు బ్రేక్‌ చేసింది. ఆల్మోస్ట్ `బాహుబలి 2`ని బీట్‌ చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్థాయిలో పాపులర్‌ అయ్యింది, స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది సారా అర్జున్‌. అదే సమయంలో హాట్‌ కేక్‌గానూ మారింది. దీంతో ఈ అమ్మడిని రామ్‌ చరణ్‌, సుకుమార్‌ సినిమా కోసం హీరోయిన్‌గా ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. రామ్‌ చరణ్‌ తో ఈ బ్యూటీ రొమాన్స్ చేస్తే ఆడియెన్స్ కి, మెగా అభిమానులకు మంచి ట్రీట్‌ అని చెప్పొచ్చు. దీన్ని ఈ ఏడాది చివర్లో ప్రారంభించేందుకు సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్
Recommended image2
Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
Recommended image3
Ravi Teja: 12 లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్
Recommended image2
Yash: అల్లు అరవింద్‌, రష్మిక మందన్నా ఇద్దరికీ కలిపి ఇచ్చిపడేసిన యష్‌.. అంత చులకనగా మాట్లాడతారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved