MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Unlucky Football Legends: ఎన్ని రికార్డులున్నా వేస్ట్.. వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడలేకపోయిన ఐదుగురు లెజెండరీ ఫుట్‌బాలర్లు వీరే !

Unlucky Football Legends: ఎన్ని రికార్డులున్నా వేస్ట్.. వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడలేకపోయిన ఐదుగురు లెజెండరీ ఫుట్‌బాలర్లు వీరే !

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ 2026 లో రొనాల్డో, నేమార్‌ల ప్రపంచకప్ కల చెదిరిపోయింది. ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన రికార్డులు సాధించారు. కానీ, కప్పు గెలవలేకపోయిన ఐదుగురు దిగ్గజ ఫుట్‌బాలర్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 07 2026, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
976 గోల్స్ చేసినా రొనాల్డోకు దక్కని వరల్డ్ కప్.. కన్నీళ్లతో నేమర్ రిటైర్మెంట్
Image Credit : our own

976 గోల్స్ చేసినా రొనాల్డోకు దక్కని వరల్డ్ కప్.. కన్నీళ్లతో నేమర్ రిటైర్మెంట్

ఫుట్‌బాల్ ప్రపంచంలో ఫిఫా (FIFA) వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడటం అనేది ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఒక అతిపెద్ద కల. ఎంతోమంది లెజెండరీ ప్లేయర్లు క్లబ్ లెవెల్లో లెక్కలేనన్ని ట్రోఫీలు గెలిచారు, రికార్డులు బద్దలు కొట్టారు, కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. కానీ, వరల్డ్ కప్ విషయానికి వస్తే మాత్రం అదృష్టం వారిని అస్సలు వరించలేదు. ఫిఫా వరల్డ్ కప్ 2026 లో కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు సూపర్ స్టార్ ఫుట్‌బాలర్ల వరల్డ్ కప్ కల ఎప్పటికీ నెరవేరకుండా ముగిసిపోయింది.

మొదట నార్వే జట్టు బ్రెజిల్‌ను ఓడించి నేమార్ జూనియర్ గుండె పగిలేలా చేసింది. ఆ మరుసటి రోజే స్పెయిన్ జట్టు పోర్చుగల్‌ను ఓడించి, సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఎప్పటికీ మర్చిపోలేని గాయాన్ని మిగిల్చింది. క్లబ్, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో కలిపి కెరీర్‌లో అత్యధికంగా 976 గోల్స్ చేసినప్పటికీ, గత ఎన్నో ఏళ్లుగా రొనాల్డో కంటున్న ఆ ఒక్క కల మాత్రం కలగానే మిగిలిపోయింది. నేమార్, రొనాల్డోలతో పాటు తమ కెరీర్‌లో అద్భుతమైన రికార్డులు ఉన్నా, ఎప్పుడూ వరల్డ్ కప్ గెలవలేకపోయిన ఆ ఐదుగురు లెజెండరీ ఫుట్‌బాలర్లు ఎవరో మీకు తెలసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)
Image Credit : Getty

1. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)

ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో క్రిస్టియానో రొనాల్డో ఒకరు. ఆయన క్లబ్ ఫుట్‌బాల్‌లో యూఈఎఫ్ఏ (UEFA) ఛాంపియన్స్ లీగ్, డొమెస్టిక్ లీగ్ టైటిల్స్, ప్రతిష్ఠాత్మక బ్యాలన్ డి ఓర్ వంటి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా పోర్చుగల్ జట్టుకు యూరో కప్, యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లను కూడా అందించారు.

కానీ, ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ మాత్రం ఆయనకు ఎప్పుడూ అందలేదు. 2006 నుండి 2026 వరకు రొనాల్డో మొత్తం 6 వరల్డ్ కప్‌లు ఆడారు. ఇందులో ఆయన అత్యుత్తమ ప్రదర్శన 2006 లో నమోదైంది, అప్పుడు పోర్చుగల్ సెమీఫైనల్ వరకు దూసుకెళ్లింది. 2018 లో స్పెయిన్‌పై రొనాల్డో చేసిన హాట్రిక్ గోల్స్ ఇప్పటికీ వరల్డ్ కప్ చరిత్రలోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌గా నిలిచింది. కానీ, ఆ టీమ్ ఎప్పుడూ ఫైనల్ చేరలేకపోయింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 లో స్పెయిన్ జట్టు రొనాల్డో కలను పూర్తిగా ముక్కలు చేసింది. ఇదే తన చివరి ప్రపంచకప్ అని రొనాల్డో ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related Articles

Related image1
T20 World Cup Prize Money: వరల్డ్ కప్ కొట్టిన ఆస్ట్రేలియాపై కాసుల వర్షం.. మరి టీమిండియాకు ఎన్ని కోట్లొచ్చాయో తెలుసా?
Related image2
MS Dhoni Records: వరల్డ్ క్రికెట్‌ను వణికించిన ధోనీ 5 రికార్డులు.. టచ్ చేయడం కూడా నెక్స్ట్ జనరేషన్‌కు కల్లే !
36
2. యోహాన్ క్రూయిఫ్ (నెదర్లాండ్స్)
Image Credit : our own

2. యోహాన్ క్రూయిఫ్ (నెదర్లాండ్స్)

నెదర్లాండ్స్‌కు చెందిన గొప్ప ఆటగాడు యోహాన్ క్రూయిఫ్ ఫుట్‌బాల్ రంగానికి టోటల్ ఫుట్‌బాల్ అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసి, ఆటకు సరికొత్త దిశను చూపించారు. ఆయన కెప్టెన్సీలో నెదర్లాండ్స్ టీమ్ 1974 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆ సమయంలో వారే హాట్ ఫేవరెట్‌గా ఉన్నారు.

కానీ, ఫైనల్‌లో పశ్చిమ జర్మనీ 2-1 తో విజయం సాధించి క్రూయిఫ్ కలను చెరిపేసింది. తన కెరీర్‌లో మూడు సార్లు బ్యాలన్ డి ఓర్ గెలుచుకున్న ఈ దిగ్గజ ఆటగాడి ఖాతాలో వరల్డ్ కప్ ట్రోఫీ చేరలేదు. ఆయన కనిపెట్టిన ప్రసిద్ధ క్రూయిఫ్ టర్న్ స్కిల్ ఇప్పటికీ ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎంతో ఫేమస్.

46
3. ఫెరెన్క్ పుస్కాస్ (హంగేరి)
Image Credit : Getty

3. ఫెరెన్క్ పుస్కాస్ (హంగేరి)

హంగేరి దేశానికి చెందిన గొప్ప స్ట్రైకర్ ఫెరెన్క్ పుస్కాస్ ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్ స్కోరర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన తన కెరీర్‌లో 600 కంటే ఎక్కువ గోల్స్ చేశారు. 1954 వరల్డ్ కప్‌లో హంగేరి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, జట్టును ఫైనల్స్ వరకు నడిపించారు. అయితే, ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో హంగేరి జట్టు పశ్చిమ జర్మనీ చేతిలో 3-2 తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను ఫుట్‌బాల్ చరిత్రలో మిరాకిల్ ఆఫ్ బెర్న్ అని పిలుస్తారు. ఆయన గౌరవార్థం ఫిఫా (FIFA) ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత అందమైన గోల్ చేసిన ఆటగాడికి పుస్కాస్ అవార్డును అందజేస్తుంది.

56
4. యూసేబియో (పోర్చుగల్)
Image Credit : Getty

4. యూసేబియో (పోర్చుగల్)

క్రిస్టియానో రొనాల్డో కంటే ముందు, పోర్చుగల్ దేశపు అత్యంత పెద్ద ఫుట్‌బాల్ స్టార్‌గా యూసేబియో నిలిచారు. ఆయన తన కెరీర్‌లో 700 కి పైగా గోల్స్ సాధించారు. 1966 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసి గోల్డెన్ బూట్ అవార్డును సైతం గెలుచుకున్నారు. ఆయన ప్రతిభ వల్లనే ఆ ఏడాది పోర్చుగల్ మూడో స్థానంలో నిలిచింది. కానీ, ఆ టీమ్ ఎప్పుడూ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. వ్యక్తిగతంగా ఎంత గొప్ప ప్రదర్శన చేసినా, ప్రపంచ ఛాంపియన్ కావాలనే యూసేబియో కల నెరవేరలేదు.

66
5. నేమర్ (బ్రెజిల్)
Image Credit : Getty

5. నేమర్ (బ్రెజిల్)

బ్రెజిల్ సూపర్ స్టార్ నేమర్ జూనియర్ ప్రస్తుత జనరేషన్‌లో అత్యంత టాలెంటెడ్ ఫుట్‌బాలర్లలో ఒకరు. ఆయన బార్సిలోనా, పారిస్ సెయింట్-జర్మన్ (PSG) వంటి టాప్ క్లబ్‌ల తరఫున అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. బ్రెజిల్ జట్టు 2013 ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్, 2016 ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. బ్రెజిల్ దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌లో ఉన్నారు. అయినప్పటికీ, ఫిఫా వరల్డ్ కప్ గెలవాలనే ఆయన కల అసంపూర్ణంగానే మిగిలిపోయింది.

నేమర్ తన కెరీర్‌లో 2014, 2018, 2022, 2026 వరల్డ్ కప్‌లలో ఆడారు. 2014 లో గాయం కారణంగా క్వార్టర్ ఫైనల్ తర్వాత ఆయన టోర్నమెంట్‌కు దూరం కావాల్సి వచ్చింది, ఆ తర్వాత సెమీఫైనల్‌లో జర్మనీ చేతిలో బ్రెజిల్ 7-1 తో చరిత్రాత్మక ఓటమిని చవిచూసింది. 2018 లో క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియం చేతిలో బ్రెజిల్ ఓడిపోగా, 2022 లో క్రొయేషియా పెనాల్టీ షూటౌట్‌లో బ్రెజిల్‌ను టోర్నీ నుండి ఎలిమినేట్ చేసింది. ఇక ప్రస్తుత ఫిఫా వరల్డ్ కప్ 2026 లో నార్వే చేతిలో ఘోర పరాజయం పాలవడంతో బ్రెజిల్ ప్రయాణం ముగిసింది. ఈ బాధాకరమైన ఓటమి తర్వాత నేమర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
FIFA ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
MS Dhoni Records: వరల్డ్ క్రికెట్‌ను వణికించిన ధోనీ 5 రికార్డులు.. టచ్ చేయడం కూడా నెక్స్ట్ జనరేషన్‌కు కల్లే !
Recommended image2
Neymar Retirement: ఫిపా వరల్డ్ కప్ నుంచి బ్రెజిల్ అవుట్.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్‌మర్‌ రిటైర్మెంట్
Recommended image3
T20 World Cup Prize Money: వరల్డ్ కప్ కొట్టిన ఆస్ట్రేలియాపై కాసుల వర్షం.. మరి టీమిండియాకు ఎన్ని కోట్లొచ్చాయో తెలుసా?
Related Stories
Recommended image1
T20 World Cup Prize Money: వరల్డ్ కప్ కొట్టిన ఆస్ట్రేలియాపై కాసుల వర్షం.. మరి టీమిండియాకు ఎన్ని కోట్లొచ్చాయో తెలుసా?
Recommended image2
MS Dhoni Records: వరల్డ్ క్రికెట్‌ను వణికించిన ధోనీ 5 రికార్డులు.. టచ్ చేయడం కూడా నెక్స్ట్ జనరేషన్‌కు కల్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved