- Home
- Entertainment
- హీరోయిన్లను కూడా తలదన్నేలా నటి ప్రగతి గ్లామర్ షో.. ట్రెండీవేర్లో మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చరచ్చ
హీరోయిన్లను కూడా తలదన్నేలా నటి ప్రగతి గ్లామర్ షో.. ట్రెండీవేర్లో మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చరచ్చ
సీనియర్ యాక్ట్రెస్ ప్రగతి (Pragathi) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. సినిమాల్లోకన్నా నెట్టింట్లోనే హల్ చల్ చేస్తూ అందరి చూపును తనవైపు తిప్పుకుంటోంది. అయితే గత కొద్దికాలంగా ప్రగతి ఫొటోషూట్లు హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

వెండితెరపై సాంప్రదాయ పాత్రలకు ప్రగతి పెట్టింది పేరు. హీరోలకు తల్లిగా , అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. ప్రగతి(Pragathi) దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు.
ఇప్పటికే తెలుగులో 100కు పైగా చిత్రాల్లో నటించారు. మరోవైపు తమిళ భాషలోనూ 20కి పైగా చిత్రాల్లో నటించి సౌత్ ఆడియెన్స్ ను విభిన్న పాత్రల్లో ఆకట్టుకుంది. అదేవిధంగా టీవీ ప్రేక్షకులను కూడా ఇటీవల ‘నాతిచరామి’, ‘మమతల కోవెల’ డైలీ సీరియల్స్ లో నటించిన అలరించింది.
ఇదిలా ఉంటే ప్రగతి సోషల్ మీడియానూ తన క్రేజ్ పెంచుకుంటోంది. ఇందుకోసం హీరోయిన్లు, యంగ్ బ్యూటీలకు ధీటుగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. ట్రెండీ వేర్స్ ధరిస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నారు. అట్రాక్టివ్ దుస్తుల్లో గ్లామర్ షో కూడా చేస్తూ అందరి చూపును తనవైపు ఆకర్షిస్తోంది.
అదేవిధంగా గతకొంత కాలం ప్రగతి ట్రెండీగా రీల్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది. తరుచుగా ట్రెండ్ అవుతున్న సాంగ్స్ కూడా మతిపోయేలా స్టెప్పులేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. పదహారేళ్ల అమ్మాయిలా ఫాస్ట్ బీట్ కు కూడా డాన్స్ చేస్తూ షాక్ కు గురిచేస్తోంది.
మరీముఖ్యంగా తను ఏపార్టీలకు వెళ్లినా.. ఫంక్షన్లకు వెళ్లినా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో హాజరవుతూ అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఇటీవల ఓ పార్టీకి వెళ్లిన ప్రగతి స్లీవ్ లెస్ బాడీకాన్ డ్రెస్ లో అందరి చూపును ఆకర్షించింది. వయసు పెరిగినా కొత్తగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది.
అలాగే స్లిమ్ గా మారేందుకు జిమ్ లోనూ గంటల తరబడి వర్కౌట్స్ చేస్తోంది ప్రగతి. అప్పట్లో ఆమె జిమ్ వర్కౌట్ వీడియో ఎంతలా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ మధ్య ఈ విషయమై కొందరు ట్రోల్స్ చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది.
ఇప్పటికీ అదే తరహాలో జిమ్ వేర్ లో గ్లామర్ వెదజల్లుతూనే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ కనిపిస్తుంటుంది. శరీరాక్రుతిని నాజుగ్గా తయారుచేసుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రగతి కఠినంగా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. ఈ యువతరానికి ప్రగతి ఒక స్ఫూర్తి అని కూడా చెప్పొచ్చు. నిజానికి వయసు పెరుగుతున్న కొద్దీ తగినంత ఎక్సర్ సైజ్ చేయడం శరీరానికి మంచిదే.
కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా.. ఎలాంటి పెద్ద సినిమా రూపుదిద్దుకుంటున్నా మదర్ లాంటి పాత్రకు ప్రగతినే సంప్రదిస్తున్నారు దర్శక నిర్మాతలు. సహజంగా నటించే ప్రగతి తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతోంది. చివరిగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, డీజే టిల్లు’ సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం ‘ఎఫ్3’, ‘భోళా శంకర్’ చిత్రాలో కీలక పాత్రల్లో నటిస్తోంది.