MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: చిరంజీవి నటించిన ఆ సినిమా అంటే బాలకృష్ణకు ప్రాణం.. ఇంతకీ ఆ మూవీ ఏదంటే.?

Balakrishna: చిరంజీవి నటించిన ఆ సినిమా అంటే బాలకృష్ణకు ప్రాణం.. ఇంతకీ ఆ మూవీ ఏదంటే.?

Balakrishna: నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య బాక్సాఫీస్ వద్ద మూడు దశాబ్దాలుగా తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, నిజ జీవితంలో వీరిద్దరూ మంచి స్నేహితులు. చిరంజీవి నటించిన సినిమాల్లో బాలయ్యకు అత్యంత ఇష్టమైన సినిమా ఏదో తెలుసా? 

1 Min read
Author : Pavithra D
Published : Mar 04 2026, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆ సినిమా అంటే బాలయ్యకు ప్రాణం..
Image Credit : Facebook/Nandamuri Balakrishna

ఆ సినిమా అంటే బాలయ్యకు ప్రాణం..

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు మంచి స్నేహితులు. మూడు దశాబ్దాల నుంచి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉంది. వీరి సినిమాలు విడుదలవుతున్నాయంటే థియేటర్ల వద్ద అభిమానుల సందడి, గొడవలు మామూలే. అయితే, వెండితెరపై పోటీ ఎలా ఉన్నా, నిజ జీవితంలో మాత్రం బాలయ్య, చిరు ఎంతో ఆప్యాయంగా ఉంటారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
బాలయ్యకు ఇష్టమైన 'జగదేకవీరుడు':
Image Credit : Nandamuri Balakrishna\Instagram

బాలయ్యకు ఇష్టమైన 'జగదేకవీరుడు':

చిరంజీవి నటించిన చిత్రాల్లో బాలకృష్ణకు ఇష్టమైన సినిమా 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఒక అద్భుతమని బాలయ్య పలు సందర్భాల్లో కొనియాడారు. ఈ చిత్రంలోని మేకింగ్ స్టైల్, చిరంజీవి నటన ఆయనకు చాలా ఇష్టమట. అలాగే చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన 'ఖైదీ' సినిమా కూడా తనకు ఎంతో ఇష్టమని బాలయ్య తెలిపారు.

Related Articles

Related image1
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Related image2
Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?
35
'అన్ స్టాపబుల్' షోలో కూడా..
Image Credit : facebook.com/NandamuriBalakrishna

'అన్ స్టాపబుల్' షోలో కూడా..

'అన్ స్టాపబుల్' షోలో కూడా చిరంజీవి గురించి బాలయ్య గొప్పగా మాట్లాడిన సందర్బాలు లేకపోలేదు. చిరంజీవి సినిమాల్లో ఉండే పోరాటాలు, డ్యాన్స్‌లు, ఆయన చూపించే గ్రేస్ అంటే తనకు చాలా గౌరవమని చెప్పారు. వీరిద్దరూ తరచుగా కలుసుకున్నప్పుడు ఒకరి సినిమాల్లోని ప్లస్, మైనస్ పాయింట్ల గురించి చర్చించుకుంటూ ఉంటారట.

45
చిరుకు ఇష్టమైన బాలయ్య సినిమాలు
Image Credit : facebook.com/NandamuriBalakrishna

చిరుకు ఇష్టమైన బాలయ్య సినిమాలు

కేవలం బాలయ్య మాత్రమే కాదు, చిరంజీవి కూడా నందమూరి హీరో సినిమాలను ఇష్టపడుతుంటారు. బాలకృష్ణ నటించిన 'నరసింహ నాయుడు', 'సమరసింహారెడ్డి' చిత్రాలు అంటే తనకు ఎంతో ఇష్టమని చిరంజీవి పలుమార్లు మీడియా ముందు వెల్లడించారు. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ ఫ్యాక్షన్ చిత్రాల్లో బాలయ్య నటనను చిరు ప్రశంసించారు.

55
వీరిద్దరి మధ్య ఉన్న..
Image Credit : Asianet News

వీరిద్దరి మధ్య ఉన్న..

ఏళ్లు గడుస్తున్నా వీరిద్దరి మధ్య ఉన్న ఈ పరస్పర గౌరవం, స్నేహమే వారిని అగ్ర స్థానంలో నిలబెడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు అగ్ర హీరోల మధ్య ఉన్న ఈ ఆరోగ్యకరమైన వాతావరణం అభిమానులకు కూడా ఒక మంచి మెసేజ్ అందిస్తోందని చెప్పొచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhuri Dixit: గర్భవతి, పైగా జ్వరం.. అయినా 13 గంటలు డ్యాన్స్ చేసిన హీరోయిన్
Recommended image2
Janhvi Kapoor: 8 ఏళ్లలో 15 సినిమాలు చేసిన పెద్ది హీరోయిన్.. చివరి 5 సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్
Recommended image3
Mirchi Madhavi: హీరోయిన్ కాకపోతే ఆంటీనేనా? ప్రభాస్ కామెంట్స్, వేధింపులపై నోరు విప్పిన మిర్చి మాధవి
Related Stories
Recommended image1
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Recommended image2
Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved