- Home
- International
- Agnipariksha Season 2: అభిజిత్‌కు షాక్ ఇచ్చిన అమ్మాయి, కంటెస్టెంట్ ముఖంపై నీళ్లు కొట్టిన బిందు మాధవి.. గరం గరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష2
Agnipariksha Season 2: అభిజిత్‌కు షాక్ ఇచ్చిన అమ్మాయి, కంటెస్టెంట్ ముఖంపై నీళ్లు కొట్టిన బిందు మాధవి.. గరం గరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష2
Bigg Boss Agnipariksha Season 2: బిగ్ బాస్ అగ్నిపరీక్ష2 రసవత్తరంగా కొనసాగుతోంది. తాజా ఎపిసోడ్‌లో అభిజిత్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఇక బిందు మాధవి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

రసవత్తరంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష2
సామాన్యుడిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించడానికి అగ్నిపరీక్ష2 స్టార్ట్ అయ్యింది. కొంచెం ఫన్, కొంచెం కాంట్రవర్సీతో ఎంతో మంది టాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో అగ్నిపరీక్ష సీజన్ 2 చాలా ఘాటుగా నడుస్తోంది. గతంలో కంటే ఈసారి కాస్త డోస్ పెంచారు. జడ్జిలు కూడా పరిస్థితిని చాలా టైట్ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కు జడ్జిలు షాక్ ఇవ్వడంతో పాటు.. ఓ కంటెస్టెంట్ అభిజిత్‌కు కోలుకోలేని పంచ్ ఇచ్చింది.
అభిజిత్‌కు షాక్ ఇచ్చింది ఎవరు?
అగ్నిపరీక్ష2లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే తన ఎనర్జీ లెవల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది అపూర్వ. ఖమ్మంకు చెందిన ఆమె గతంలో యాంకర్‌గా, మిస్ తెలంగాణగా గెలిచింది. ఖమ్మం కళాకారుల గుమ్మం అంటూ.. తన మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా నవదీప్ మీద ఫోకస్ చేస్తూ.. ఆయన్ను ఇంప్రెస్ చేయాలని చూసింది. బిందు మాధవిని కూడా బుట్టలో వేయాలని చూసిన అపూర్వ.. అభిజిత్‌పై మాత్రం షాకింగ్ కామెంట్స్ చేసింది. అతను తనకు నచ్చడని.. ఆయన సేఫ్ గేమ్ ఆడాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫిజికల్ టాస్క్‌లు ఆడే టైమ్‌లో ఎడ్యుకేషన్ గురించి చెబుతూ.. తప్పించుకున్నాడని, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయకుండానే మైండ్ గేమ్‌తో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడంటూ మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్స్ చేసింది. దాంతో అభిజిత్ కూడా డిఫెన్స్ చేసుకోవడానికి గట్టిగా ట్రై చేశాడు. ఫైనల్‌గా అపూర్వ ఎంత టాలెంట్ చూపించినా కూడా చివరకు అభిజిత్, బిందు నుంచి రెడ్ కార్డ్ రాగా.. నవదీప్ మాత్రం "ముందు ముందు ఎలా ఉంటావో చూడాలి నువ్వు" అంటూ.. గ్రీన్ కార్డ్ ఇచ్చి హోల్డ్ చేశాడు.
కంటెస్టెంట్ ముఖంపై నీళ్లు కొట్టిన బిందు మాధవి..
అగ్నిపరీక్ష2లో చాలామంది తమ ఒరిజినల్ పర్సనాలిటీని దాచిపెట్టి.. ఏదో చూపించాలి అన్నట్టుగా స్టేజ్ మీదకు వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజా ఎపిసోడ్‌లో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ లక్ష్మీదీపక్ సేనాపతి కూడా అలానే చేశాడు. తన డిటైల్స్‌ను చాలా ఎమోషనల్‌గా చెప్పి.. తాను సాధించిన విజయాలు చెప్పుకొచ్చిన దీపక్.. చివరిలో బిగ్ బాస్ కోసం జుట్టు తీయడానికి నిరాకరించాడు. ఇక మరో కంటెస్టెంట్ రోహిత్ నాయుడు పట్నం కూడా సెంటిమెంట్‌తో గెలవాలని ట్రై చేశాడు. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న అతను.. తన తండ్రి లేకపోవడంతో సింగిల్ పేరెంట్‌గా అమ్మ కష్టం గురించి చెప్పాడు. ఆ తరువాత తెలియకుండా ఇద్దరితో డేట్ చేసిన విషయం వెల్లడించాడు. అది అతనికి నెగెటివ్‌గా మారింది. ఇక అతనికి కోపం వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి బిందు మాధవి మూడు సార్లు అతని ముఖంపై నీళ్లు కొట్టింది. అతను కాస్త నటిస్తున్నట్టు అనిపించడంతో నవదీప్, బిందు రెడ్ కార్డ్ ఇవ్వగా.. అభిజిత్ మాత్రం రోహిత్‌కు తనను తాను నిరూపించుకోవడం కోసం మరో ఛాన్స్ ఇచ్చాడు.
అగ్నిపరీక్ష జడ్జిలకు పెళ్లి సంబంధం చూసిన కంటెస్టెంట్..
తాజా ఎపిసోడ్‌లో అగ్నిపరీక్ష2 గెస్ట్‌ల మనసు గెలిచిన ఏకైక కంటెస్టెంట్ బాగి తుల్లూరి. వచ్చీ రావడంతోనే శ్రీముఖితో పాటు ముగ్గురు జడ్జిల మనసు గెలిచింది బాగి. నెల్లూరు యాసలో "నాయనా" అనుకుంటూ.. ఆమె ఇచ్చిన పెర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. అంతే కాదు తన లవ్ స్టోరీ గురించి చెప్పి అందరి మనసులు గెలిచింది బాగి. ఇక అభిజిత్ లాంటి హస్బెండ్ కావాలంటూ షాక్ ఇచ్చింది. ఇక ఆమె టాలెంట్‌కు పడిపోయిన జడ్జెస్ గ్రీన్ కార్డ్ ఇవ్వగా.. ఆమెలో టాలెంట్‌ను ఇంకా బయటకు తీయాలని డైరెక్ట్‌గా బిగ్ బాస్‌లోకి పంపించకుండా నవదీప్ రెడ్ కార్డ్ ఇచ్చి హోల్డ్ చేశాడు. నెక్స్ట్ రౌండ్‌లో బాగి పోటీకి రెడీ అవ్వబోతోంది. ఇక వెళ్తూ.. వెళ్తూ.. బిగ్ బాస్ జడ్జెస్ ముగ్గురితో పాటు యాంకర్ శ్రీముఖికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తానంటూ షాక్ ఇచ్చింది బాగి.

