MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: సరికొత్త ప్లాన్ వేసిన లాస్య, భాగ్య.. ఆనందంలో తులసీ, సామ్రాట్?

Intinti Gruhalakshmi: సరికొత్త ప్లాన్ వేసిన లాస్య, భాగ్య.. ఆనందంలో తులసీ, సామ్రాట్?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

4 Min read
Author : Navya G
Published : Dec 06 2022, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో తులసి సామ్రాట్ ఇద్దరూ రోజు మిల్క్ షాప్ కి ఎదురుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ ఆ రోజు మిల్క్ అంత బాగుంటాయా అని అనగా ఇక్కడ నిల్చొని కబుర్లు చెప్పడం కాదు అక్కడికి వెళ్లి రెండు గ్లాస్ లు తీసుకొని రండి అప్పుడు అర్థమవుతుంది అని అంటుంది తులసి. అప్పుడు ఆ జనాన్ని చూసి దానికంటే సముద్రం ఈదడం బెటర్ ఏమో తులసి గారు అని అంటాడు సామ్రాట్. అప్పుడు తులసి ఇది కూడా రాదా సరే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి తీసుకుని వస్తాను అని తులసి బయలుదేరుతూ ఉండగా అది కాదు తులసి గారు అంత రష్ లో వెళ్లి తీసుకుని తాగడం ఎందుకు అని అన్నాను. అంతేకానీ తీసుకురావడం చేతకాక కాదు అని అంటాడు సామ్రాట్.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు సామ్రాట్ అక్కడున్న వారందరిని తోసేసి బాబు రెండు రోజ్ మిల్క్ ఇవ్వు పోట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ తులసి గారు సాధించాను అని తులసి దగ్గరికి వస్తాడు. గ్లాసులు ఉన్నాయి అందులో రోజు మిల్క్ ఎక్కడ ఉంది అని అనగా సామ్రాట్ ఆశ్చర్య పోవడంతో ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చి ఇదిగో నా షర్టు మీద ఉంది అని అనగా తులసి నవ్వుకుంటూ ఉంటుంది. ఆ రోజ్ మిల్క్ షర్ట్ మీద పడ్డాయి అని అతను ఫుల్ గా చివాట్లు ఉండగా అది చూసి తులసి నవ్వుకుంటూ ఉంటుంది. మరొకవైపు లాస్య భాగ్యా ఇద్దరు కూల్ గా కాపీ తాగుతూ ఉంటారు. అప్పుడు భాగ్య ఇల్లు నీ పేరు మీద రావాలి అనుకున్నావు సాధించావు. కానీ ఈ ఇంటిని నీ పేరు మీద రాయించుకున్న విషయాన్ని అంత తొందరగా ఎందుకు బయట పెట్టావు అది ఎప్పుడో ఒకసారి బయట పెట్టాల్సి ఉంటే బాగుండేది అంటూ లాస్యకు లేనిపోని ఐడియాలు ఇచ్చి చెడగొడుతూ ఉంటుంది భాగ్య.
 

37

అప్పుడు భాగ్యా నువ్వు ఇంట్లో అందరి దృష్టిలో ఒక చెడ్డ దానిలా మరక వేసుకున్నావు ఆ మరక చెరిగిపోతే తప్ప నువ్వు ఒక మంచి దానిలా మారలేవు అని అనగా వెంటనే లాస్య కోపంతో ఆ మరక చెరిపి వేసుకోవాలని నేను కూడా చాలా ప్రయత్నిస్తున్నాను అది కావడం లేదు అని లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు లాస్యకు చెవిలో భాగ్య సీక్రెట్ చెప్పి లాస్య ని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. మరొక వైపు తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి బస్సు ఎక్కి వెళ్తూ ఉండగా అప్పుడు సామ్రాట్ బస్సులో స్పీడు దొరకాలంటే నిజంగా అదృష్టం చేసి ఉండాలి అండి కరెక్ట్ గా బస్సు దిగటానికి సీటు దొరుకుతుంది అని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు షాపింగ్ మొత్తం అయిపోయినట్టేనా అని సామ్రాట్ అనగా ఇంకా ఉన్నది అని చెప్పడంతో సామ్రాట్ ఇంకా ఉందా అని ఇబ్బందిగా ఫీల్ అవ్వడంతో మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు అనగా లేదు నేను వెళ్ళను అని అంటాడు సామ్రాట్.
 

47

 అప్పుడు తులసి సామ్రాట్ వాళ్ళ ముందు ఉన్న ఒక అతను అమ్మాయిని టచ్ చేస్తూ బ్రేకులు వేసినప్పుడు మీద పడుతూ తప్పుగా ప్రవర్తించడంతో తులసి, సామ్రాట్ కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు తులసి బస్సు ఆపండి కండక్టర్  గారు అనడంతో వెంటనే బస్సు ఆపగా ఆపమని చెప్పింది నా వైపు చూడడానికి కాదు ఇక్కడ ఒక హీరో రొమాన్స్ చేస్తున్నారు అందరూ క్లాప్స్ కొట్టి సహకరించండి అనడంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉండగా అతను ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఏంట్రా తలదించుకున్నావు. చేసినది తప్పని తెలిసిపోయిందా తప్పని తెలిసి మరి అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తున్నావు? తల దించుకోవడం కాదు మీ అమ్మానాన్నలు తల ఎత్తుకునేలా చెయ్యి అనడంతో అతడు చేతులు జోడించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
 

57

ఆ తర్వాత తులసి వాళ్ళు బస్టాప్ లో దిగడంతో బస్సులో అందరూ తులసికి భాయ్ చెబుతూ ఉంటారు. తర్వాత బస్సులో తులసి చేసిన పనికి సామ్రాట్ పొగుడుతూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ అలాంటి పిల్లల్ని క్రమశిక్షణ లేకుండా తల్లిదండ్రులు రోడ్డు మీదకు వదిలేస్తారా అని అనగా వాళ్ళ పరిస్థితిలో వాళ్ళని ఆ విధంగా మార్చి ఉంటాయి సామ్రాట్ గారు అయినా మీరు చెప్పింది నిజమే పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది తులసి. నేనైతే  వాడి చెంప పగలగొట్టే వాడిని అనడంతో అప్పుడు మీ ఆవేశం చల్లారుతుంది కానీ అతడికి బుద్ధి రాదు కానీ అందరి ముందు అలా చెబితే అతడు మారాడు అంటూ తులసి మంచిగా మాట్లాడుతుంది. అప్పుడు మళ్ళీ సామ్రాట్ తులసిని పొగుడుతూ ఉంటాడు.
 

67

 ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. మరొకవైపు అనసూయ పరందామయ్య చెస్ ఆడుతూ ఉంటారు. అప్పుడు అపరంధామయ్య నాకు ఆడటం ఇష్టం లేదు కావాలంటే క్యారం బోర్డు ఆడదాం అని అనగా ఏం కాదు ఒకచోట కూర్చుని ఆడటమే కదా అని అంటుంది అనసూయ. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి లాస్య పేపర్లు తీసుకొని వస్తుంది. అప్పుడు లాస్య దొంగ నాటకాలు ఆడుతూ నన్ను కూడా మీలో ఒక మనిషిలా కలుపుకోవచ్చు కదా అని అనగా అనసూయ మంచి వెళ్లిపోవడంతో అత్తయ్య అని పిలుస్తుంది లాస్య. అప్పుడు లాస్య దొంగ ఏడుపులు ఏడుస్తూ చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను అని ఆస్తి పేపర్లు అక్కడ పెట్టి ఈ క్షణం నుంచి నాకు ఈ ఇంటి పత్రాలకు ఎటువంటి సంబంధం లేదు అని నాటకాలు ఆడుతుంది లాస్య.

77

ఇంటి మీద హక్కులను పూర్తిగా వదులుకుంటున్నాను మామయ్య అని అంటుంది లాస్య. దాంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు లాస్య ఇంటిని ఎవరి పేరు మీద రాయించండి మావయ్య నేను నా మనస్ఫూర్తిగా సంతకం పెడతాను అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. ఏ నిమిషాన మీ ఇంట్లో అందరూ ఒక్కటే నన్ను బయట గెంటేస్తారు ఏమో అని భయంగా ఉంది అని అంటుంది లాస్య. నందు కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు అని అంటుంది లాస్య.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: గుండె నిండా గుడిగంటలు హీరో విష్ణు బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ..లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved