Asianet News TeluguAsianet News Telugu

నిజం...స్టార్ హీరోయిన్ కు కేవలం 11 రూ. రెమ్యూనరేషన్‌

కేవలం 11 రూపాయల మాత్రమే రెమ్యునేషన్ తీసుకుంది సోనమ్ కపూర్. ఈ విషయాన్ని భాగ్‌ మిల్కా భాగ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా తన బయోగ్రఫీలో ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు.
 

When  Sonam Kapoor took Rs 11 as remuneration
Author
Mumbai, First Published Aug 11, 2021, 12:04 PM IST

బాలీవుడ్ హీరోయిన్ అయినా మరొక భాషా హీరోయిన్  అయినా రెమ్యునేషన్ ఎంత ఉంటుంది... మూడు లేదా నాలుగు కోట్లు  పైమాటే ఉంది..ఒక్కోసారి అది ఎనిమిది నుంచి పదికోట్లు దాకా ఉంటుంది. అయితే 2013లో కేవలం 11 రూపాయల మాత్రమే రెమ్యునేషన్ తీసుకుంది సోనమ్ కపూర్. ఈ విషయాన్ని భాగ్‌ మిల్కా భాగ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా తన బయోగ్రఫీలో ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు.

వివరాల్లోకి వెళితే.. భారత దిగ్గజ క్రీడాకారుడు దివంగత మిల్కాసింగ్‌ జీవితాధారంగా తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘బాగ్‌ మిల్కా బాగ్‌’. పరుగులో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్న మిల్కాసింగ్‌ రోమ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొని 0.1 సెకన్ల తేడాతో కాంస్యం అందుకోలేకపోయారు. కామన్‌వెల్త్‌లో పతకం అందుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ‘ఫ్లయింగ్‌ సిఖ్‌గా’ పేరొందారు. అలాంటి ఈ మహోన్నత అథ్లెట్‌ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు దర్శకుడు రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా. మిల్కాసింగ్‌ పాత్రని ఫర్హాన్‌ అక్తర్‌ పోషించారు.

ఇక వెండితెరపై ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటుగా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ఫరాన్‌ అక్తర్‌, సోనం కపూర్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించడమే అదృష్టంగా భావించిన నటీనటులు.. నామమాత్రపు రెమ్యునేషన్ తీసుకున్నారు. సోనమ్ సైతం కేవలం 11 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్‌ తీసుకుందట. 
 
  ‘భాగ్ మిల్కా భాగ్’కు అప్పట్లో 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పంటపండింది. 2013కు గానూ ఉత్తమ చిత్రం, నటుడు, దర్శకత్వం, గీతం, ప్రొడక్షన్ డిజైన్, దుస్తులు విభాగాల్లో ఆ చిత్రం అవార్డులు దక్కించుకుంది.  భావోద్వేగంతో కూడిన ఈ సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తన బయోపిక్‌ని చూసి ఎంతో ఆనందించారు మిల్కాసింగ్‌. ఈ విషయాలన్ని బయోపిక్ లో గుర్తు చేసుకున్నారు రాకేశ్ ఓం ప్రకాష్. 

Follow Us:
Download App:
  • android
  • ios