Asianet News TeluguAsianet News Telugu

పాములా బుసలు కొడుతున్న సర్కార్ లేడి

ఈ మధ్య కోలీవుడ్ లో వరలక్ష్మి పేరు గట్టిగా వినిపిస్తోంది. స్టార్ హీరోలతో సమానంగా మేడంకి క్రేజ్ గట్టిగానే వస్తోంది. సర్కార్ సినిమాతో సౌత్ మోస్ట్ డేంజరస్ విలన్ గా మారిన అమ్మడు ఇప్పుడు విషం చిమ్మే నాగ కన్య అవాతారం ఎత్తింది. పాములా బుసలు కొడుతున్న సర్కార్ లేడి సరికొత్త లుక్ లో సౌత్ జనాలను ఆకర్షిస్తోంది. 

Varalakshmi Sarathkumar in a glamourous role in NagaKanya
Author
Hyderabad, First Published Feb 8, 2019, 8:24 PM IST

ఈ మధ్య కోలీవుడ్ లో వరలక్ష్మి పేరు గట్టిగా వినిపిస్తోంది. స్టార్ హీరోలతో సమానంగా మేడంకి క్రేజ్ గట్టిగానే వస్తోంది. సర్కార్ సినిమాతో సౌత్ మోస్ట్ డేంజరస్ విలన్ గా మారిన అమ్మడు ఇప్పుడు విషం చిమ్మే నాగ కన్య అవాతారం ఎత్తింది. పాములా బుసలు కొడుతున్న సర్కార్ లేడి సరికొత్త లుక్ లో సౌత్ జనాలను ఆకర్షిస్తోంది. 

ఎల్.సురేష్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ నాగకన్య సినిమా తెలుగు లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. వరలక్ష్మితో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. క్యాథరిన్ - లక్ష్మి రాయ్ సర్కార్ విలన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్న చిత్ర యూనిట్ త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేస్తోంది. 

తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయాలనీ చిత్ర నిర్మాణ సంస్థ సిద్ధమవుతోంది. నాగ శాస్త్రంలో ఉన్న సరికొత్త విషయాలు సినిమాలో ఉంటాయట. విషం కక్కే భయంకరమైన నాగ కన్య పాత్రలో వరలక్ష్మి పాత్ర అందంగా ఉంటుందని సమాచారం. వరలక్ష్మికి ఇప్పుడు మంచి క్రేజ్ ఉండడంతో తమిళ్ లో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక జర్నీ ఫెమ్ జై కూడా సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios