MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • #AlluArjun: అల్లు అర్జున్‌ ని టెన్షన్‌ పెడుతున్న ఫ్యాన్స్.. వాళ్లని చూస్తే భయమేస్తుందంటూ షాకిచ్చిన బన్నీ..

#AlluArjun: అల్లు అర్జున్‌ ని టెన్షన్‌ పెడుతున్న ఫ్యాన్స్.. వాళ్లని చూస్తే భయమేస్తుందంటూ షాకిచ్చిన బన్నీ..

ఇప్పుడు టాలీవుడ్‌ మంచి ఫేజ్‌లో ఉందని, కంటెంట్‌ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయని చెప్పాడు బన్నీ. కానీ ఆ అభిమానులంటే తనకు టెన్షన్‌ అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 19 2022, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అల్లు అర్జున్‌(Allu Arjun) ప్రస్తుతం `పుష్ప 2` (Pushpa 2)షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. `పుష్ప` భారీ విజయం సాధించడంతో దాన్ని మించి రెండో భాగాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. అయితే తాజాగా ఆయన శ్రీవిష్ణు(Sri Vishnu) నటించిన `అల్లూరి` (Alluri Pre Release Event)చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. శ్రీవిష్ణు చాలా కాలంగా తనకు తెలుసని, కానీ ఏ రోజు ఏ హెల్ప్ అడగలేదని, ఫస్ట్ టైమ్ తన సపోర్ట్ కావాలని అడగడంతో మరో మాట లేకుండా వచ్చినట్టు చెప్పారు బన్నీ. శ్రీవిష్ణు ఎంతో కష్టపడి సినిమాలు చేస్తాడని, జయాపజయాలకు అతీతంగా ఆయన సినిమాల్లో ఓ మంచి నావెల్టీ ఉంటుందని, అది తనకు బాగా నచ్చుతుందని చెప్పాడు బన్నీ. ఇలాంటి వారికి ఎంతో కొంత సపోర్ట్ చేయాలని గెస్ట్ గా వచ్చినట్టు చెప్పాడు బన్నీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ సందర్భంగా తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ కరోనా పాండమిక్‌ తర్వాత తెలుగు సినిమా మంచి స్థాయిలో ఉందని, మంచి సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తున్నారని చెప్పారు Bunny. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా మంచి కంటెంట్‌ ఉన్నసినిమాలను ఆదరించి హిట్స్ చేస్తున్నారని, ఇప్పటి వరకు మనం చూసిన సినిమాలే అందుకు నిదర్శనమన్నారు. 
 

35

కొన్ని పెద్ద సినిమాలు ఆడాయి, మరికొన్ని ఆడలేదు, కొన్ని చిన్నసినిమాలు ఆడాయి, మరికొన్ని ఆడలేదు. మొత్తంగా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు విజయం సాధించాయని తెలిపారు. కంటెంట్‌ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తారని నిరూపిస్తున్నారు. ఈ విషయంలో ఎవరూ టెన్షన్‌ పడాల్సిన పనిలేదని తెలిపారు బన్నీ. చిన్నా,పెద్ద లేకుండా మంచి కథా బలం ఉన్న సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయనే విషయాన్ని అల్లు అర్జున్‌ వెల్లడించారు. 
 

45

ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ వర్గాలు, ఆడియెన్స్ కి ధైర్యాన్ని నింపిన బన్నీ మాత్రం కొందరికి బయపడుతున్నారు. వాళ్లెవరో కాదు తన అభిమానులు కావడం విశేషం. తనకు అభిమానులు కాదు, ఆర్మీనే ఉందని చెప్పారు అల్లు అర్జున్‌. ఎప్పుడూ అభిమానుల విషయంలో గర్వపడతానని తెలిపారు. ఈ సందర్భంగా కొందరి అభిమానులంటే మాత్రం తనకు  టెన్షన్‌ అని చెప్పి షాకిచ్చాడు. 
 

55

తాను ఎప్పుడూ ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకి వస్తుంటానని, కానీ ఈ రోజు తనకు లోపల ఏదో టెన్షన్‌ ఉందని, అదేంటో అర్థం కావడం లేదన్నారు.మీరు చేసిన అల్లరే దానికి కారణమేమో అని చెప్పారు. నాకు తెలిసి ఇక్కడికి పాలకొల్లు నుంచి వచ్చారేమో, అందుకే టెన్షన్‌ పడుతున్నాననుకుంటా, ఎందుకంటే పాలకొల్లు వాళ్లంటే నాకు భయం అని చెబుతూ నవ్వులు పూయించారు. మరి పాలకొల్లు అభిమానులంటే ఆయనకు భయం ఎందుకనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే తాను ఊరికే జోక్ చేశానని, మా సొంతూరు పాలకొల్లు అని వెల్లడించడం విశేషం. తన సొంతూరు వాళ్లంటే అభిమానంతో సరదాగా బన్నీ అలా చెప్పాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఇండియా వైడ్‌గా ప్రైమ్‌లో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్‌ 10 మూవీస్‌ ఇవే
Recommended image2
Tollywood Heroines: హీరోయిన్ల వల్లే హిట్ అయిన 5 సినిమాలు, వీళ్ళు లేకుంటే అన్నీ ఫ్లాపే.. కాదనగలరా ?
Recommended image3
Vadde Naveen: ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved