హీరోయిన్ కి బట్టలేకుండా ఉండే సన్నివేశాలు ఎందుకు రాశారు.. దర్శకుడికి బుద్ధి ఉండే ఈ సన్నివేశాలు రాశారా.. న్యూడ్ గా నటించాలని తెలిసినా అమలాపాల్ ఎందుకు ఒప్పుకుంది.. ఆమెకు కూడా బుద్ధి లేదా అని కామెంట్స్ చేశారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్.
హీరోయిన్ కి బట్టలేకుండా ఉండే సన్నివేశాలు ఎందుకు రాశారు.. దర్శకుడికి బుద్ధి ఉండే ఈ సన్నివేశాలు రాశారా.. న్యూడ్ గా నటించాలని తెలిసినా అమలాపాల్ ఎందుకు ఒప్పుకుంది.. ఆమెకు కూడా బుద్ధి లేదా అని కామెంట్స్ చేశారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. ఇవన్నీ తిట్లనుకుంటే తప్పులో కాలేసినట్లే.. దర్శకుడిని,అమలాపాల్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇవి.
జులై 19న అమలాపాల్ నటించిన 'ఆమె' తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్ర పోస్టర్ చూడగానే కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే సినిమా అనిపించింది. అందుకే ఈ చిత్ర తెలుగు హక్కులు కొన్నట్లు తమ్మారెడ్డి తెలిపారు.
కానీ సినిమా చూసిన తర్వాత తాను ఆశ్చర్యపోయానని తమ్మారెడ్డి అన్నారు. అమలాపాల్, దర్శకుడు రత్న కుమార్ బుద్ధి ఉండే ఈ సినిమాని తీశారా అనిపించింది. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఇంకా పిచ్చోడు. వీరందరికన్నా సినిమాని కొనుకున్న తాను పిచ్చోడిని అని తమ్మారెడ్డి సరదాగా కామెంట్స్ చేశారు.
ఇలాంటి కథలో నటించాలన్నా, తీయాలన్నా సినిమాపై ఇష్టం ఉండాలని, అలాగే ధైర్యం కావాలని తమ్మరెడ్డి అన్నారు. కథని నమ్మి న్యూడ్ సీన్స్ లో నటించిన అమలాపాల్ ని తప్పకుండా అభినందించాల్సిందే అని తమ్మారెడ్డి తెలిపారు. ఈ చిత్రంలో అమలాపాల్ నటన చూసిన తర్వాత ఈ జనరేషన్ లో ఇంత అద్భుతంగా నటించే నటిని చూడలేదని తమ్మారెడ్డి ప్రశంసలు కురిపించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jul 15, 2019, 1:31 PM IST