Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!
ధురంధర్ 2 ట్రైలర్ లాంచ్‌పై వస్తున్న ఊహాగానాలు ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకున్నాయి. మొదట పుకార్లుగా కొట్టిపారేసినా, ఇప్పుడు దీని వెనుక ఓ సాంస్కృతిక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మేకర్స్ ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు సమాచారం.
13

Image Credit : Facebook
Trailer Postponed Amid Chandra Grahan Buzz
రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' ట్రైలర్‌ను మార్చి 3, 2026న రిలీజ్ చేయాలని మొదట ప్లాన్ చేశారు. కానీ అదే రోజు మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉండటంతో, మేకర్స్ ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు టాక్. శుభకార్యాలకు గ్రహణం మంచిది కాదనే నమ్మకంతో ట్రైలర్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు మార్చి 5 లేదా 6న డిజిటల్‌గా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
23
Image Credit : Facebook
'ధురంధర్'కు సీక్వెల్
బ్లాక్‌బస్టర్ 'ధురంధర్'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ధురంధర్ 2'ను మార్చి 19, 2026న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమా టీజర్‌కు 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. 1 నిమిషం 48 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్, సినిమా ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది.
33
Image Credit : Instagram
మార్చి 19న బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే
మార్చి 19న బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగనుంది. 'ధురంధర్ 2'తో పాటు యశ్ నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్', అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న 'డెకాయిట్' కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలో రణ్‌వీర్‌తో పాటు ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యామీ గౌతమ్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్.
Latest Videos

