Astrology: మార్చి నెలలో పుట్టిన వారితో జాగ్రత్తగా ఉండాలి, వీరిలో కనిపించే ప్రధాన లక్షణాలు ఇవే..
కొత్తేడాదిలో అప్పుడే రెండు నెలలు ముగిసిపోయాయి. మార్చి నెల మొదలైంది. క్యాలెండర్‌లో మారే నెలల ఆధారంగా గ్రహాల కదలికలు కూడా మారుతాయని తెలిసిందే. ఇవి ఆ నెలలో జన్మించిన వారిపై ప్రభావం చూపుతుంటాయి. అయితే మార్చి నెలలో జన్మించిన వారి ఆలోచనలు ఎలా ఉంటాయి.? వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

March Born People
వీరితో జాగ్రత్తగా ఉండాలి:
మార్చి నెలలో పుట్టిన వారు చాలా తెలివైన వారని చెప్పాలి. వీరిని మోసం చేయాలనుకోవడం అవివేకమే అవుతుంది. వీరితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలో జన్మించిన వారితో ఎక్కువ కాలం స్నేహం చేయడం కష్టం. ఇతరులతో ఎక్కువగా సఖ్యతతో ఉండరు. వీరికి త్వరగా కోపం వస్తుంది. ఆలోచనలు చాలా వేగంగా మారుతుంటాయి. స్వతంత్ర్య భావాలు ఎక్కువగా ఉంటాయి. ఎవ్వరినీ లెక్కచేయరు. వీరు శతృత్వాన్ని కొని తెచ్చుకుంటారు.

సున్నిత మనస్సు కలిగి ఉంటారు:
ఈ నెలలో జన్మించిన వారు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. చిన్న విషయాలకు కూడా బాధపడుతుంటారు. తరచూ అలుగుతుంటారు. ఇతరులను ఎక్కువగా గౌరవిస్తారు. అయితే ఎదుటి వ్యక్తి నుంచి మర్యాద తగ్గితే మాత్రం వారిని మరోసారి తిరిగి చూడరు. తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకుంటారు.

మాటలు పొదుపుగా:
మార్చిలో జన్మించిన వారు మాటలను పొదుపుగా ఉపయోగిస్తుంటారు. అవగాహన పెంచుకున్న తర్వాతే మాట్లాడుతారు. తెలియని విషయాన్ని తెలుసన్నట్లు చెప్పరు. పైకి చూడ్డానికి సాదాసీదాగా కనిపించినా లోతైన ఆలోచనలను కలిగి ఉంటారు.

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు:
వీరు తాము తీసుకున్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఎంతటి ఒత్తిడి ఎదురైనా, పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మొదలు పెట్టిన పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. అలాగే నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరు తప్పు చేయరు, తమతో ఉన్న వారిని చేయమని ప్రోత్సహించరు.

కొన్ని చెడు గుణాలు:
అయితే మార్చిలో జన్మించిన వారిలో కొన్ని చెడు గుణాలు కూడా ఉంటాయి. వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. మేము అనుకున్నది కచ్చితంగా జరిగి తీరాల్సిందే అన్న ఆలోచనతో ఉంటారు. ఇది వీరి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. అలాగే వీరి దగ్గర ఎలాంటి రహస్యాలు దాగవు. ఇతరులు చెప్పిన రహస్యాలను అస్సలు దాచుకోరు.
గమనిక: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

