MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Tennis
  • Wimbledon White Dress Code: వింబుల్డన్‌లో వైట్ డ్రెస్సే ఎందుకు? టెన్నిస్ ప్లేయర్స్ 150 ఏళ్లుగా ఫాలో అవుతున్న వింత రూల్ !

Wimbledon White Dress Code: వింబుల్డన్‌లో వైట్ డ్రెస్సే ఎందుకు? టెన్నిస్ ప్లేయర్స్ 150 ఏళ్లుగా ఫాలో అవుతున్న వింత రూల్ !

Wimbledon White Dress Code: టెన్నిస్ హిస్టరీలోనే మోస్ట్ స్ట్రిక్ట్ రూల్ ఆల్ వైట్ రూల్‌ను ఇప్పటికీ స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారు. వింబుల్డన్‌లో ప్లేయర్స్ అంతా వైట్ డ్రెస్సే వేసుకోవడం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 08 2026, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వింబుల్డన్‌లో ప్లేయర్స్ వైట్ డ్రెస్ లేకపోతే నో ఎంట్రీ.. 150 ఏళ్ల సీక్రెట్ తెలుసా?
Image Credit : Gemini

వింబుల్డన్‌లో ప్లేయర్స్ వైట్ డ్రెస్ లేకపోతే నో ఎంట్రీ.. 150 ఏళ్ల సీక్రెట్ తెలుసా?

టెన్నిస్ క్యాలెండర్‌లో మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. కానీ, ప్లేయర్స్ అందరూ ఏదో ఒక గార్డెన్ పార్టీకి రెడీ అయినట్లు నీట్‌గా తయారై రావాల్సిన టోర్నమెంట్ మాత్రం ఒకే ఒకటి.. అదే వింబుల్డన్. మిగతా టోర్నమెంట్స్ కలర్స్‌ను ఫుల్‌గా యాక్సెప్ట్ చేస్తే.. వింబుల్డన్ మాత్రం స్పోర్ట్స్ హిస్టరీలోనే అత్యంత కఠినమైన డ్రెస్ కోడ్‌లలో ఒకటైన ఆల్ వైట్ రూల్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుంది. అసలు వింబుల్డన్‌లో వైట్ డ్రెస్సే ఎందుకు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వింబుల్డన్‌లో వైట్ డ్రెస్ రూల్ ఎందుకు పెట్టారు?
Image Credit : Getty

వింబుల్డన్‌లో వైట్ డ్రెస్ రూల్ ఎందుకు పెట్టారు?

ఈ రూల్ ను ఇప్పుడు తీసుకురాలేదు. విక్టోరియన్ కాలం నాటి 19వ శతాబ్దంలో బ్రిటన్‌లోని అప్పర్ క్లాస్ ప్రజలు ఈ లాన్ టెన్నిస్‌ను ఎక్కువగా ఆడేవారు. ఆ రోజుల్లో సమాజంలో తిరిగేటప్పుడు బట్టలపై చెమట మరకలు కనిపించడం అనేది చాలా అవమానకరంగా, అనాగరికంగా భావించేవారు. డార్క్ కలర్ బట్టల కంటే, తెల్లటి బట్టలు వేసుకుంటే చెమట మరకలు అంతగా బయటకు కనిపించవని నమ్మేవారు. అందుకే ఇలాంటి ఆటలు ఆడేటప్పుడు వైట్ క్లోత్స్ వేసుకోవడానికి మొగ్గు చూపారు. 1877లో మొట్టమొదటి వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ జరిగే సమయానికి, ఈ వైట్ డ్రెస్ అనేది టెన్నిస్ ఆటకు ఒక అఫీషియల్ యూనిఫామ్‌గా మారిపోయింది.

Related Articles

Related image1
Telangana First Airport: నిజాం కాలంలోనే నైట్ ల్యాండింగ్.. తెలంగాణ ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ ఏదో తెలుసా?
Related image2
Best Beer in India: ఇండియాలో బెస్ట్ బీర్ ఏది? బీర్ లవర్స్ టాప్ 5 ఫేవరెట్స్ ఇవే !
36
మోడ్రన్ రోజుల్లో కఠినమైన రూల్స్
Image Credit : Getty

మోడ్రన్ రోజుల్లో కఠినమైన రూల్స్

అయితే, ఇప్పుడున్న మోడ్రన్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. ప్లేయర్స్ బట్టలు దాదాపు పూర్తిగా తెలుపు అయి ఉండాలి. మరి ఆఫ్ వైట్, క్రీమ్ కలర్ లేదా ఐవరీ కలర్స్ వేసుకోవచ్చా? అంటే.. వాటికి అస్సలు ఛాన్సే లేదు. వేరే కలర్ బోర్డర్స్ ఉండకూడదు, బ్రాండ్ లోగోలు కూడా చాలా చిన్నవిగా ఉండాలి. ప్రతీ చిన్న విషయాన్ని కూడా అధికారులు చాలా సీరియస్‌గా చెక్ చేస్తారు. గతంలో టోర్నమెంట్ స్టాండర్డ్స్‌కు మ్యాచ్ అవ్వని షూస్, అండర్ షార్ట్స్, యాక్సెసరీస్ మార్చాలని ప్లేయర్లను ఆదేశించారు. అయితే, మహిళా ప్లేయర్ల కంఫర్ట్‌ను దృష్టిలో ఉంచుకుని, 2023 నుండి వారు డార్క్ కలర్ అండర్ షార్ట్స్ వేసుకోవడానికి వింబుల్డన్ పర్మిషన్ ఇచ్చింది.

46
రాల్ఫ్ లారెన్ బ్రాండ్‌తో వింబుల్డన్‌కు ఉన్న లింక్ ఇదే
Image Credit : Getty

రాల్ఫ్ లారెన్ బ్రాండ్‌తో వింబుల్డన్‌కు ఉన్న లింక్ ఇదే

వింబుల్డన్ వైట్ లుక్ అనేది కేవలం ప్లేయర్లకే పరిమితం కాలేదు. 2006 నుండి రాల్ఫ్ లారెన్ బ్రాండ్ ఈ టోర్నమెంట్‌కు అఫీషియల్ అవుట్‌ఫిట్టర్‌గా పనిచేస్తోంది. కోర్టులో ఉండే అంపైర్లు, బాల్ బాయ్స్, బాల్ గర్ల్స్, ఆన్ కోర్ట్ అధికారులందరికీ ఈ బ్రాండే యూనిఫామ్స్ అందిస్తుంది. రాల్ఫ్ లారెన్ బ్రాండ్ ఎప్పుడూ క్లాసీ అమెరికన్ స్పోర్ట్స్‌వేర్, క్రిస్ప్ ఆక్స్‌ఫర్డ్ షర్ట్స్, కంట్రీ క్లబ్ వైబ్స్‌కు ఫేమస్. వింబుల్డన్ పక్కా బ్రిటిష్ స్టైల్ అయినప్పటికీ, ఈ రెండు బ్రాండ్ల విజువల్ వరల్డ్స్ ఒకదానితో ఒకటి పర్ఫెక్ట్‌గా సింక్ అయిపోతాయి.

56
రూల్ బ్రేక్ చేసి దొరికిపోయిన స్టార్స్
Image Credit : Getty

రూల్ బ్రేక్ చేసి దొరికిపోయిన స్టార్స్

కేవలం ఒకే ఒక్క కలర్ చుట్టూ తిరిగే ఈ రూల్ వల్ల టెన్నిస్ హిస్టరీలో చాలా వివాదాలు జరిగాయి. 80ల చివర్లో ఆండ్రీ అగస్సీ అనే ఫేమస్ ప్లేయర్ వింబుల్డన్‌కు చాలా ఏళ్లు దూరంగా ఉన్నాడు. దానికి కారణం అతనికి ఈ రూల్స్ నచ్చకపోవడమే. ఇక 2013లో రోజర్ ఫెదరర్ ఆరెంజ్ కలర్ సోల్స్ ఉన్న షూస్ వేసుకొస్తే.. వాటిని మార్చాలని అధికారులు చెప్పారు. 2022లో, నిక్ కిరియోస్ రెడ్ కలర్ క్యాప్ పెట్టుకున్నందుకు అతనికి భారీ ఫైన్ వేశారు.

66
వింబుల్డన్ ఈ రూల్‌ను ఎందుకు వదలట్లేదు?
Image Credit : Olympic.com

వింబుల్డన్ ఈ రూల్‌ను ఎందుకు వదలట్లేదు?

అయితే ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే.. 150 ఏళ్ల నాటి ఈ పాత రూల్‌ను ఇప్పటికీ ఎందుకు అంత స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారు? ఎందుకంటే, కాలక్రమేణా ఈ ఆల్ వైట్ రూల్ అనేది కేవలం చెమట మరకల కోసం కాకుండా, వింబుల్డన్ బ్రాండ్ ఐడెంటిటీగా మారిపోయింది. అందరూ ఒకే కలర్ ప్యాలెట్‌తో ఆడటం వల్ల, ఫోకస్ అంతా కలర్స్ మీద కాకుండా ఆటపైకి, దుస్తుల ఫిట్టింగ్, కటింగ్, డిజైన్ డీటెయిల్స్ పైకి మళ్లుతుంది. ప్రొఫెషనల్ స్పోర్ట్స్‌లో మిగిలి ఉన్న ఏకైక, యూనిక్ డ్రెస్ కోడ్ ఇదే. చెమట మరకలను దాచడానికి మొదలైన ఈ చిన్న రూల్, 150 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒక పెద్ద హిస్టరీగా మారిపోయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Recommended image2
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత
Recommended image3
Wimbledon 2025 Final : ఏం ఆడాడు భయ్యా.. 148 వింబుల్డన్ చరిత్రను తిరగరాసిన సిన్నర్
Related Stories
Recommended image1
Telangana First Airport: నిజాం కాలంలోనే నైట్ ల్యాండింగ్.. తెలంగాణ ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ ఏదో తెలుసా?
Recommended image2
Best Beer in India: ఇండియాలో బెస్ట్ బీర్ ఏది? బీర్ లవర్స్ టాప్ 5 ఫేవరెట్స్ ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved