MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • Onion Price : మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.70-80.. ఇక్కడ మాత్రం కేవలం 32 రూపాయలే

Onion Price : మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.70-80.. ఇక్కడ మాత్రం కేవలం 32 రూపాయలే

ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి… సామాన్యులు వీటిని కొనలేని పరిస్థితి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీ ధరల్లో ఉల్లిపాయలను విక్రయించేందుకు సిద్దమయ్యింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 09 2026, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అతితక్కువ ధరలో ఉల్లిపాయలు..
Image Credit : Gemini AI

అతితక్కువ ధరలో ఉల్లిపాయలు..

Onion Price : ప్రతి వంటగదిలో తప్పకుండా ఉల్లిపాయలు ఉంటాయి... ఇవి లేకుండా వంట పూర్తిచేయడం అసాధ్యం అనే చెప్పాలి. ప్రతి వంటకం తాలింపులో ఉల్లిపాయలు పడాల్సిందే... ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అందుకే '' ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు'' అని అంటుంటారు. తెలుగువారి వంటింట్లో అయితే ఉల్లిపాయలదే కీలకపాత్ర... పప్పు, సాంబార్, కర్రీ ఇలా దేంట్లో అయినా ఇవి ఉండాల్సిందే... చివరికి సద్దన్నంలో కూడా ఉల్లిపాయలు నంజుకుని తింటుంటారు.

అయితే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఉల్లి ధరలు కొండెక్కాయి... మొన్నటివరకు కిలో రూ.20-30 ఉంటే ఇప్పుడు సడన్ గా హాఫ్ సెంచరీ మార్క్ దాటేసిన ధరలు సెంచరీ దిశగా పరుగుతీస్తున్నాయి. ఈ ధరలను కంట్రోల్ చేయకపోతే సామాన్యుడికి ఉల్లి దూరం కావడం ఖాయం... అందుకే రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల తగ్గింపుకు చర్యలు చేపట్టాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏపీలో రూ.32కే కిలో ఉల్లిపాయలు..
Image Credit : Gemini AI

ఏపీలో రూ.32కే కిలో ఉల్లిపాయలు..

ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందుబాటు ధరల్లో ఉల్లిపాయలను అందించేందుకు సిద్దమయ్యింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిల్లీకి వెళ్లిమరీ కేంద్ర ప్రభుత్వంతో ఉల్లి ధరలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఏపీకి భారీగా ఉల్లిపాయలను సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించింది... వీటిని రాయితీ ధరలో ప్రజలకు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయలు రూ.50-60 ధర పలుకుతున్నాయి... మంచి నాణ్యత కలిగినవి రూ.70-80 కి అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు ఉల్లి కొనలేని పరిస్థితి... భవిష్యత్ లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం భారీ సబ్సిడీలో వివిధ నగరాల్లోని రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు అమ్మేందుకు సిద్దమయ్యింది. కేవలం రూ.32 కే కిలో ఉల్లి అమ్మనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Related Articles

Related image1
Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?
Related image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
34
ఉల్లి సరఫరా కోసమే 'కందా ఎక్స్ ప్రెస్' పరుగులు
Image Credit : AI image - Gemini

ఉల్లి సరఫరా కోసమే 'కందా ఎక్స్ ప్రెస్' పరుగులు

ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది... ఇందులో భాగంగానే 'కందా ఎక్స్ ప్రెస్' రైలుని నడుపుతోంది. కేంద్రం వద్ద భారీగా ఉల్లి నిల్వల ఉన్నాయి... వీటిని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ఈ కందా ట్రైన్ ను ఉపయోగిస్తున్నారు. ఇలా ఉల్లి కొరత లేకుండా చూసి ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర పౌరసరఫరాల శాఖ.

ఉల్లిపాయల ధరలు మండిపోతున్న నగరాలకు ఈ కందా ట్రైన్ ను నడుపుతున్నారు... ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో సబ్సిడీ ధరకు ఉల్లిని విక్రయిస్తున్నారు. ఇలా కొన్నిచోట్ల కేవలం రూ.35 కే ఉల్లిపాయల అమ్మకాలు ప్రారంభమయ్యింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు కూడా భారీ ఉల్లి లోడ్ తో కందా ఎక్స్ ప్రెస్ రాబోతోంది... తక్కువ ధరకే తెలుగు ప్రజలకు ఉల్లి లభించనుంది.

44
డీమార్టు లాగే ఏపీలో మీ మార్టులు
Image Credit : Chatgpt

డీమార్టు లాగే ఏపీలో మీ మార్టులు

సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు అందించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. డీమార్టు మాదిరిగానే 'మీ మార్టు' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో అతి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అమ్మాలని నిర్ణయించింది. ఇలా ఈ అక్టోబర్ ఫస్ట్ నుండి తొలివిడతగా 1000 కి పైగా మీ మార్టులను ప్రారంభించనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మీ మార్టుల ద్వారా 64 రకాల సరుకులను పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే అందించనున్నారు.

ఇక పామాయిల్, కందిపప్పు వంటివి మార్కెట్ ధరకంటే 25-30 శాతం తక్కువ ధరకే అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. కేంద్రం ఉల్లిపాయలతో పాటు ఫామాయిల్, కందిపప్పును రాష్ట్రానికి కేటాయించిందని... వీటిని సామాన్యుల వద్దకు చేర్చడమే తమ లక్ష్యమన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన గాలులు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Recommended image2
Now Playing
లైవ్: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్ | వైఎస్ జగన్ లేటెస్ట్ ప్రెస్ మీట్ | వైఎస్‌ఆర్‌సిపి లేటెస్ట్ న్యూస్
Recommended image3
Flight: తిరుప‌తికి కొత్త విమాన స‌ర్వీస్‌.. టైమింగ్స్, టికెట్ ధ‌ర వివ‌రాలు
Related Stories
Recommended image1
Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved