MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Rate Hike: హైదరాబాద్‌లో పసిడి రేట్ల జోరు.. మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్

Gold Rate Hike: హైదరాబాద్‌లో పసిడి రేట్ల జోరు.. మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్

Gold Rate Hike: యుద్ధ భయం తగ్గినా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. మళ్లీ పరుగులు పెడుతోంది. క్రూడాయిల్ కుప్పకూలి డాలర్ బలహీనపడుతోంది..ఇదే సమయంలో హైదరాబాద్‌లో పసిడి రేట్లు పుంజుకున్నాయి. 

1 Min read
Author : Nandini Arava
Published : May 25 2026, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మళ్లీ తెరుచుకోనున్న హార్ముజ్ జలసంధి
Image Credit : Getty

మళ్లీ తెరుచుకోనున్న హార్ముజ్ జలసంధి

పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు క్రమంగా శాంతిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లలో కొత్త ఆశలు నింపుతోంది. హార్ముజ్ జలసంధి మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచ వాణిజ్యానికి ఊరటనిస్తోంది. ఇక రెండు దేశాలు వచ్చే 60 రోజుల పాటు అణు కార్యక్రమం నుంచి ఆర్థిక ఆంక్షల వరకు పలు అంశాలపై సమగ్ర చర్చలు జరపనున్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించేందుకు కూడా ఇరాన్ సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దేశీయ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు
Image Credit : Getty

దేశీయ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు

అయితే ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికన్ డాలర్ బలహీనపడడంతో బంగారం ధరలు మళ్లీ ఎగబాకాయి. డాలర్ విలువ తగ్గితే పెట్టుబడిదారులు బంగారంవైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో కూడా బంగారం రేట్లు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.1,46,100 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.320 పెరిగి తులానికి రూ.1,59,380కు చేరింది.

33
బలహీనపడుతున్న రూపాయి
Image Credit : X

బలహీనపడుతున్న రూపాయి

వెండి ధర మాత్రం ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.95 లక్షల వద్ద నిలిచింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.34 స్థాయికి పడిపోయింది. రూపాయి బలహీనపడటం కూడా దేశీయంగా బంగారం ధరలు పెరగడానికి మరో కారణంగా మారింది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office: ప్ర‌ధాని మోదీ కూడా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడుతున్నారు.. మీరు కూడా ట్రై చేస్తారా.?
Recommended image2
LPG New Rules October 1: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్
Recommended image3
Gold price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...మూడో రోజు బంగారం ధరలకు బ్రేక్..దిగొచ్చిన గోల్డ్
Related Stories
Recommended image1
Gold Rate Fall: ట్రంప్ వ్యాఖ్యలతో కుదేలైన గోల్డ్ మార్కెట్..యూటర్న్ తీసుకున్న బంగారం ధరలు
Recommended image2
Gold Rate Drop: బంగారం ధరలకు బ్రేక్..కొనేవారికి ఇదే సూపర్ ఛాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved