MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పుజారా, ఉమేశ్‌లపై వేటు..? కుర్రాళ్లకు ఛాన్స్..! విండీస్ టూర్‌లో కొత్త ముఖాలు

పుజారా, ఉమేశ్‌లపై వేటు..? కుర్రాళ్లకు ఛాన్స్..! విండీస్ టూర్‌లో కొత్త ముఖాలు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ లో భారత జట్టు ఓటమి   పలువురు స్టార్ క్రికెటర్ల భవితవ్యంపై  తీవ్రంగా ప్రభావం చూపనుంది.  

2 Min read
Author : Srinivas M
Published : Jun 13 2023, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image credit: PTI

Image credit: PTI

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన భారత జట్టులోని పలువురు ఆటగాళ్లకు ఓటమి ప్రభావం గట్టిగానే పడేట్టుంది. టెస్టులలో కీలక ఆటగాళ్లైన  నయా వాల్ ఛటేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్ లపై వేటు పడనుందని తెలుస్తున్నది. త్వరలో జరుగబోయే వెస్టిండీస్ సిరీస్‌లో  వీళ్లిద్దరినీ తప్పించనున్నట్టు సమాచారం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

టీమిండియా నెంబర్ 3 టెస్ట్ బ్యాటర్  ఛటేశ్వర్ పుజారా  గత  డబ్ల్యూటీసీ  సైకిల్ లో ఒక్కటే సెంచరీ చేశాడు. గడిచిన మూడు నాలుగేండ్లుగా అతడి ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇదే కారణంతో పుజారాను శ్రీలంకతో టెస్టు సిరీస్ కు ఎంపిక  చేయలేదు.  

37
Cheteshwar Pujara

Cheteshwar Pujara

అయితే  కౌంటీలలో ఆడి తిరిగి పూర్వపు ఫామ్‌ను సంతరించుకున్న  పుజారా.. ఇంగ్లాండ్ తో బర్మింగ్‌‌హామ్ వేదికగా  జరిగిన  రీషెడ్యూల్డ్ టెస్టులో ఎంట్రీ ఇచ్చాడు. కౌంటీలలో రాణించినా  ఇంగ్లాండ్ తో టెస్టులో మాత్రం విఫలమయ్యాడు.  కొద్దిరోజుల క్రితమే భారత్ - ఆస్ట్రేలియా మధ్య  జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా పుజారా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. 

47

తాజాగా  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో కూడా  పుజారా పై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి  50 పరుగులు కూడా చేయలేదు. దీంతో  అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పుజారాను తప్పించి కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు వినిపించాయి. 

57

పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్ కెరీర్ కు కూడా ఎండ్ కార్డ్ పడ్డట్టే తెలుస్తున్నది. లయ కోల్పోయి భారత జట్టుకు చాలాకాలంగా దూరంగా ఉన్న ఉమేశ్.. డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా  ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.  ఈ మ్యాచ్ కు అశ్విన్ ను తప్పించి ఉమేశ్ ను ఎంపిక చేసినా అతడు బౌన్సీ వికెట్ పై అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఉమేశ్ ఎంపికపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.   ఇక ఫైనల్ ఓటమితో ఉమేశ్ ను  శాశ్వతంగా సాగనంపనున్నారని తెలుస్తున్నది.

67

ఈ ఇద్దరే గాక  వికెట్ కీపర్  కెఎస్ భరత్ పై కూడా వేటు పడే అవకాశముంది. రిషభ్ పంత్ గాయపడటంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన భరత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో  ఎంట్రీ ఇచ్చాడు.   కానీ ఈ ఆంధ్రా ఆటగాడు  నాలుగు టెస్టులలో కలిపి  చేసింది 129 పరుగులే. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా  భరత్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో విండీస్ టూర్ లో ఇతడిని కూడా పక్కనబెట్టి ఇషాన్ కిషన్ ను టెస్టులలో ఆడించే అవకాశాలున్నట్టు  బోర్డు వర్గాల సమాచారం. 

77
Image credit: PTI

Image credit: PTI

పుజారా, ఉమేశ్, భరత్ పై వేటు వేసి ఐపీఎల్ తో పాటు దేశవాళీలో మెరుస్తున్న యశస్వి జైస్వాల్,  రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ లతో పాటు పంజాబ్ కింగ్స్ తరఫున మెరుపులు మెరిపించిన యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మకు కూడా ఛాన్స్ దక్కొచ్చని  తెలుస్తున్నది. త్వరలో విండీస్ టూర్ కు భారత జట్టును  ప్రకటించే అవకాశం ఉండటంతో దీనిపై స్పష్టత రానున్నది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Recommended image2
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
Recommended image3
Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. గేల్ రికార్డ్ ఇక అవుట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved