MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • Asia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్

Asia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్

Womens Asia Cup 2026 Final: దుబాయ్ లో మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్స్ లో ఇండియా, శ్రీలంక ఢీకొంటున్నాయి. 2024 ఓటమికి రివెంజ్ తీర్చుకుని 8వ సారి కప్ కొట్టాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 13 2026, 07:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శ్రీలంకను తేలిగ్గా తీసుకుంటే అంతే.. భారత్‌కు పాత గాయం గుర్తుందా?
Image Credit : X@BCCIWomen

శ్రీలంకను తేలిగ్గా తీసుకుంటే అంతే.. భారత్‌కు పాత గాయం గుర్తుందా?

మహిళల ఆసియా కప్ 2026 ఛాంపియన్ ఎవరో తేలిపోయే సమయం వచ్చేసింది. సెప్టెంబర్ 13న దుబాయ్ లో జరగనున్న ఫైనల్ పోరులో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు కూడా ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడం విశేషం. అయితే, లంకను తక్కువ అంచనా వేస్తే టీమిండియాకు కష్టాలు తప్పవు. రెండేళ్ల కిందటి ఫైనల్ ఓటమి అనుభవాలే దానికి ఉదాహరణ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
2024 నాటి రివెంజ్ తీర్చుకునేందుకు గోల్డెన్ ఛాన్స్
Image Credit : X/BCCIWomen

2024 నాటి రివెంజ్ తీర్చుకునేందుకు గోల్డెన్ ఛాన్స్

మహిళల ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యధికంగా 7 సార్లు విజేతగా నిలిచింది. కానీ 2024 ఫైనల్లో శ్రీలంక చేతిలో ఊహించని షాక్ తగిలింది. అప్పట్లో భారత్ వుంచిన 166 రన్స్ టార్గెట్‌ను శ్రీలంక కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేజ్ చేసింది. లంకకు అదే ఏకైక ఆసియా కప్ టైటిల్. ఇప్పుడు 2026లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆ ఓటమికి బదులు తీర్చుకుని 8వ సారి ట్రోఫీని ముద్దాడాలని గట్టి పట్టుదలతో ఉంది.

36
హెడ్ టు హెడ్ రికార్డులు: ఇండియాదే పైచేయి
Image Credit : X/BCCIWomen

హెడ్ టు హెడ్ రికార్డులు: ఇండియాదే పైచేయి

టీ20 రికార్డులను ఒకసారి పరిశీలిస్తే భారత్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.

• మొత్తం మ్యాచ్‌లూ: 31

• భారత్ గెలిచినవి: 25

• శ్రీలంక గెలిచినవి: 5

• ఫలితం తేలనిది: 1

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2024లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇండియా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

46
షఫాలీ, దీప్తి ఫామ్.. భారత్‌కు ప్లస్ పాయింట్
Image Credit : X/BCCIWomen

షఫాలీ, దీప్తి ఫామ్.. భారత్‌కు ప్లస్ పాయింట్

టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉంది. రెండు అర్ధసెంచరీలతో కలిపి మొత్తం 168 రన్స్ చేసి టోర్నీలోనే టాప్ రన్ స్కోరర్‌గా నిలిచింది. మరోవైపు స్మృతి మంధాన ఒక సెంచరీ (154 రన్స్) బాదినప్పటికీ కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే అవుటైంది.

ఇక బౌలింగ్‌లో దీప్తి శర్మ అదరగొడుతోంది. శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టుతో సమానంగా 11 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతోంది. సెమీఫైనల్లో బాంగ్లాదేశ్‌పై కేవలం 6 బంతుల్లో 13 రన్స్ చేసి జట్టు స్కోరును 150 దగ్గరకు చేర్చడంలో దీప్తి కీలక పాత్ర పోషించింది. శ్రీ చరణి, ప్రేమా రావత్ కూడా స్పిన్ విభాగంలో మంచి సహకారం అందిస్తున్నారు.

56
శ్రీలంక నుంచి డేంజర్ ప్లేయర్లు వీళ్లే
Image Credit : X/BCCIWomen

శ్రీలంక నుంచి డేంజర్ ప్లేయర్లు వీళ్లే

శ్రీలంక జట్టులో ఇద్దరు ప్లేయర్లతో భారత్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉంది.

1. చమరి అటపట్టు (కెప్టెన్): 11 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా రాణిస్తోంది.

2. హర్షిత సమరవిక్రమ: 4 మ్యాచుల్లో 89 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో 4వ స్థానంలో ఉంది.

సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై 5 రన్స్‌కే 2 వికెట్లు, 33 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ లంకను హర్షిత (36), కవిష దిల్హారి (33)లు కోలుకునేలా చేశారు. ఆ తర్వాత నీలాక్షిక డి సిల్వా, కౌశిని నుత్యంగన్ జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించారు. 2024 ఫైనల్లో కూడా అటపట్టు, హర్షిత చెరో హాఫ్ సెంచరీ బాది భారత్ నోటి దగ్గర కప్‌ను లాగేసుకున్నారు.

66
ఫీల్డింగ్ లోపాలు.. టీమిండియా సరిదిద్దుకోవాల్సిన విషయాలు
Image Credit : X/BCCIWomen

ఫీల్డింగ్ లోపాలు.. టీమిండియా సరిదిద్దుకోవాల్సిన విషయాలు

భారత జట్టు ఫైనల్ చేరినా కొన్ని బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్యాచ్‌లు నేలపాలు చేయడం జట్టును వేధిస్తోంది.

• టోర్నీ తొలి మ్యాచ్‌లో థాయిలాండ్‌పై 2 క్యాచ్‌లు వదిలేశారు.

• పాకిస్తాన్‌పై 3 క్యాచ్‌లు మిస్ చేశారు.

• సెమీఫైనల్లో బాంగ్లాదేశ్‌పై ఏకంగా 4 క్యాచ్‌లు జారవిడిచారు.

మొత్తంగా 4 మ్యాచుల్లో 9 క్యాచ్‌లను ఫీల్డర్లు నేలపాలు చేశారు. శ్రీలంక లాంటి గట్టి ప్రత్యర్థితో ఆడుతున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పైగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా ఆరంభాన్ని పెద్ద స్కోర్లుగా మలచలేకపోతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
Seed Ganesha Idols: చిరంజీవి మెచ్చిన సీడ్ గణేష.. సీడ్ వినాయకుడితో మనకు వచ్చే 5 మైండ్ బ్లాకింగ్ బెనిఫిట్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved