టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, ఆయన మాట తీరు యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. తన సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురుచూసే రోజులు వచ్చేశాయి. అయితే అదే యాటిట్యూడ్ తో విజయ్ కోరి మరీ కష్టాలు తెచ్చుకుంటున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వస్తే.. విజయ్ నటించిన 'టాక్సీవాలా' సినిమా విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే రిలీజ్ కి ముందే ఈ సినిమాను కొందరు స్టూడెంట్స్ ఆన్ లైన్ లో పెట్టేశారు. దీంతో ఆ ప్రింట్ పైరసీ వాళ్ల చేతుల్లోకి వెళ్లడంతో వారు రకరకాల సైట్స్ లో సినిమాను పెట్టేశారు.

దీంతో విజయ్ దేవరకొండ తన సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో పైరసీ రాయుళ్లకు మిడిల్ ఫింగర్ చూపించారు. అంతేకాదు.. రీసెంట్ గా జరిగిన సినిమా సక్సెస్ మీట్ లో కూడా పైరసీ వాళ్లకు వార్నింగ్ ఇస్తూ మాట్లాడారు. ఈ స్పీచ్ విన్న చాలా మంది విజయ్ అలా మాట్లాడకుండా ఉండి ఉంటే బెటరేమో అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో హీరో విశాల్ కూడా ఇలానే పైరసీ వాళ్లకు ఛాలెంజ్ చేశాడు.

కానీ పైరసీని అరికట్టలేకపోయాడు. అసలు ఎవరు ఎక్కడ నుండి ఎలా పైరసీ చేస్తున్నారో తెలుసుకోలేక ఈ విషయంలో పోలీసులు సైతం చేతులెత్తేశారు. విశాల్ రెచ్చిపోతూ చేసిన వ్యాఖ్యల కారణంగా కోలివుడ్ లో అతడి మార్కెట్ పడిపోయింది. తను నటిస్తోన్న ప్రతి సినిమాను పైరసీ చేస్తున్నారు. కొన్నిసార్లు చెప్పిమరీ విశాల్ సినిమా విడుదలైన మొదటిరోజే ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. 

దీంతో అతడి తమిళ మార్కెట్ పై బాగా ఇంపాక్ట్ పడుతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండని కూడా పైరసీరాయుళ్లు టార్గెట్ చేస్తే అతడి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నగా మారింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో హీరోగా ఎదుగుతున్నాడు. తన యాటిట్యూడ్ పైరసీ చేసే వాళ్లపై చూపించకపోతేనే మంచిదని అంటున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

'టాక్సీవాలా' రెండు రోజుల కలెక్షన్స్!

'టాక్సీవాలా'కి స్టార్ హీరో స్పెషల్ పార్టీ!

టాక్సీ వాలా కలెక్షన్స్: మరోసారి అదరగొట్టిన విజయ్!

‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ..

'గీత గోవిందం' తరువాత సినిమాలు మానేయాలనుకున్నాడట!

'టాక్సీవాలా': ఆవేదనతో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఫేస్ బుక్ పోస్ట్ లు

విజయ్ దేవరకొండ సినిమాపై నో బజ్!

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా