MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • NTR: లారీడు ఇసుకతో ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, పెద్దాయన ఫిట్నెస్ సీక్రెట్ అదేనా?

NTR: లారీడు ఇసుకతో ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, పెద్దాయన ఫిట్నెస్ సీక్రెట్ అదేనా?

NTR: ఇప్పుడంటే హీరోలు జిమ్ముల్లో తెగ వర్కౌట్లు చేసేస్తున్నారు కానీ.. ఆ కాలంలో హీరోలు ఫిట్ నెస్ కోసం ఏం చేసేవారో తెలుసా? మరీ ముఖ్యంగా నందమూరి నటసార్వభౌముడు ఎన్టీఆర్.. ఫిట్ గా ఉండటానికి చేసని సాహసం గురించి తెలిస్తే .. షాక్ అవుతారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 18 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు
Image Credit : Senior NTR\Twitter

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అంటే తెలుగువారికి ఓ ఎమోషన్. ఆయన గురించి కొత్తగా ఏ విషయం తెలిసినా జనాలు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఎన్టీఆర్ తన సినిమా జీవితంలో కానీ, పర్సనల్ లైఫ్‌లో కానీ క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. తెరపై ఆయన పోషించిన పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలు అంతగా ఆకట్టుకోవడానికి ఆయన పాటించిన కఠినమైన రోజువారీ దినచర్య, వ్యాయామాలే ప్రధాన కారణం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తెల్లవారుజామునే లేచి ఎన్టీఆర్ ఏం చేసేవారంటే?
Image Credit : Senior NTR\Twitter

తెల్లవారుజామునే లేచి ఎన్టీఆర్ ఏం చేసేవారంటే?

సీనియర్ నటుడు మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఫిట్‌నెస్ రహస్యాలు, శారీరక శ్రమ గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మురళీ మోహన్ చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ ప్రతిరోజూ తెల్లవారుజామున 3:00 గంటలకే నిద్రలేచేవారు. ఉదయమే నిద్రలేచిన తర్వాత వ్యాయామం చేయడం ఆయనకు అలవాటు కాగా, ఆయన వ్యాయామ పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉండేది.

ప్రతిరోజూ ఆయన ఇంటి ముందు ఒక లారీ ఇసుక కుప్పగా పోసి ఉంచేవారు. ఒక పెద్ద పారను తీసుకుని వంగి, ఆ ఇసుక మొత్తాన్ని ఒక వైపు నుంచి మరొక వైపునకు పారతో ఎత్తి వేసేవారు. లారీడు ఇసుకను ఒక వైపు నుంచి వేరొక వైపునకు మార్చడమే ఆయన రోజువారీ వ్యాయామంగా ఉండేది. ఇది శరీరానికి తీవ్రమైన శారీరక శ్రమను అందించడమే కాకుండా కండరాల దృఢత్వానికి ఎంతో తోడ్పడేది.

Related Articles

Related image1
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
Related image2
Agnipariksha Season 2: అభిజిత్‌కు షాక్ ఇచ్చిన అమ్మాయి, కంటెస్టెంట్ ముఖంపై నీళ్లు కొట్టిన బిందు మాధవి.. గరం గరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష2
34
ఆహార నియమాలు - కఠిన క్రమశిక్షణ
Image Credit : Facebook/Nadamuri Taraka Ramarao

ఆహార నియమాలు - కఠిన క్రమశిక్షణ

ఎన్టీఆర్ తీసుకునే ఆహారం గురించి ప్రచారంలో ఉన్న కథనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఆయన క్రమశిక్షణ, శారీరక శ్రమ దానికి తగినట్లుగా ఉండేవి. రోజు ఉదయాన్నే రెండు డజన్ల ఇడ్లీలు, నాటుకోడి లాగించేవారు. యాపిల్ జ్యూస్, బాదం పాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే రామారావు ఫుడ్ మెనూ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అయితే రామారావు పౌరాణిక పాత్రలు (కృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు మొదలైనవి) పోషించేటప్పుడు అత్యంత పవిత్రంగా, కఠిన నియమాలతో ఉండేవారు. ఆ సమయంలో పూర్తిగా శాఖాహారం మాత్రమే తీసుకునేవారు. అంతేకాక, షూటింగ్ సమయంలో మంచంపై కాకుండా నేలపైనే నిద్రించేవారు.

44
షూటింగ్‌లో ఫుడ్ గురించి డిస్కషన్లు
Image Credit : google

షూటింగ్‌లో ఫుడ్ గురించి డిస్కషన్లు

షూటింగ్ టైమ్‌లో ఎంత బిజీగా ఉన్నా తోటి నటులతో ఫుడ్ గురించి డిస్కషన్లు జరిగేవట. రోజుకు 3 నుంచి 5 బాటిళ్ల యాపిల్ జ్యూస్ తాగేవారట ఎన్టీఆర్. సమ్మర్‌లో ఈ కోటా పెరిగేదట. ఎండాకాలంలో రెండు లీటర్ల బాదం పాలు కూడా ఆయన తీసుకునేవారని తెలుస్తోంది.

సాయంత్రం స్నాక్స్ గా బజ్జీలు, అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకునేవారు. ఇక వెజ్ మీల్స్ అయితే గోంగూర, నెయ్యి, రెండు రకాల కూరలు, చారు, అప్పడం, పెరుగు ఖచ్చితంగా ఉండాల్సిందే.

ఏ రంగంలోనైనా సాధించిన విజయాన్ని, అభిమానుల ప్రేమాభిమానాలను నిలబెట్టుకోవాలంటే ఎన్నో త్యాగాలు చేయాలని, కఠిన నియమాలు పాటించాలని ఎన్టీఆర్ ఫిట్‌నెస్ జీవనశైలి నిరూపిస్తుంది. ఆయన పాటించిన ఈ క్రమశిక్షణ, వ్యాయామం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
Recommended image2
Agnipariksha Season 2: అభిజిత్‌కు షాక్ ఇచ్చిన అమ్మాయి, కంటెస్టెంట్ ముఖంపై నీళ్లు కొట్టిన బిందు మాధవి.. గరం గరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష2
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved