MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Entertainment News
  • కత్రినా కైఫ్ - విక్కీ కౌషల్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తను సర్ ప్రైజ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ!

కత్రినా కైఫ్ - విక్కీ కౌషల్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తను సర్ ప్రైజ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ!

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ - విక్కీ కౌషల్ పవిత్ర బంధంలోకి అడుగు పెట్టి నేటికి ఏడాది పూర్తైంది. దీంతో ఒకరికొకరు ప్రత్యేకంగా విషెస్ తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కత్రినా తన భర్తకు ఊహించని గిఫ్ట్ ను ప్రజెంట్ చేసిందంట. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 09 2022, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్ (Vicky Kaushal), స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ (Katrina Kaif)ల వివాహం జరిగి నేటికి ఏడాది పూర్తయింది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్స్ ఫోర్ట్‌లో 2021 డిసెంబర్ 9న వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. బంధుమిత్రులు, స్టార్స్ మధ్య అంగరంగ వైభవంగా జరిపించారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పెళ్లికి ముందే కొన్నాళ్ల పాటు డేటింగ్ లో మునిగి తేలిన ఈ స్టార్స్ మ్యారేజ్ తర్వాత కూడా చాలా ప్రైవేట్ గా ఉంటున్నారు. వివాహా బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. మ్యారేజ్ అయ్యాక ఇద్దరూ కలిసి పలు టూర్లు, వేకేషన్లు, పార్టీలకు వెళ్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. మరోవైపు కేరీర్ లోనూ బిజీగా ఉంటున్నారు. 

36

ఈరోజు ఈ స్టార్స్ కు ప్రత్యేకమైన రోజు కావడం విశేషం. మొదటి వివాహా వార్షికోత్సం కావడంతో అభిమానులతో పాటు సినీ తారలు కూడా ఈ జంటకు విషెస్ తెలుపుతున్నారు. అంతకంటే ముందు కత్రినా కైఫ్, విక్కీ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 

46

ఏడాది పాటు సాగిన వివాహా బంధంలో ఒకరిపై మరొకరికి ఇంకా ప్రేమ పెరిగిందని వెల్లడించారు. ‘నా కాంతి కిరణమా.. హ్యాపీ వన్ ఇయర్’ అని ట్వీట్ చేస్తూ.. రెండు ఫొటోలనూ పంచుకుంది కత్రినా కైఫ్. అలాగే భర్త డాన్స్ చేస్తున్నమరో వీడియోను పోస్ట్ చేసింది. అదేవిధంగా భర్త విక్కీ కౌషల్ కూడా అందంగా విషెస్ తెలిపారు.
 

56

‘నీ ప్రేమలో ఏడాది సమయం చాలా అద్భుతంగా గడిచింది.  మన వివాహా వార్షికోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను నిన్ను ఎప్పటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతోంది.
 

66

ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి కత్రీనా కైఫ్ తన భర్తను సర్ ప్రైజ్ చేసినట్టు తెలుస్తోంది. విక్కీ కౌశల్‌ కోసం ఓ కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చిందంట. అదికూడా విక్కీకి ఎంతో ఇష్టమైన కలర్ కారునే గిఫ్ట్ గా ఇచ్చిందంట. ఇక విక్కీ కౌషల్ కూడా తన భ్యార  కత్రినా హృదయానికి అత్యంత దగ్గరగా ఉండే కస్టమైజ్డ్ జ్యూవెలరీ పీస్‌ను అందించాడని బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved