MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: తిలక్ వర్మ సహా ఇద్దరు స్టార్లకు బిగ్ షాక్.. టీమిండియాలో భారీ మార్పులు

IND vs ENG: తిలక్ వర్మ సహా ఇద్దరు స్టార్లకు బిగ్ షాక్.. టీమిండియాలో భారీ మార్పులు

India vs England: శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో జరిగే 4వ టీ20లో టీమిండియాలో భారీ మార్పులతో బరిలోకి దిగనుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 09 2026, 07:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గెలవకపోతే సీన్ సితారే.. టీమ్ ఇండియాలో ఇద్దరు ప్లేయర్స్ అవుట్
Image Credit : Getty

గెలవకపోతే సీన్ సితారే.. టీమ్ ఇండియాలో ఇద్దరు ప్లేయర్స్ అవుట్

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్ గురువారం రాత్రి 10:00 గంటలకు (IST) బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరగనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన టీమ్ ఇండియా 0-2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే ఈ నాలుగో మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలవాలి. అందుకే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్లేయింగ్-11లో రెండు పెద్ద మార్పులు చేసేందుకు రెడీ అయ్యాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తిలక్ వర్మపై వేటు.. సంజూ శాంసన్ ఇన్?
Image Credit : Getty

తిలక్ వర్మపై వేటు.. సంజూ శాంసన్ ఇన్?

గత కొన్ని మ్యాచ్‌లుగా వరుసగా ఫ్లాప్ అవుతున్న ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మపై వేటు పడేలా ఉంది. అతని పేలవ ఫామ్ వల్ల టీమ్‌లో ప్లేస్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు తిలక్ వర్మ ప్లేస్‌లోకి స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్‌కు ఆడే ఛాన్స్ రాలేదు. అయితే టీమ్ ఇండియాకు ఇప్పుడు సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అవసరం కాబట్టి, సంజూని మళ్లీ టీమ్‌లోకి తీసుకునే ప్లాన్ చేస్తున్నారు.

36
వైభవ్ సూర్యవంశీ దబాంగ్ స్టైల్ గేమ్
Image Credit : bcci

వైభవ్ సూర్యవంశీ దబాంగ్ స్టైల్ గేమ్

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజూ శాంసన్ ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడాడు. కానీ ఆ తర్వాత 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం కోసం సంజూని పక్కన పెట్టాల్సి వచ్చింది. బీహార్‌కు చెందిన ఈ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ తన మొదటి రెండు టీ20 మ్యాచ్‌ల్లో భయం లేకుండా సూపర్ షాట్లు ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ, మంచి స్టార్ట్ దొరికినా దాన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌గా మార్చడంలో ఫెయిల్ అయ్యాడు. అయినా సరే, ఈ నాలుగో టీ20లో కూడా వైభవ్‌కు మరో ఛాన్స్ ఇస్తారని టాక్.

46
బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఇలా..
Image Credit : Getty

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఇలా..

ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తన టాప్ ఆర్డర్‌లో కొన్ని ప్రయోగాలు చేయవచ్చు. వైభవ్ సూర్యవంశీతో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు అభిషేక్ శర్మ నంబర్ 3లో బ్యాటింగ్‌కు వస్తాడు. లేదా అభిషేక్ శర్మనే ఓపెనర్‌గా కంటిన్యూ చేసి, సంజూ శాంసన్‌ను నంబర్ 3 పొజిషన్‌లో పంపించే ఇంకో ఆప్షన్ కూడా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందు ఉంది.

56
అక్షర్ పటేల్‌ డ్రాప్.. సుందర్‌కు లక్కీ ఛాన్స్
Image Credit : Getty

అక్షర్ పటేల్‌ డ్రాప్.. సుందర్‌కు లక్కీ ఛాన్స్

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ లైనప్‌లో కూడా మార్పులు జరిగేలా ఉన్నాయి. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు గత మ్యాచ్ అస్సలు కలిసి రాలేదు. 4 ఓవర్లలో ఏకంగా 49 రన్స్ ఇచ్చి నిరాశపరిచాడు. అందుకే అతని స్థానంలో స్పిన్-బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను టీమ్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. సుందర్ బౌలింగ్‌లో మంచి కంట్రోల్ ఇవ్వడమే కాకుండా, టీమ్ బ్యాటింగ్‌ను కూడా బలోపేతం చేస్తాడు. అక్షర్ పటేల్ భారత్ తరఫున 99 టీ20 మ్యాచ్‌లు ఆడి, 101 వికెట్లు తీశాడు. అలాగే 62 ఇన్నింగ్స్‌ల్లో 746 రన్స్ చేశాడు.

66
భారత్ ప్లేయింగ్ ఎలెవన్ అంచనా
Image Credit : bcci

భారత్ ప్లేయింగ్ ఎలెవన్ అంచనా

నాలుగో టీ20 కోసం భారత్ ప్లేయింగ్ ఎలెవన్ అంచనా: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శివమ్ దూబే, అక్షర్ పటేల్ / వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
Unlucky Football Legends: ఎన్ని రికార్డులున్నా వేస్ట్.. వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడలేకపోయిన ఐదుగురు లెజెండరీ ఫుట్‌బాలర్లు వీరే !
Recommended image2
Wimbledon White Dress Code: వింబుల్డన్‌లో వైట్ డ్రెస్సే ఎందుకు? టెన్నిస్ ప్లేయర్స్ 150 ఏళ్లుగా ఫాలో అవుతున్న వింత రూల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved