MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్

Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్

Trisha Net Worth: స్టార్‌ హీరోయిన్‌ త్రిష గత కొన్ని రోజులుగా హాట్‌ టాపిక్‌ అవుతుంది. మొన్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని విజయ్‌కి హాయ్‌ చెప్పడంతో మరింతగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో త్రిష ఆస్తుల లెక్కలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 18 2026, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
త్రిష ఆస్తుల చిట్టా
Image Credit : Asianet News

త్రిష ఆస్తుల చిట్టా

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది త్రిష. కెరీర్‌ ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఏజ్‌ని తినేస్తుందనేలా ఆమె అందం ఉండటం విశేషం. అదే సమయంలో హీరోయిన్‌గా అత్యంత సక్సెస్‌ రేట్‌ ఉన్న హీరోయిన్‌గానూ త్రిష నిలిచింది. తెలుగులో 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'అతడు' వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది త్రిష. ప్రస్తుతం ఆమె అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా ఉండటం విశేషం. దీంతో ఇప్పుడు ఆమె ఆస్తుల లెక్కలు వైరల్‌గా మారాయి. త్రిష మొత్తం ఆస్తి విలువ సుమారు ₹85 కోట్లు ఉంటుందని అంచనా. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, విలాసవంతమైన జీవనశైలి కూడా ఆమె సంపదలో భాగమని తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
త్రిష రెమ్యూనరేషన్‌
Image Credit : instagram

త్రిష రెమ్యూనరేషన్‌

‘పొన్నియిన్ సెల్వన్’, ‘లియో’ చిత్రాల భారీ విజయం తర్వాత త్రిష తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు సుమారు ₹10 నుంచి ₹12 కోట్లు తీసుకుంటుందని టాక్. గతంలో ఆమె ఒక్కో చిత్రానికి ₹5 నుంచి ₹10 కోట్లు తీసుకునేదని టాక్‌. సినిమా రెమ్యూనరేషనే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా త్రిషకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఆమె బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఏటా సుమారు ₹9 కోట్లు సంపాదిస్తుందని సమాచారం.

34
హైదరాబాద్‌లో, లండన్‌లో లగ్జరీ హౌజెస్‌
Image Credit : Trish/ Instagram

హైదరాబాద్‌లో, లండన్‌లో లగ్జరీ హౌజెస్‌

త్రిష రియల్ ఎస్టేట్ ఆస్తులలో చెన్నైలోని ఇల్లు చాలా ప్రత్యేకం. చెన్నైలోని ఆమె ఇంటి విలువ సుమారు ₹10 కోట్లు అని సమాచారం. రస్ట్ ఆరెంజ్, బేజ్, బ్రౌన్, మ్యూటెడ్ గోల్డ్ వంటి ఎర్తీ కలర్స్‌తో ఇంటి ఇంటీరియర్‌ను అందంగా తీర్చిదిద్దారు. పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్, ఇతర అలంకరణ వస్తువులతో ఇంటిని డిజైన్‌ చేశారు. ఈ ఇంట్లో బట్టలు, లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లతో నిండిన వాక్-ఇన్ వార్డ్‌రోబ్ కూడా ఉందని సమాచారం. చెన్నైలోనే కాకుండా, హైదరాబాద్‌లోనూ త్రిషకు ఖరీదైన ఇళ్లు ఉందట. దీని విలువ సుమారు ₹6 నుంచి ₹6.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తెలుగు సినిమా షూటింగ్‌ల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె ఈ ఇంట్లోనే ఉంటారట. వీటితో పాటు లండన్‌లో కూడా త్రిషకు ఒక లగ్జరీ ప్రాపర్టీ ఉందని వార్తలున్నాయి.

44
త్రిష కార్‌ కలెక్షన్స్
Image Credit : Asianet News

త్రిష కార్‌ కలెక్షన్స్

త్రిష కార్ కలెక్షన్ కూడా చాలా పెద్దదే. ఆమె వద్ద ఉన్న లగ్జరీ కార్ల మొత్తం విలువ సుమారు ₹3 నుంచి ₹4 కోట్ల వరకు ఉంటుందని టాక్‌. ఆమె గ్యారేజ్‌లో Mercedes-Benz S-Class, Mercedes-Benz E-Class, BMW 5 Series, Range Rover Evoque, Audi వంటి అనేక ప్రీమియం కార్లు ఉన్నాయట. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో త్రిష ఎన్నో విజయాలు సాధించారు. బ్లాక్‌బస్టర్ సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులే ఆమె ₹85 కోట్ల సంపదకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
త్రిష
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Yash: అల్లు అరవింద్‌, రష్మిక మందన్నా ఇద్దరికీ కలిపి ఇచ్చిపడేసిన యష్‌.. అంత చులకనగా మాట్లాడతారా?
Recommended image2
VAS 4 Days Collections: తమిళంలో డల్, తెలుగులో టాప్.. సూర్య విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ 4 రోజుల కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved