Asianet News TeluguAsianet News Telugu

దర్శకుడినే కాదు.. హీరోయిన్ ని కూడా తీసేస్తారట!

టాలీవుడ్ లో సక్సెస్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా నటిస్తోన్న ఈ రీమేక్ కి 'వర్మ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. 

update on arjun reddy remake varma movie
Author
Hyderabad, First Published Feb 9, 2019, 9:47 AM IST

టాలీవుడ్ లో సక్సెస్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా నటిస్తోన్న ఈ రీమేక్ కి 'వర్మ' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

దర్శకుడు బాల రూపొందించిన ఈ సినిమా అవుట్ పుట్ నిర్మాతలకు నచ్చకపోవడంతో సినిమా మొత్తాన్ని మళ్లీ రీషూట్ చేయడానికి సిద్ధమయ్యారు. దర్శకుడిగా బాలకి బదులు మరొకరిని తీసుకొచ్చారు. ఇది బాలకి పెద్ద అవమానమనే చెప్పాలి. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ ని కూడా మార్చేస్తారని సమాచారం.

ఈ సినిమాతో పరిచయం కావాల్సిన హీరోయిన్ మేఘకి అసలు సినిమా రీషూట్ చేయనున్నారనే విషయం కూడా తెలియదట. తన పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నానని, ఎవరూ తనకు సమాచారం ఇవ్వలేదని అంటోంది. రీషూట్ లో తన ఉంచుతారా..? లేక ఆమె స్థానంలో మరొకరిని తీసుకుంటారా..? అనే విషయంలో కూడా క్లారిటీ లేదంటోంది.

మొదటినుండి ధృవ్, మేఘల కాంబినేషన్ పై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయంలో కూడా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. రీషూట్ కారణంగా ఈ నెలలోనే విడుదల కావాల్సిన సినిమా జూన్ కి వెళ్లింది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై దర్శకుడు బాల మాత్రం స్పందించలేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios