దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి' సినిమా తరువాత మరో ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా మల్టీస్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

మరికొద్దిరోజుల్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించి ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది. సినిమాలో ఎన్టీఆర్ విలన్ గా చరణ్ హీరోగా కనిపించనున్నారని, బాలీవుడ్ లో వచ్చిన 'ధూమ్' తరహాలో నడిచే సినిమా అని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే ఈ విషయాలపై చిత్రబృందం నుండి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. తాజాగా మరో ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ సీన్ కోసం రాజమౌళి భారీగా డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఈ ఒక్క సన్నివేశాన్ని దాదాపు 45 రోజుల పాటు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఈ ఎపిసోడ్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారని అందులో ఒక విదేశీ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. మరి ఈ విషయంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి!

ఇది కూడా చదవండి.. 

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు