- Home
- Sports
- Cricket
- Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asia Cup 2026 : మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై 72 రన్స్ తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 8వ సారి కప్ కొట్టి టీమిండియా మరో రికార్డు సాధించింది. ఫైనల్ పోరులో షెఫాలీ, స్మృతి, శ్రీ చరణి రోరింగ్ పెర్ఫార్మెన్స్ తో దుమ్మురేపారు.

ఫైనల్లో దంచికొట్టిన భారత్.. శ్రీలంకపై 72 పరుగులతో ఘన విజయం
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో టీమిండియా అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకను 72 పరుగుల తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్‌ను ముద్దాడింది. 2024 ఫైనల్లో ఎదురైన ఓటమికి భారత్ ఈ మ్యాచ్‌తో పక్కాగా రివేంజ్ తీర్చుకుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన శ్రీలంకను మన బౌలర్లు 111 పరుగులకే ఆలౌట్ చేశారు.
ఓపెనర్ల విధ్వంసం.. 129 పరుగుల రికార్డు పార్టనర్‌షిప్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్‌కు కేవలం 12.5 ఓవర్లలోనే 129 పరుగులు జోడించి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు.
షెఫాలీ వర్మ ఆరంభం నుంచే లంక కెప్టెన్ చమరి అటపట్టు బౌలింగ్‌పై దాడికి దిగింది. ఒకే ఓవర్లో వరుసగా సిక్స్, సిక్స్, ఫోర్ కొట్టి టోన్ సెట్ చేసింది. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఆసియా కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును సాధించింది. మొత్తంగా షెఫాలీ 39 బంతుల్లో 68 పరుగులు చేసింది. మరోవైపు స్మృతి మంధాన తన క్లాస్ షాట్లతో 39 బంతుల్లో 59 పరుగులు చేసి లంకపై పూర్తి పైచేయి సాధించింది.
చివర్లో కమలిని మెరుపులు.. భారత్ స్కోరు 183/5
షెఫాలీ అవుట్ అయిన తర్వాత స్మృతి కూడా హర్మన్‌ప్రీత్ (14)తో రన్ అవుట్ రూపంలో వెనుదిరిగింది. ఆ తర్వాత శ్రీలంక బౌలర్లు మ్యాచ్‌ను కాస్త కంట్రోల్ చేశారు. రిచా ఘోష్ 17 రన్స్ చేసి అవుట్ కాగా, దీప్తి శర్మ 5 రన్స్ చేసింది.
అయితే చివర్లో గుణాలన్ కమలిని కేవలం 5 బంతుల్లో 15 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. లంక బౌలర్లలో మిథాలి అయోధ్య, చమరి అటపట్టు, చముడి ప్రబోధ తల ఒక వికెట్ తీశారు.
దీప్తి దెబ్బకు విలవిల.. శ్రీ చరణి 4 వికెట్ల ధమాకా
184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలో కెప్టెన్ చమరి అటపట్టు (36), విష్మి గుణరత్నె (20) 58 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేపారు. కానీ 10వ ఓవర్లో దీప్తి శర్మ దెబ్బకొట్టింది. అటపట్టును స్టంపౌట్ చేయడమే కాకుండా, అదే ఓవర్లో గుణరత్నెను బౌల్డ్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేసింది.
ఆ తర్వాత సీన్‌లోకి వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి లంక మిడిల్, లోయర్ ఆర్డర్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. చరణి తన 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి లంకను కట్టడి చేసింది.
ఏకపక్షంగా ముగిసిన పోరు.. 8వ సారి ఆసియా క్వీన్స్
శ్రీలంక బ్యాటర్లలో నీలాక్షి డి సిల్వా (22), ఇమేషా దులాని (4), హర్షిత సమరవిక్రమ (9), కవిషా దిల్హారి (7), హసిని పెరేరా (1), కౌషిని నుత్యంగన (9) దారుణంగా విఫలమయ్యారు. దీంతో లంక 20 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో శ్రీ చరణి 4 వికెట్లు తీయగా, దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టింది. క్రాంతి గౌడ్, షెఫాలీ వర్మ, ప్రేమా రావత్ తల ఒక వికెట్ సాధించారు. ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన భారత మహిళల జట్టు 72 పరుగులతో ఘన విజయం సాధించి ఆసియా కప్‌పై తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.
𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦 🏆
A flawless campaign capped by sheer brilliance 🇮🇳🥳
Congratulations to #TeamIndia on winning the #WomensAsiaCup 👏👏
Scorecard ▶️ https://t.co/knKLXGSfOd #INDvSL pic.twitter.com/O3KaZ0oA3p— BCCI Women (@BCCIWomen) September 13, 2026

