- Home
- Business
- Long Drive EV Bike: ఈ బైక్‌ను 20 నిమిషాలు ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోవచ్చు
Long Drive EV Bike: ఈ బైక్‌ను 20 నిమిషాలు ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లిపోవచ్చు
Long Drive EV Bike: ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఇప్పుడు కొత్త బైక్ వచ్చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు ఆరువందల కిలోమీటర్లు ఆగకుండా వెళ్లవచ్చు. కొత్త టెక్నాలజీ, సాంప్రదాయ బ్యాటరీల కన్నా ఎక్కువ రేంజ్ ఉన్న బైక్ గురించి ఇక్కడ చెప్పాము.

లాంగ్ డ్రైవ్ కోసం కొత్త బైక్
ఫిన్‌లాండ్‌కు చెందిన వెర్జ్ మోటార్‌సైకిల్స్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలన అడుగు వేసింది. ప్రపంచంలోనే తొలి సాలిడ్ స్టేట్ బ్యాటరీతో ఈవీ బైక్ తయారు చేసింది. ఈ బైక్ పేరు Verge TS Pro. ఇప్పటివరకు సాలిడ్ స్టేట్ బ్యాటరీలు పరిశోధన స్థాయిలో మాత్రమే ఉన్నాయి. కానీ వాటిని సాధారణ వినియోగదారుల కోసం బైక్‌లో ఉపయోగించడం ఇదే మొదటిసారి అని ఈ కంపెనీ చెబుతోంది. దీంతో ఎలక్ట్రిక్ బైక్‌ల టెక్నాలజీ పూర్తిగా కొత్త అడుగువేసినట్టే. ఇది ఎక్కువ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, భద్రతతో ఈవీ రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతోంది.
ఒక్క ఛార్జ్ తో చాలా దూరం వెళ్లచ్చు
సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్రత్యేకతలు ఎక్కువే. దీనిలో సాధారణ లిథియం అయాన్ బ్యాటరీల్లో ఉండే ద్రవ ఎలక్ట్రోలైట్ బదులు ఘన రూపంలో ఉండే పదార్థాన్ని వాడతారు. దీని వల్ల బ్యాటరీ చాలా బలంగా ఉంటుంది. దీనివల్ల అగ్ని ప్రమాదాలు, లీకేజీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఈ బ్యాటరీలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. దీని ఫలితంగా Verge TS Pro బైక్ ఎక్కువ దూరాలు ప్రయాణించగలదు. ఈ బైక్ ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 480 నుంచి 600 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ బైక్‌ల కంటే ఎంతో ఎక్కువ.
ప్రత్యేకమైన బైక్
ఛార్జింగ్ విషయంలో కూడా ఈ బైక్ చాలా ప్రత్యేకమైనది. సాలిడ్ స్టేట్ బ్యాటరీ కారణంగా వేగంగా ఛార్జ్ అయ్యే సామర్థ్యం దీనికి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లో కొద్ది నిమిషాల్లోనే ఈ బ్యాటరీ ఛార్జ్ అయిపతుంది. దీంతో దూర ప్రయాణాలు చేసే వారికి ఈ బైక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే Verge TS Pro చాలా ఆధునికంగా కనిపిస్తుంది. శక్తివంతమైన యాక్సిలరేషన్, స్మార్ట్ డిస్‌ప్లే, ఆధునిక సాఫ్ట్‌వేర్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ధర ఎంత?
ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం కొత్త మోడల్ మాత్రమే కాదు... భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాల దశను మార్చేస్తుంది. ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీలు రాబోయే రోజుల్లో కార్లు, బస్సులు, ఇతర వాహనాల్లోనూ వాడే అవకాశముంది. అయితే వీటి ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొదట ఇది ప్రీమియం కస్టమర్లకే అందుబాటులో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

