MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Smriti Mandhana: బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.. ప్రపంచంలో మొదటి ప్లేయర్‌గా స్మృతి మంధాన సరికొత్త రికార్డు

Smriti Mandhana: బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.. ప్రపంచంలో మొదటి ప్లేయర్‌గా స్మృతి మంధాన సరికొత్త రికార్డు

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సరికొత్త ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన మంధాన.. 11 వేల రన్స్ పూర్తి చేశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 22 2026, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Image Credit : X/BCCIWomen

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 ఉమెన్స్ క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. నిస్షిన్‌లోని కోరోగీ స్పోర్ట్స్ పార్క్‌లో శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్ పోరులో ఆమె అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 11,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా నిలిచారు. 30 ఏళ్ల ఈ మహారాష్ట్ర లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌ను ఖాతాలో వేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
10 బంతుల్లోనే చారిత్రక మైలురాయి
Image Credit : X/BCCIWomen

10 బంతుల్లోనే చారిత్రక మైలురాయి

శ్రీలంకతో గోల్డ్ మెడల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్మృతి మంధాన ఈ 11,000 పరుగుల మార్కును అందుకోవడానికి కేవలం 13 పరుగుల దూరంలో ఉన్నారు. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె కేవలం 10 బంతుల్లోనే ఆ 13 పరుగుల లక్ష్యాన్ని దాటేసి ప్రపంచ రికార్డు సాధించారు. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు స్మృతి మంధాన అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మంధాన, మొత్తంగా 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

35
మిథాలీ రాజ్ రికార్డు బ్రేక్ చేసిన మంధాన
Image Credit : X/BCCIWomen

మిథాలీ రాజ్ రికార్డు బ్రేక్ చేసిన మంధాన

అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణుల జాబితాలో స్మృతి మంధాన టాప్ లో కొనసాగుతున్నారు. అంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న 10,868 పరుగుల రికార్డును మంధాన ఇప్పటికే అధిగమించారు. గతంలో జరిగిన విమెన్స్ ఆసియా కప్ 2026లో హాంకాంగ్‌పై 124 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడటం ద్వారా మిథాలీ రికార్డును స్మృతి తిరగరాశారు. ఇప్పుడు ఆసియా గేమ్స్ ఫైనల్లో నేరుగా 11,000 పరుగుల రికార్డు మైలురాయిని తాకి అందరికీ అందనంత ఎత్తులో నిలిచారు.

45
ఫార్మాట్‌ల వారీగా మంధాన పరుగులు ఇవే
Image Credit : X/BCCIWomen

ఫార్మాట్‌ల వారీగా మంధాన పరుగులు ఇవే

2013 ఏప్రిల్ 5న బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్మృతి మంధాన, ఇప్పటివరకు టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు.

• టెస్టులు: 9 మ్యాచ్‌ల్లో 788 పరుగులు (2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు)

• వన్డేలు: 120 మ్యాచ్‌ల్లో 5,411 పరుగులు (14 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు)

• టీ20లు: 179 మ్యాచ్‌ల్లో 4,792 పరుగులు (2 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు, 101 సిక్సర్లు)

మొత్తంగా 308 మ్యాచ్‌ల్లో 18 సెంచరీలు, 76 అర్ధ సెంచరీల సాయంతో 11,001* పరుగులు పూర్తి చేశారు. టీ20 ఫార్మాట్‌లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె సెమీఫైనల్లో రికార్డు సాధించారు.

55
షేఫాలీ వర్మతో కలిసి మరో వరల్డ్ రికార్డ్
Image Credit : X/BCCIWomen

షేఫాలీ వర్మతో కలిసి మరో వరల్డ్ రికార్డ్

ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన, షేఫాలీ వర్మ జంట మరో సంచలన రికార్డు సాధించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఏ వికెట్‌కైనా 4,000 భాగస్వామ్య పరుగులు పూర్తి చేసిన తొలి జోడీగా మంధాన-షేఫాలీ ఘనత సాధించారు. శ్రీలంకపై తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు అదిరిపోయే పునాది వేశారు. అనంతరం రిచా ఘోష్ (22 బంతుల్లో 49*) విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
మహిళల క్రికెట్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved