Baba Vanga: ఈ ఏడాది వినాశనం తప్పదా.? బాబా వంగా జోస్యంలో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు
బాబా వంగా గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. బల్గేరియా దేశానికి చెందిన ఈ ప్రసిద్ధ కాలజ్ఞానికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. 1911లో జన్మించిన ఆమె బతుకున్న సమయంలో ఎన్నో విషయాలను తెలిపింది. భవిష్యత్తులో ఏం జరగనున్నాయన్న విషయాలను ఆమె ప్రస్తావించారు. వీటి ప్రకారం 2025లో భారత్‌లో భారీ వినాశనం జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపింది. ఇంతకీ ఎలాంటి నష్టం జరగనుందో ఇప్పుడు చూద్దాం..

బాబా వంగా చిన్నప్పుడే చూపు కోల్పోయారు. 1911లో జన్మించిన ఆమె 1996లో మరణించారు. అయితే బతుకున్న సమయంలో ఆమె కాలజ్ఞానాన్ని వివరించారు. భవిష్యత్తులో ఏం జరగనుందో అప్పుడే వివరించారు. ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. అందుకే ఆమె మాటలపై ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి నమ్మకం ఏర్పడింది. 2025 గురించి కొన్ని భయానక విషయాలు చెప్పారు. గత కొన్ని రోజులుగా ఇండియాలో దీని ప్రభావం కనిపిస్తోంది.

బాబా వంగా జోస్యం
2025లో ప్రపంచంలో చాలా చోట్ల భూకంపాలు వస్తాయని బాబా వంగా ఎప్పుడో చెప్పారు. చాలా నష్టం జరుగుతుందని, చాలా మంది చనిపోతారని చెప్పారు. గత కొన్ని రోజులుగా అమెరికా నుంచి ఆసియా వరకు భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇక ఇండియాలో ఢిల్లీ నుంచి బీహార్ వరకు భూమి కంపించిన విషయం తెలిసిందే.
దీంతో బాబా వంగా చెప్పిన టైమ్ దగ్గర పడిందా అని భయపడుతున్నారు. ఆమెకు చూపు లేకపోయినా, భవిష్యత్తులో జరిగే విషయాలు సరిగ్గా అంచా వేసి చెప్పారు. ఇందులో భాగంగానే 2025లో భూకంపాలు వస్తాయని వివరించారు. వీటి కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందని బాబా వంగా ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పారు.

అమెరికాలోని పశ్చిమ తీరంలో భూకంపం వచ్చి చాలా నష్టం జరుగుతుందని బాబా వంగా తెలిపారు. ఇక జనవరి నుంచి ఇప్పటి వరకు ఇండియాలో చాలా చోట్ల భూకంపాలు వచ్చాయి. ఢిల్లీలో కూడా ఈ సంవత్సరం చాలాసార్లు భూమి కంపించింది. వీటిలో కొన్నిసార్లు ఢిల్లీ కేంద్రంగా భూకంపాలు సంభవించాయి. కూడా. ఇక బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్, అస్సాం వరకు భూకంపం సంభవించింది.
ఆసియా, అమెరికా ఇంకా వేరే దేశాల్లో కూడా భూకంపాలు తరచూ సంభవిస్తున్నాయి. .ఇలా భూకంపాలు ఎక్కువ కావడంతో బాబా వంగా చెప్పింది నిజమేనని చాలా మంది భావిస్తున్నారు. ఆమె చెప్పినట్లు ఈ ఏడాది ఇంకెన్ని భూకంపాలు చూడాల్సి వస్తుందో అని భయపడుతున్నారు.

ఎవరీ బాబా వంగా?
ఇంతకీ ఎవరీ బాబా వంగా?
బల్గేరియాకు చెందిన వంజేలియా పాండేవా గుష్టెరోవా ప్రపంచవ్యాప్తంగా బాబా వంగాగా ప్రాచుర్యం పొందారు. కొన్నేళ్ల క్రితం భవిష్యత్తులో ఏం జరగనుందో అని ఆమె చెప్పిన చాలా విషయాలు నిజమవుతూ వస్తున్నాయి. పుట్టుకతోనే అంధురాలైన బాబా వంగా భవిష్యత్తును ఎలా ఊహించారన్నదే ఆసక్తికరమైన విషయం. ఆమె బల్గేరియాలోని బెలాసికా పర్వతాల్లోని రూపిట్ ప్రాంతంలో ఎక్కువ కాలం ఉన్నారు.
పెళ్లయ్యాక కొన్ని సంవత్సరాలు కనిపించకుండా పోయిన బాబా వంగా ఆచూకి తర్వాత మళ్లీ లభించింది. 1911 జనవరి 31న పుట్టిన ఆమె, 1996 ఆగస్టు 11న మరణించారు. 1970, 1980లలో తూర్పు ఐరోపాలో ఆమెకు చాలా పేరు వచ్చింది. బాబా వంగా చెప్పిన 2001 అమెరికా ట్విన్ టవర్స్ దాడి, కరోనా వైరస్ వంటివి నిజంగా జరిగాయి. దీంతో ఆమె చెప్పిన విషయాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంటుంది.
ఇది కూడా చదవండి: మార్చి నెలలో పుట్టిన వారితో జాగ్రత్తగా ఉండాలి, వీరిలో కనిపించే ప్రధాన లక్షణాలు ఇవే..