MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • AUS vs BAN: 149 ఏళ్ల టెస్ట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సంచలనం.. ఆస్ట్రేలియాకు సొంతగడ్డపైనే షాకిచ్చిన బంగ్లాదేశ్

AUS vs BAN: 149 ఏళ్ల టెస్ట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సంచలనం.. ఆస్ట్రేలియాకు సొంతగడ్డపైనే షాకిచ్చిన బంగ్లాదేశ్

Bangladesh vs Australia : డార్విన్ టెస్టులో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో చరిత్రాత్మక విజయం సాధించింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకున్నాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 17 2026, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
149 ఏళ్ల టెస్ట్ చరిత్రలో మునుపెన్నడూ లేని సంచలనం
Image Credit : X/ICC

149 ఏళ్ల టెస్ట్ చరిత్రలో మునుపెన్నడూ లేని సంచలనం

టెస్ట్ క్రికెట్ ప్రారంభమై 149 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటివరకు ఎవరూ ఊహించని సంచలనం ఒకటి డార్విన్ మైదానంలో జరిగింది. క్రికెట్ దిగ్గజం ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే బంగ్లాదేశ్ జట్టు చిత్తు చేసింది. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నజ్ముల్ శాంటో సారథ్యంలోని బంగ్లాదేశ్ జట్టు ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

డార్విన్ లోని మారా ప్రాంగణంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఓడించడం టెస్ట్ చరిత్రలోనే ఇది మొదటిసారి కావడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో గ్రీన్ సెంచరీ చేసినప్పటికీ ఆస్ట్రేలియాను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వార్మప్ మ్యాచ్ ఓటమి నుండి చారిత్రక విజయం దాకా
Image Credit : X/ICC

వార్మప్ మ్యాచ్ ఓటమి నుండి చారిత్రక విజయం దాకా

ఈ టెస్ట్ సిరీస్‌కు కొద్ది రోజుల ముందు క్రికెట్ ఆస్ట్రేలియా XIతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘోరంగా విఫలమైంది. కేవలం 54 పరుగులకే ఆలౌట్ అయి, ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ ప్రధాన టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయ్యే సరికి బంగ్లాదేశ్ పూర్తిగా మారిపోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను బంగ్లా పేసర్ హసన్ మహమూద్ 55 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి 198 పరుగులకే కుప్పకూల్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఏకంగా 426 పరుగులు సాధించింది. దీంతో బంగ్లాదేశ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యమే మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. సాధారణంగా కంగారూలు ఫీల్డింగ్‌లో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ లో తీవ్రంగా నిరాశపరిచారు.

ఆస్ట్రేలియాలో ఆసియా జట్ల అత్యధిక టెస్ట్ విజయాలు (ఈ శతాబ్దంలో):

• భారత్: 7 విజయాలు

• బంగ్లాదేశ్: 1 విజయం

• శ్రీలంక: 0 విజయాలు

• పాకిస్తాన్: 0 విజయాలు

Related Articles

Related image1
Famous Temples in South India: సౌత్ ఇండియాలో జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టాప్ 5 హిందూ దేవాలయాలు
Related image2
Yashasvi Jaiswal: రాజస్థాన్ రాయల్స్‌కు యశస్వి జైస్వాల్ గుడ్ బై? హార్దిక్ పాండ్యాతో బిగ్ ట్రేడ్ డీల్ నిజమేనా?
36
మెహదీ హసన్ మిరాజ్ మేజిక్ స్పెల్
Image Credit : X/ICC

మెహదీ హసన్ మిరాజ్ మేజిక్ స్పెల్

మ్యాచ్ నాలుగో రోజు ఆల్ రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైన్ అప్‌ను దారుణంగా దెబ్బతీశాడు. ఆయన 33.1 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా తరఫున మూడో నంబర్‌లో వచ్చిన గ్రీన్ 104 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ అయింది.

ఫలితంగా బంగ్లాదేశ్ ముందు కేవలం 57 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ టార్గెట్‌ను బంగ్లాదేశ్ బ్యాటర్లు కేవలం 14.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేజ్ చేశారు. గతంలో 2024లో గబ్బాలో వెస్టిండీస్ బౌలర్ షమార్ జోసెఫ్ దాటికి ఆసీస్ 8 పరుగులతో ఓడిపోయింది. కానీ ఈసారి బంగ్లాదేశ్ ఆల్ రౌండ్ షోతో ఆసీస్‌ను పూర్తిగా దెబ్బతీసింది.

46
ఈ దశాబ్దంలో టెస్టుల్లో బంగ్లాదేశ్ సాధించిన ప్రముఖ విజయాలు:
Image Credit : X/ICC

ఈ దశాబ్దంలో టెస్టుల్లో బంగ్లాదేశ్ సాధించిన ప్రముఖ విజయాలు:

• ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్ విజయం

• న్యూజిలాండ్‌లో ఒక టెస్ట్ విజయం

• వెస్టిండీస్‌లో ఒక టెస్ట్ విజయం

• పాకిస్తాన్‌లో ఒక టెస్ట్ సిరీస్ విజయం

56
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు
Image Credit : X/ICC

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు

ఈ చరిత్రాత్మక విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ స్థానం బలపడింది. బంగ్లాదేశ్ మొత్తం పాయింట్లు 60కి చేరాయి. వారి పాయింట్ల శాతం (PCT) 58.33 నుండి 66.67కి పెరిగింది. అయితే పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ ప్రస్తుతం 4వ స్థానంలోనే కొనసాగుతోంది.

మరోవైపు సొంతగడ్డపై ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉండిపోయింది. కాకపోతే వారి పాయింట్ల శాతం (PCT) 87.50 నుండి 77.77కి పడిపోయింది. డబ్ల్యూటీసీ ప్రస్తుత సైకిల్‌లో ఆస్ట్రేలియా ఆడిన 9 టెస్టుల్లో 7 గెలిచి, 2 ఓడిపోయింది. విశేషమేమిటంటే ఆ రెండు ఓటములు కూడా వారికి సొంతగడ్డపైనే ఎదురయ్యాయి.

66
డబ్ల్యూటీసీ లో భారత్, శ్రీలంక స్థానాల పరిస్థితి ఏంటి?
Image Credit : X/ICC

డబ్ల్యూటీసీ లో భారత్, శ్రీలంక స్థానాల పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉంది. గాలే లో శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా గెలిచినా ఐదో స్థానంలోనే ఉంటుంది. కానీ భారత్ PCT 48.15 నుండి 53.33కి పెరుగుతుంది.

ఒకవేళ తొలి టెస్టులో శ్రీలంక గెలిస్తే, లంక జట్టు PCT 53.33కి చేరి ఐదో స్థానానికి వస్తుంది. అప్పుడు భారత్ ఆరో స్థానానికి (43.33 PCT) పడిపోతుంది. మ్యాచ్ డ్రా అయితే శ్రీలంక PCT 40.00 కి, భారత్ PCT 46.66 కి పడిపోతాయి. అయితే స్థానాల్లో మార్పు ఉండదు. కాగా, రెండు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్‌ను ఆగస్టు 22 నుండి 26 వరకు మెకాయ్‌లోని గ్రేట్ బారియర్ రీఫ్ ఎరీనాలో ఆడనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Yashasvi Jaiswal: రాజస్థాన్ రాయల్స్‌కు యశస్వి జైస్వాల్ గుడ్ బై? హార్దిక్ పాండ్యాతో బిగ్ ట్రేడ్ డీల్ నిజమేనా?
Recommended image2
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఏమైంది? అదే సీన్ !
Recommended image3
శ్రీలంక టెస్ట్ మ్యాచ్‌లో ప‌ట్టు బిగిస్తోన్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి
Related Stories
Recommended image1
Famous Temples in South India: సౌత్ ఇండియాలో జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టాప్ 5 హిందూ దేవాలయాలు
Recommended image2
Yashasvi Jaiswal: రాజస్థాన్ రాయల్స్‌కు యశస్వి జైస్వాల్ గుడ్ బై? హార్దిక్ పాండ్యాతో బిగ్ ట్రేడ్ డీల్ నిజమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved