MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: వారం మొదట్లోనే పసిడి ధరల మోత..కొనాలనుకునేవారికి భారీ షాక్

Gold Price Hike: వారం మొదట్లోనే పసిడి ధరల మోత..కొనాలనుకునేవారికి భారీ షాక్

Gold Price Hike: బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్ తగిలింది. ఒక్కరోజులోనే గోల్డ్ రేట్లు ఎగబాకాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పసిడి ధర ఎంతకు చేరిందో తెలుసా? ఇప్పటికే రూ.3వేలకుపైగా పెరిగిన బంగారం..ఇక ముందు ఇంకా పెరుగుతుందా? అసలు ఈ పెరుగుదలకు కారణమేంటి?

2 Min read
Author : Nandini Arava
Published : Aug 17 2026, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు భారీ షాక్
Image Credit : chatgpt

పసిడి ప్రియులకు భారీ షాక్

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మరోసారి షాక్ తగిలింది. పసిడి ధరలు మళ్లీ పైపైకి ఎగబాకుతున్నాయి. వారం ప్రారంభంలోనే ధరలు పెరగడంతో బంగారం కొనాలనుకునే వారిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే గత వారం గోల్డ్ రేట్లు రూ.3 వేలకుపైగా పెరగ్గా.. ఇప్పుడు మరోసారి ధరలు పెరగడం కొనుగోలుదారులకు భారంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,55,660తో దూసుకెళ్లున్న పసిడి ధరలు
Image Credit : Getty

రూ.1,55,660తో దూసుకెళ్లున్న పసిడి ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న మార్పులు, బాండ్ ఈల్డ్స్‌లో కదలికలు.. ఇలా పలు అంశాలు పసిడి ధరలకు ధరలు పెరిగేలా చేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి పెరిగిన సమయంలో ఇన్వెస్టర్లు సాధారణంగా సురక్షిత పెట్టుబడి సాధనాల వైపు మొగ్గుచూపుతారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో డాలర్ విలువలో మార్పులు కూడా అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిసిరావడంతో పసిడి ధరలు మరోసారి దూసుకెళ్తున్నాయి.

Related Articles

Related image1
Gold Price Hike: గోల్డ్ రేట్లు ఇక ఎటు? ప్రపంచ పరిణామాలతో పెరుగుతున్న టెన్షన్!
Related image2
Gold Price Crash: ఎటూ తేలని యుద్ధం.. బంగారం మార్కెట్ పతనం..భారీగా పడిపోయిన పసిడి, సిల్వర్
34
రూ.1,55,660కు చేరిన బంగారం ధరలు
Image Credit : Asianet News

రూ.1,55,660కు చేరిన బంగారం ధరలు

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.530 పెరిగి రూ.1,55,660కు చేరింది. అంటే కేవలం ఒక్కరోజులోనే 10 గ్రాములపై రూ.530 పెరుగుదల నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.1,42,700కు చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధరలోనూ పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి రూ.410 పెరిగి రూ.1,16,760గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు మాత్రం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది. చెన్నైలోనూ కిలో వెండి ఇదే స్థాయిలో ట్రేడవుతోంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.

44
త్వరలోనే ఉపశమనం లభిస్తుందా?
Image Credit : iSTOCK

త్వరలోనే ఉపశమనం లభిస్తుందా?

ఇక ముందున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాలు, డాలర్ కదలికలు, ఇన్వెస్టర్ల కొనుగోళ్లు వంటి అంశాలపై ధరల దిశ ఆధారపడి ఉంటుంది. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. ధరలు మరింత పెరుగుతాయా? లేక త్వరలోనే ఉపశమనం లభిస్తుందా? అనేది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్ ఇదే.. నెల‌కు రూ. 180తో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
Recommended image2
Post Office: అస‌లు అలాగే ఉంటుంది, ప్ర‌తీ నెల మీ అకౌంట్‌లో రూ. 5500 వ‌డ్డీ ప‌డుతుంది
Recommended image3
Gold Price Hike: గోల్డ్ రేట్లు ఇక ఎటు? ప్రపంచ పరిణామాలతో పెరుగుతున్న టెన్షన్!
Related Stories
Recommended image1
Gold Price Hike: గోల్డ్ రేట్లు ఇక ఎటు? ప్రపంచ పరిణామాలతో పెరుగుతున్న టెన్షన్!
Recommended image2
Gold Price Crash: ఎటూ తేలని యుద్ధం.. బంగారం మార్కెట్ పతనం..భారీగా పడిపోయిన పసిడి, సిల్వర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved