MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Business
  • Gold Price Crash: 10 రోజుల తర్వాత దిగొచ్చిన బంగారం.. ఎంత తగ్గిందంటే?

Gold Price Crash: 10 రోజుల తర్వాత దిగొచ్చిన బంగారం.. ఎంత తగ్గిందంటే?

Gold Price Crash: కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు ఎట్టకేలకు ఊరట దొరికింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు పసిడి ధరలను పైకి ఎగబాకుతున్నాయి. ఇవాళ దేశీయ మార్కెట్లో ధరలు తగ్గాయి. శ్రావణమాసంలో బంగారం కొనాలనుకునేవారికి రిలీఫ్ దొరికినట్లైంది.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 19 2026, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ధరలకు బ్రేక్
Image Credit : chatgpt

పసిడి ధరలకు బ్రేక్

గత కొన్ని రోజులుగా ఆగకుండా పరుగులు తీసిన పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. 
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.1,54,970కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.850 తగ్గడంతో రూ.1,42,050 వద్ద నమోదైంది. విజయవాడలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,54,970, 22 క్యారెట్ల పసిడి రూ.1,42,050, 18 క్యారెట్ల బంగారం రూ.1,16,920గా నమోదైంది. అయితే బంగారం ధరలు తగ్గాయన్న కారణంతో వెంటనే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం కంటే.. మీ నగరంలోని రిటైల్ మార్కెట్ ధరలు, నగలపై మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అంశాలను కూడా పరిశీలించడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇరాన్-అమెరికా విభేదాలతో మార్కెట్లలో ఆందోళన
Image Credit : chatgpt

ఇరాన్-అమెరికా విభేదాలతో మార్కెట్లలో ఆందోళన

ఇక పసిడి ధరలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మాత్రం కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న విభేదాలు మార్కెట్లలో ఆందోళన పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు సాధారణంగా రిస్క్ ఉన్న ఆస్తుల కంటే బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. అందుకే పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

Related Articles

Related image1
Gold Price Hike: వారం మొదట్లోనే పసిడి ధరల మోత..కొనాలనుకునేవారికి భారీ షాక్
Related image2
Gold Price Hike: శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్‌తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్
34
హర్మూజ్‌పై ఆంక్షలు
Image Credit : Getty

హర్మూజ్‌పై ఆంక్షలు

మరోవైపు హర్మూజ్ జలసంధి అంశం కూడా మార్కెట్లను కలవరపెడుతోంది. ఇరాన్‌తో చర్చలకు ప్రస్తుతం ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. హర్మూజ్‌లో పరిమిత స్థాయిలో నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, జలసంధి పూర్తిగా మూసుకుపోలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా వాదనలను ఖండిస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు హర్మూజ్‌పై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒమన్ విషయంలోనూ అమెరికా వైఖరి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇరాన్‌తో సంప్రదింపుల్లో ఒమన్ వ్యవహరిస్తున్న తీరుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

44
చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి
Image Credit : Asianet News

చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి

మరోవైపు సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి చేసినట్లు ఇరాన్ సపోర్ట్ ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ పరిణామాలతో ముడిచమురు మార్కెట్లలోనూ ఆందోళన కొనసాగుతోంది. అంటే.. ఒక్కవైపు యుద్ధ వాతావరణం, మరోవైపు హర్మూజ్ ఉద్రిక్తతలు, ఇంకోవైపు చమురు మార్కెట్‌లో అనిశ్చితి.. ఇవన్నీ కలిసి బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఈరోజు ధరలు తగ్గినా.. రానున్న రోజుల్లో పసిడి ధరలు మళ్లీ ఏ దిశలో కదులుతాయన్నది అంతర్జాతీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
త‌ల్లి గాజులు అమ్మి వ్యాపారం మొద‌లు పెట్టాడు.. నేడు రూ. 11,250 కోట్ల సామాజ్రాన్ని సృష్టించాడు
Recommended image2
Gold: బంగారాన్ని నగల రూపంలో కాకుండా ఇలా పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు
Recommended image3
Gold Price Hike: శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్‌తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్
Related Stories
Recommended image1
Gold Price Hike: వారం మొదట్లోనే పసిడి ధరల మోత..కొనాలనుకునేవారికి భారీ షాక్
Recommended image2
Gold Price Hike: శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్‌తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved