MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • EV Bike Subsidy : ఈ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఇ-బైక్ పై ఏకంగా లక్ష రూపాయల సబ్సిడీ

EV Bike Subsidy : ఈ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఇ-బైక్ పై ఏకంగా లక్ష రూపాయల సబ్సిడీ

ఉద్యోగం చేసే మహిళలు, కాలేజీ విద్యార్థినులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్ టూ-వీలర్ కొనేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం 75% లేదా రూ.1 లక్ష వరకు సబ్సిడీ ఇస్తోంది. మహిళల భద్రత, విద్య, ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించడమే ఈ స్కీమ్ లక్ష్యం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 16 2026, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహిళలకు గుడ్ న్యూస్
Image Credit : Gemini AI

మహిళలకు గుడ్ న్యూస్

మహిళల చదువు, ఉద్యోగం, ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం 'ముదల్వరిన్ పుదుమై పెణ్ స్కీమ్' అమలు చేస్తోంది. ఈ పథకం కింద మహిళా ఉద్యోగులు, కాలేజీ అమ్మాయిలు ఇ-బైక్ కొనేందుకు 75% లేదా గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు సబ్సిడీ పొందవచ్చు. మహిళా సాధికారత, సురక్షిత ప్రయాణంతో పాటు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సబ్సిడిపై స్కూటీ పొందాలంటే ఏ అర్హతలుండాలి?
Image Credit : Ather

సబ్సిడిపై స్కూటీ పొందాలంటే ఏ అర్హతలుండాలి?

ఈ పథకానికి అప్లై చేయాలంటే మహిళలు కొన్ని అర్హతలు ఉండాలి. 

  • దరఖాస్తుదారులు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందినవారై ఉండాలి. 
  • పుదుచ్చేరిలో కనీసం 5 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలి. 
  • వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.
  •  తప్పనిసరిగా టూ-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 
  • ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకు ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.
35
సబ్సిడిపై స్కూటీ పొందాలంటే ఈ పత్రాలు ఉండాలి
Image Credit : Gemini

సబ్సిడిపై స్కూటీ పొందాలంటే ఈ పత్రాలు ఉండాలి

భారీ సబ్సిడితో స్కూటీని పొందేందుకు ముందుకు అప్లై చేసుకోవాలి. ఈ సమయంలో జనన ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వాహనం అసలు ఇన్వాయిస్ సమర్పించాలి. ఉద్యోగం చేసే మహిళలు EPF/ESI కార్డ్, జీతం స్లిప్ లేదా ఇ-శ్రమ్ కార్డ్‌ను జతచేయాలి. విద్యార్థినులు కాలేజీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.

45
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Image Credit : TVS

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఈ పథకానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలనుకునేవారు పుదుచ్చేరి ప్రభుత్వ ఇ-డిస్ట్రిక్ట్ పోర్టల్‌లో 'ముదల్వరిన్ పుదుమై పెణ్ స్కీమ్ ఫర్ ఇ-స్కూటర్ సబ్సిడీ' లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో అయితే, పుదుచ్చేరి ఆది ద్రావిడర్, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాల్లో ఉచితంగా దరఖాస్తు ఫారం తీసుకుని, నింపి సమర్పించవచ్చు.

55
 ఎలా ఎంపిక చేస్తారు?
Image Credit : META AI

ఎలా ఎంపిక చేస్తారు?

అధికారులు దరఖాస్తులను పరిశీలించి 'ముందు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం' పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వాహనం కొన్న తర్వాత దాని అసలు ఇన్వాయిస్‌ను సమర్పించగానే, సబ్సిడీ డబ్బును నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో DBT పద్ధతిలో జమ చేస్తారు. అయితే సబ్సిడీ పొందిన వాహనాన్ని కొన్న 5 ఏళ్ల వరకు అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం చేయకూడదు. ఈ అద్భుత అవకాశాన్ని అర్హులైన మహిళలు, విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Budget Cars: పండగ సేల్... చాలా తక్కువ ధరకే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్న టాప్ 5 కార్లు
Recommended image2
Car Offers : అక్టోబర్ లో ఈ కారు కొంటే.. ఏకంగా రూ.2.34 లక్షలు సేవ్
Recommended image3
Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు
Related Stories
Recommended image1
Cheapest Tesla EV India: ఇండియాలోకి టెస్లా చీపెస్ట్ ఈవీ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లు!
Recommended image2
Long Drive EV Bike: ఈ బైక్‌ను 20 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 600 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved