MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • School Holiday : తీవ్ర వాయుగుండం లోడింగ్, ఇక కుండపోత వర్షాలే... ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

School Holiday : తీవ్ర వాయుగుండం లోడింగ్, ఇక కుండపోత వర్షాలే... ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

ఈ వర్షాకాలంలో మొదటిసారి వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు సెలవు రావడం. తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తున్నారు అధికారులు.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 22 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు
Image Credit : gemini

ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు

School Holidays : ఎల్ నినో ప్రభావంతో ఇంతకాలం ముఖం చాటేసిన వర్షాలు ఇప్పుడు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు కాస్త అనుకూలంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి... ముఖ్యంగా ఉత్తరాంద్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో నదులు, వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి... జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఇలాంటి సమయంలో రాబోయే రెండుమూడు రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా వర్ష ప్రభావిత జిల్లాల్లో సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శ్రీకాకుళంలో విద్యాసంస్థలకు సెలవు
Image Credit : Gemini AI

శ్రీకాకుళంలో విద్యాసంస్థలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి అతిభారీ వర్షాలను కురిపించనుందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అతి తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం నమోదై ప్లాష్ ప్లడ్స్ కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి... రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 23, 24) తేదీల్లో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు... జిల్లాలోని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. అయితే స్థానిక పరిస్థితుల ఆధారంగా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు (MEO) కలిసి సెలవుపై తుది నిర్ణయం తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు.

34
ఈ జిల్లాల్లోనూ స్కూళ్లకి సెలవు ఉంటుందా?
Image Credit : Chatgpt

ఈ జిల్లాల్లోనూ స్కూళ్లకి సెలవు ఉంటుందా?

కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర మొత్తం జోరువానలు కురుస్తున్నాయి. దీంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు ఎక్కువగా ఉంటే విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నుండి కూడా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి... కాబట్టి ఏ నిమిషమైన సెలవుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

44
తీవ్ర వాయుగుండం లోడింగ్..
Image Credit : Gemini AI

తీవ్ర వాయుగుండం లోడింగ్..

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా బలపడింది... రాబోయే 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఒడిశాలోని గోపాల్‌పూర్ కు 220 కిమీ, పూరీకు 220 కిమీ, కళింగపట్నంకు 230 కిమీ, విశాఖపట్నంకు 320 కిమీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతం అయినట్లు APSDMA తెలిపింది.

సెప్టెంబర్ 23న అంటే రేపు (బుధవారం) వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారుతుందట... ఇదేరోజు రాత్రికి లేదా సెప్టెంబర్ 24 (గురువారం) తెల్లవారుజామున విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని APSDMA అంచనా వేస్దోంది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు (మంగళ, బుధవారం) శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Recommended image2
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?
Recommended image3
Now Playing
జగన్ ను అడ్డంగా ఇరికించిన సాయిరెడ్డి | Vijaysai Reddy On YS Jagan | Asianet News Telugu
Related Stories
Recommended image1
School Holidays : అక్టోబర్ నెలలో మొత్తం 31 రోజులు.. అందులో 16 రోజులు సెలవులే
Recommended image2
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved