MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?

September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?

September Horoscope: ఈ మాస ఫలాలు సెప్టెంబర్ నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

4 Min read
Author : Kavitha G
Published : Sep 01 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
మాస ఫలాలు
Image Credit : Getty

మాస ఫలాలు

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఈ మాసం మేష రాశివారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తండ్రి తరపు నుంచి స్థిరాస్తి లాభాలు పొందుతారు. సంతానం విద్యా విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మాసం చివరన బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి.

Related Articles

Related image1
Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!
Related image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 4 అలవాట్లు ఉన్నవాళ్ల దగ్గర డబ్బు అస్సలు నిలవదు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఈ మాసం వృషభ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. తల్లితరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులతో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి ఈ మాసం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అవసరానికి బంధు మిత్రుల నుంచి డబ్బు సహాయం లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలను రాజీ చేసుకుంటారు. దాయాదులతో ఉన్న వివాదాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీపరీక్షలకు మరింత కష్టపడాల్సి వస్తుంది. పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలమిస్తాయి. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. చేపట్టిన ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు సాగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతానం విద్యా విషయాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిరు ప్రయత్నంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఈ మాసం సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి విమర్శలు తప్పవు. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు తప్పవు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మాసం చివరన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. జీవితభాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. వృత్తి, వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఒక ముఖ్యమైన విషయంలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవు. వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. మాసం మధ్యలో బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారికి ఈ మాసం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు చిన్న కష్టంతో పెద్ద ఫలితం పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయటా అందరిని ఒక తాటిపైకి తీసుకువస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. కీలక వ్యవహారాలలో శత్రువులపై విజయం సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. సంతాన శుభకార్యాల గురించి చర్చిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలాకాలంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు. వాహన వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఈ మాసం మకర రాశివారికి అంతగా అనుకూలించదు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకి తగ్గిన ఫలితం లభించదు. ఇంటా బయటా పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్ర హారాలు ఉండవు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగుల కష్టం వృథాగా మిగులుతుంది. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. మాసం చివరన మొండి బాకీలు వసూలవుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఈ మాసం కుంభ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరులను విమర్శించడం మానుకోవాలి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు మానసికంగా కలచివేస్తాయి. సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభించదు. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిపివేస్తారు. డబ్బు వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. వృథా ప్రయాణాలు చేస్తారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు పెద్దల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!
Related Stories
Recommended image1
Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 4 అలవాట్లు ఉన్నవాళ్ల దగ్గర డబ్బు అస్సలు నిలవదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved