MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జానకిని అపార్థం చేసుకున్న అఖిల్.. జానకిని చూసి సంతోష పడుతున్న రామచంద్ర?

Janaki Kalaganaledu: జానకిని అపార్థం చేసుకున్న అఖిల్.. జానకిని చూసి సంతోష పడుతున్న రామచంద్ర?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 21 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

3 Min read
Author : Navya G
Published : Dec 21 2022, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో జానకి ఇంటికి వచ్చి ఎలా అయినా ఈసారి ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలి అని ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఇంతలో రామచంద్ర సంతోషంగా ఇంటికి వస్తాడు. ఎందుకు జానకి గారు కాలేజీ దగ్గర ఉండమంటే ఇంటికి వచ్చేసారు అని అడగగా మీరేదో పనిలో ఉంటారు కదా అందుకే వచ్చేసాను అని అంటుంది జానకి. అప్పుడు రామచంద్ర సంతోషంతో మీకు శుభవార్త చెప్పాలి జానకి గారు అని అనగా ఒకరకంగా చెప్పాలి అంటే అఖిల్ కి ఉద్యోగం వచ్చేసినట్లే అనగా ఎలా రామా గారు అనడంతో అప్పుడు రామచంద్ర జరిగింది మొత్తం వివరించడంతో జానకి కూడా సంతోషపడుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు రామచంద్ర విస్టింగ్ కార్డు చూపించి ఈ కార్డు గురించి మీరే అఖిల్ కి చెప్పండి వెళ్దాం పదండి అని జానకి అనడంతో వెంటనే జానకి ఆగిపోతుంది. పొద్దున ఏం జరిగిందో చూశారు కదా రామచంద్ర గారు ఇప్పుడు నేను చెప్పినా కూడా అఖిల్ ని మరింత అపార్థం చేసుకుంటాడు వద్దు అని అంటుంది జానకి. అప్పుడు సరే అని రామచంద్ర అఖిల్ దగ్గరికి బయలుదేరుతాడు. మరొకవైపు అఖిల్ కోప్పడుతూ ప్రతి ఒక్కరికి లోకువ అయిపోయాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి జెస్సి వస్తుంది. మల్లిక అక్క ఏదో సలహా చెపుతుంది అంటే వినకుండా ఎందుకు లోపలికి వచ్చేసావు అని అనగా అందరి బాధలు అర్థం అవుతాయి.
 

37

 నా బాధలు ఎవరికీ అర్థం కావు అని అఖిల్ కోపంతో మాట్లాడుతాడు. నువ్వు నన్ను ఇరిటేట్ చేయకు కాసేపు సైలెంట్ గా ఉండు అని అనగా ఇంతలోనే అక్కడికి రామచంద్ర వస్తాడు. ఏంటి అన్నయ్య అని అనడంతో నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు అఖిల్ కి విస్టింగ్ కార్డు ఇచ్చి ఇది నా ఫ్రెండు కొత్తగా కంపెనీ పెడుతున్నాడు అక్కడికి వెళ్లి మాట్లాడదాం పదా అని అనగా వెంటనే అఖిల్ నాకు ఇష్టం లేదు అన్నయ్య సారీ ఏమనుకోవద్దు ఇప్పుడు నీ మూలంగా నాకు జాబ్ వస్తే రేపొద్దున వదిన అందరితో నా భర్త మూలంగా అఖిల్ కి జాబు వచ్చిందని చెప్పుకుంటుంది అది నాకు ఇష్టం లేదు అని అంటాడు.
 

47

అప్పుడు అఖిల్ జానకిని అపార్థం చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు జెస్సి అక్కడికి వచ్చి అక్క ఎప్పుడైనా మన మంచికే ఆలోచిస్తుంది అలా మాట్లాడకు అఖిల్ అనడంతో వెంటనే అఖిల్ వెటకారంగా మాట్లాడుతూ నాకు చాలా మంచి చేసింది జెస్సి. నేను తప్పు చేశాను లేదో తెలియకుండా నన్ను అరెస్టు చేసి ఊరందరి దృష్టిలో తప్పు వాడిని చేసింది అని అంటాడు అఖిల్. అప్పుడు సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టుగా వింటాను కానీ నేను ఇంటర్వ్యూకి నేను వస్తున్నట్లు నువ్వు చెప్పొద్దు. మీ మూలంగా వచ్చే జాబ్ నాకు ఏది అక్కర్లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

57

ఆ తరువాత జానకీ శ్రద్ధగా చదువుకుంటూ ఉంటుంది. రామచంద్ర అక్కడికి వచ్చి అది చూసి ఆనంద పడుతూ ఉంటాడు. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు జానకి అఖిల్ కి జాబ్ గురించి చెప్తాను అన్నారు ఆ విషయం ఏమయింది అని అడుగుతుంది జానకి. ఎవరివల్లో వచ్చే జాబ్ తనకి అక్కర్లేదంట కార్డ్ అయితే ఇచ్చాను తర్వాత వాడి ఇష్టం అని అంటాడు రామచంద్ర. చెప్పాను కదా రామ గారు నన్ను అఖిల్ చాలా అపార్థం చేసుకుంటున్నాడు అనడంతో వాడి మాటలు మీరేం పట్టించుకోకండి జానకి గారు అని అంటాడు. జానకి చదువుకుంటూ ఉండగా రామచంద్ర పడుకుని జానకి వైపు అలాగే చూస్తూ ఉంటాడు.
 

67

 మరుసటి రోజు ఉదయం జానకి, రామచంద్ర ఇద్దరూ బయటచేసుకుంటూ ఉండగా అప్పుడు రామచంద్ర జానకి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు జానకి ఏవండోయ్ శ్రీవారు రాత్రి నుంచి నా వైపు చూడడమే పనిగా పెట్టుకున్నారు అని అంటుంది. అప్పుడు జానకి పిల్లల గురించి మాట్లాడడంతో అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ మీ ఆశయమే ముఖ్యమండోయ్ ఆ విషయం కొద్ది రోజుల పక్కన పెడదాము అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉండగా ఇంతలోనే అఖిల్ జాబ్ కోసం బయటికి వెళ్తుండడంతో నేను వెళ్లి అఖిల్ ని డ్రాప్ చేసేస్తాను అని రామచంద్ర బయలుదేరుతాడు.
 

77

అప్పుడు రికమండేషన్ వద్దని చెప్పాను కదా అన్నయ్య అనడంతో నిన్ను లోపలికి రాను మా స్నేహితుడిని కలవను కానీ నిన్ను అక్కడ దింపేసి వచ్చేస్తాను అనడంతో అఖిల్ సరే అని అంటాడు. అప్పుడు జానకి అఖిల్ మనసు ఎప్పుడు మారుతుందో ఏమో రేపు అవకాశం వస్తే మమ్మల్ని కూడా లెక్కచేయడు అని అనుకుంటూ ఉంటుంది జానకి. అఖిల్ అక్కడికి వెళ్ళగా సరే అన్నయ్య నువ్వు వెళ్ళు అనడంతో అక్కడ ఏదైనా అవసరమైతే నా పేరు చెప్పు అని అనగా రికమండేషన్ నాకు అక్కర్లేదు అన్నయ్య అని అంటాడు అఖిల్. తర్వాత అఖిల్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెబుతూ ఉంటాడు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved