- Home
- Entertainment
- Entertainment News
- Ashu Reddy Pics : నడిరోడ్డుపై ‘అషురెడ్డి’ ఫొటోషూట్.. బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ .
Ashu Reddy Pics : నడిరోడ్డుపై ‘అషురెడ్డి’ ఫొటోషూట్.. బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ .
అషు రెడ్డి (Ashu Reddy) అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ఎలాంటి ఫొటో షోట్ కైనా సాహసం చేస్తోంది. తాజాగా రోడ్డుపై స్కోడా కార్ ముందు నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చిందీ జూనియర్ సమంత.

జూనియర్ సమంత (Junior Samantha)గా పేరు తెచ్చుకుందీ అషురెడ్డి. గతంలో డబ్ స్మాష్ వీడియోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హాట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. ట్రెండీ వేర్ లో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తోంది అషురెడ్డి. ఇటీవల అషురెడ్డి ఎక్కువగా యాంకర్ రవి (Anchor Ravi)తో కలసి సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
బైక్ రైడ్ లు, ఇన్ స్టా రీల్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన ‘డీజే టిల్లు’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానూ ఇద్దరు కలిసి స్టెప్పులేశారు. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఆ తర్వాత ఆర్జీవీ (RGV)తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఇంకా పాపులర్ అయ్యింది.
అయితే తాజాగా అషురెడ్డి తన ఫ్యాన్స్ ను ఖుషీ చేసుందుకు పలు ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ సారి అషురెడ్డి ఏకంగా నడిరోడ్డు కారు ఆపి ఫొటోలకు ఫోజులిచ్చింది.
ఫొటోలను గమనిస్తే దారిన పోయే వారిని పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమైంది. హాఫ్ షోల్డర్ బ్లాక్ డ్రైస్ లో అషురెడ్డి అందాలను ఆరబోసింది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ అషురెడ్డి క్యాప్ష న్ కూడా యాడ్ చేసింది. ‘కష్ట సమయాలు నిజమైన స్నేహితులను వెల్లడిస్తాయి.. నా పక్షాన ఎవరు నిలబడతారో వేచి చూడాల్సిందే’ అంటూ పేర్కొంది. ఈ క్యాప్షన్ చూసిన పలువురు నెటిజన్లు షాక్ అవుతున్నారు.
అషురెడ్డికి ఎలాంటి కష్టమొచ్చిందోనంటూ ఫీల్ అవుతున్నారు. మరోవైపు ఒంటినిండా అందాలను కూడగట్టుకున్న అషురెడ్డికి ఒకింత కోపమూ ఎక్కువే. తన కోపం ఎవరిపైనా చూపించిన ఈ క్రమంలో ఇలాంటి నోట్ రాసిందా అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అషురెడ్డి తన గ్లామర్ షోను మరిచిపోకుండా నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.