ఎన్టీఆర్,రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి నవంబర్ మొదటి వారంలో  #RRRని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది. ఎన్టీఆర్ తన అరవింద సమేత చిత్రం రిలీజ్ కూడా చేసేసుకుని పూర్తిగా సిద్దమయ్యారు కాని చరణ్ మాత్రం ఇంకా రెడీ కాలేదు. బోయపాటితో ఆయన చేస్తున్న‘వినయ విధేయ రామ’(వర్కింట్ టైటిల్) మాత్రం ఓ కొలిక్కి రాలేదు.

ఆ ప్రాజెక్టు లేటు అవుతూ వస్తోంది. పూర్తి స్దాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని బోయపాటి చెక్కుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన సినిమా అంతగా వర్కవుట్ కాకపోవటంతో ఈ సినిమాతో మళ్లీ నిలబడాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అదే సమస్యగా రాజమౌళి ప్రాజెక్టు కు మారిందని  ఫిల్మ్ నగర్ టాక్. 

మరో ప్రక్క  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కోసం ఎన్టీఆర్‌ సరికొత్త లుక్‌ ట్రై చేస్తున్నారు. ఈ కొత్త లుక్‌ కోసం ఎన్టీఆర్‌ సుమారు 5–6 నెలల పాటు కఠినమైన బాడీ ట్రైనింగ్‌ తీసుకోనున్నారు. ‘దంగల్‌’ సినిమాలో ఆమిర్‌ఖాన్‌ లా  ఎన్టీఆర్‌ కండలు తిరిగిన గెటప్‌లో కనిపిస్తారు. ఈ  ట్రైనింగ్ పీరియడ్ లో మొత్తం స్టీవ్స్‌ లాయిడ్‌ చెప్పిన డైట్‌ ప్రకారమే ఎన్టీఆర్‌ ఫుడ్  తీసుకుంటారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో ముహూర్తం జరుపుకోనుంది. సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తారట. 2020లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

రామ్ చరణ్ ,బోయపాటి సినిమా విషయానికి వస్తే... డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయి న్ గా చేస్తన్న.... ఈ సినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.   దీపావళి స్పెషల్‌గా టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయబోతున్నారట.ప్రస్తుతానికి 80 శాతంషూటింగ్ పూర్తి చేసుకుంది.  

ఇది కూడా చదవండి..

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు