దివంగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జీవిత చరిత్రతో తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. వైఎస్సార్ పాదయాత్ర నేపధ్యంలో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

దివంగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జీవిత చరిత్రతో తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. వైఎస్సార్ పాదయాత్ర నేపధ్యంలో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఎన్నికలకు ముందుకు ఈ సినిమా విడుదల కావడం హాట్ టాపిక్ గా మారింది. ఓవర్సీస్ లో ఈ సినిమా 180 స్క్రీన్ లలో విడుదల చేయగా.. రెండు తెలుగు రాష్ట్రాలలో 500 స్క్రీన్ లలో విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 970 స్క్రీన్ లలో విడుదలైంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమా ప్రదర్శితం కావడంతో అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. 

వైఎస్ గా మమ్ముట్టి ఎంట్రీ సీన్ హైలైట్ అని అంటున్నారు. వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటన వంక పెట్టలేని విధంగా ఉందని, డైరెక్టర్ నేరుగా కథలోకి వెళ్లి ఎమోషనల్ గా స్టోరీ నడిపారని అంటున్నారు. సినిమాలో చంద్రబాబు నాయుడిపై సెటైర్లు పడ్డాయని చెబుతున్నారు.

ఓటుకి నోటు కేసులో ఆడియో టేపుని కూడా వాడినట్లు తెలుస్తోంది. మమ్ముట్టి పలికే కొన్ని డైలాగులు మర్చిపోలేని విధంగా ఉన్నాయట. వైఎస్ జగన్ కి సంబంధించిన ప్రజా సంకల్పయాత్ర ఒరిజనల్ వీడియోలను ఈ సినిమాలో చూపించారని చెబుతున్నారు.

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…