MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!

Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!

Mars Saturn Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 1న కుజుడు, శని గ్రహాలు ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలోకి రానున్నాయి. దీనవల్ల శక్తివంతమైన కేంద్ర దృష్టి యోగం ఏర్పడనుంది. ఈ యోగం నాలుగు రాశుల వారికి అదృష్టం తీసుకురానుంది. ఆ రాశులేవో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : Aug 31 2026, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేంద్ర దృష్టి యోగంతో లాభం పొందే రాశులు
Image Credit : Asianet News

కేంద్ర దృష్టి యోగంతో లాభం పొందే రాశులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేపు (సెప్టెంబర్ 1) మధ్యాహ్నం 3:25 గంటలకు కుజ, శని గ్రహాలు 90 డిగ్రీల కోణంలోకి రానున్నాయి. దీనివల్ల 'కేంద్ర దృష్టి యోగం' ఏర్పడుతుంది. ఈ యోగం కొద్దికాలమే ఉన్నా, నాలుగు రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకురానుంది. వీరి కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మరి ఆ నాలుగు అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి
Image Credit : Chat gpt

మేష రాశి

కేంద్ర దృష్టి యోగం మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం కావచ్చు. చాలా కాలంగా ఉన్న గొడవలు ముగుస్తాయి. దెబ్బతిన్న సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

35
వృశ్చిక రాశి
Image Credit : our own

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ కుజ శని కలయిక సానుకూల ఫలితాలను ఇస్తుంది. వీరిలో ఆత్మవిశ్వాసం, శారీరక బలం పెరుగుతాయి. పనిలో ఉత్సాహంగా ఉంటారు. పాత స్నేహితుడి సహాయంతో ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఈ సమయం ఆర్థిక లాభాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది.

45
ధనుస్సు రాశి
Image Credit : Pixabay

ధనుస్సు రాశి

కేంద్ర దృష్టి యోగం ధనుస్సు రాశి వారికి మంచి రోజులను తీసుకువస్తుంది. జీవితంలో పురోగతి, శాంతి, సంతోషం నెలకొంటాయి. చేపట్టిన పనిలో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. విదేశాల్లో మీ కెరీర్ లేదా వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు సఫలమవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి గౌరవం లభిస్తుంది. డబ్బు సంపాదించే కొత్త అవకాశాలు వస్తాయి. బంధువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి.

55
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి కుజ, శని గ్రహాల కలయిక వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గతంలో వేసుకున్న ప్రణాళికలపై పని మొదలుపెట్టగలుగుతారు. ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి రావచ్చు. మీ వ్యాపారాన్ని విస్తరించాలనే కోరిక నెరవేరుతుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కీలక బాధ్యతలు దక్కవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Retrograde: దసరాకు నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ 4 రాశులకు విపరీతమైన అదృష్టం
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా సొంతంగా ఆలోచించడం మంచిది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి!
Related Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసా?
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 4 అలవాట్లు ఉన్నవాళ్ల దగ్గర డబ్బు అస్సలు నిలవదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved